జరిగిన హత్యను జరక్కుండా ఆపేయడమే.. ఎలిమెంట్! ఆసక్తిని రేకెత్తించే టైంకట్!!

ఎవరైనా మర్డర్ అయినారనుకోండి.. మృతుల సంబంధీకుల్లో తమవారు తిరిగిరారనే విషాదంతో పాటే.. హంతకుణ్ని తమ చేతుల్లోకి తీసుకుని అప్పటికప్పుడే చంపేయాలన్న కసి కనిపిస్తుంటుంది. కానీ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్టాలది ప్రాధాన్యతా స్థానం కావడంతో.. ఎక్కడో తప్పితే అలాంటి ప్రతీకార చర్యలు విరివిగా కనిపించవు. ఆ క్రమంలో మనిషికి చట్టప్రకారం న్యాయపోరాటం, శత్రువుపై శాపానార్థాలు మినహా చేసేదేముండదు. ప్రాసిక్యూషన్ బాగా జరిగి శత్రువుకు శిక్షపడితే.. పోయిన తమవారు తిరిగిరాకున్నా అన్యాయం చేసినవాళ్లకు శిక్ష పడ్డదన్న కొంత ఊరట కనిపిస్తుంది. కానీ, అదే శత్రువు మళ్లీ బెయిల్ పై బయటకొచ్చి గల్లా ఎగురేస్తే ఆ కోపం ఇక మమూలుగా ఉండదు. ఇవీ మర్డర్ కేసుల్లో రొటీన్ గా కనిపించే భావోద్వేగాలు. కానీ, అందుకు భిన్నంగా… ఫ్యూచర్ లో ఉన్నవారు పాస్ట్ లోకి వెళ్లి అసలు అప్పటికే జరిగిన మర్డర్ ను ఆపేస్తే…? అదే.. టైమ్ కట్!

సినిమా అంటే ఇమాజినేషన్. కలల్ని సైతం భావోద్వేగాలకనుగుణంగా తెరపై ఆవిష్కరించి వావ్ అనిపించొచ్చు. అందులోనూ, టైం ట్రావెలింగ్ థ్రిల్లర్స్ అంటే జనానికి ఇంకొంచెం క్రేజ్ ఎక్కువే. వర్తమానం నుంచి భూతకాలానికో, భవిష్యత్తుకో ప్రయాణించి ఆయా కాలాల్లో నేటి సామాజిక జీవి అనుభూతులను సినిమాకు కథా వస్తువుగా చేసుకుంటున్న చిత్రాలతో పాటు.. కాలాల మధ్య ముడిపెడుతూ తమ సృజనాత్మకతను తెరపై పరుస్తున్న సినిమాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇంతకుముందు వరకూ కేవలం హాలీవుడ్ లో మాత్రమే అలాంటి ప్రయోగాలు కనిపిస్తే.. ఇప్పుడు ఆ సంస్కృతి అన్ని ఇండస్ట్రీస్ లోనూ కనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకూ టైం ట్రావెలింగ్ లో విభిన్నరకాల జానర్స్ చూస్తున్న మనం… క్రైం జానర్ లో కళ్లకు కట్టిన టైంకట్ గురించి కాస్తా చెప్పుకుందాం.

netflix వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న TIMECUT సినిమా పూర్తిగా TOTALLY KILLER సినిమాను పోలి ఉందన్నగి మొట్టమొదట వినిపించే కంప్లైంట్. అయితే, ఈ ఫిర్యాదులో నిజం లేకపోలేదు. TOTALLY KILLERలోనూ 16 ఏళ్ల వయస్సులో అమ్మాయిలను ఓ సీరియల్ కిల్లర్ చంపేయడం.. టైం ట్రావెలింగ్ తో హత్యకు గురైతానని తెలిసిన అమ్మాయి తనను తాను కాపాడుకోవడం కోసం టైం మిషన్ లోకి ఎక్కి సరిగ్గా హత్యలు జరిగిన భూతకాలంలోకి వెళ్లిపోవడం.. అంతకుముందు జరిగిన హత్యలను ఆపే ప్రయత్నమే ఆ సినిమా.

ప్రస్తుతం netflixలో స్ట్రీమింగ్ అవుతున్న TIMECUT కూడా అచ్చూ దాని కాపీలానే సాగుతుంది.

హన్నా మాక్ ఫెర్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. టైమ్ ట్రావెలింగ్ స్లాషర్ జానర్. 2003లో తన సోదరి సమ్మర్ హత్యను.. ఆమె చనిపోయిన తర్వాత జన్మించిన తన చెల్లెలు లూసీ.. భవిష్యత్తు నుంచి భూతకాలానికి వచ్చి ఎలా ఛేదించింది.. తన అక్కను ఎలా కాపాడుకుందనేదే మెయిన్ థీమ్. సమ్మర్ గా ఆంటోనియా జెంట్రీ… లూసీగా మాడిసన్ బెయిలీ నటించిన ఈ సినిమాలో.. పరిశోధనలపైనున్న శ్రద్ధతో చదువు కొనసాగిస్తున్న సమయంలోనే లూసీ నాసాకు సెలెక్టవుతుంది.

కానీ, లూసీ జన్మించేకంటే ముందే చనిపోయిన తన అక్క గురించి తన తల్లిదండ్రులు పడే బాధతో పాటే.. తన అక్క సమ్మర్ ను చంపినట్టుగానే వరుస హత్యలు చేస్తున్న నేరస్థుడెవరై ఉంటారన్న మథనం లూసీని వేధిస్తుంది. పైగా బయట కూడా గతంలో తన అక్కతో పాటు జరిగిన వరుస హత్యల గురించి కొందరు మాట్లాడుకోవడం కూడా లూసీలో తన అక్క మర్డర్ పై మరింత ఆలోచనలో పడేలా చేస్తుంది. ఆ క్రమంలో తన అక్క హత్యకు గురైన చోటకు వెళ్లిన లూసీ అక్కడ టైం ట్రావెలింగ్ మిషన్ పై ప్రయోగాలు జరుగుతుండటం.. దానికి సంబంధించి పరీక్షించే క్రమంలో పొరపాటున ఆమె వెనక్కి వెళ్లిపోవడం జరుగుతుంది. అయితే, ఆమె వెనక్కి వెళ్లిపోయిన కాలం.. లూసీ అక్క సమ్మర్ హత్యకు గురైన సమయమే కావడం… ఆ తర్వాత లూసీ, సమ్మర్ మధ్య అనుబంధాలేవీ గుర్తురాని సీన్స్ తో పాటు… లూసీ, సమ్మర్ ను సీరియల్ కిల్లర్ నుంచి ఎలా కాపాడుకుంటుందన్నదే టైమ్ కట్ సినిమా! అలాగే, ఇంతకూ ఆ సీరియల్ కిల్లర్ ఎవరనేది సినిమాలో ఉత్కంఠను రేకెత్తించే విషయం.

ఈ సినిమాను గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా చెప్పుకునేకంటే… అక్కా, చెల్లెళ్ల మధ్య భావోద్వేగానికే ప్రాధాన్యత ఎక్కువ కనిపిస్తుంది. పైగా కాలాలు మారుతూ టైం ట్రావెలింగ్ చేసే క్రమంలో.. ఆయా కాలాల్లోని రాజ్యాల్లో జీవన విధానాన్ని చూసివచ్చేటువంటి సినిమాలే సాధారణంగా ఎక్కువ చూడొచ్చు. అయితే, క్రైం ఎలిమింట్ ను బేస్ చేసుకుని టైం ట్రావెలింగ్ సినిమాకు కథగా తయారుచేసుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. అయితే, గతంలోనూ ఇటువంటి సినిమాలు చూసినవారికి పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించకపోవచ్చు.. చూడనివారికి మాత్రం ఓ మంచి చాయిస్ ఈ టైంకట్!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles