కూతురు లేని లోటు తీర్చిన పిచ్చుకలు: పంజాబ్‌లో ఆమె ఇల్లు.. ఇప్పుడు వందల పక్షుల గూడు!

ఆమె కూతురు లేదని బాధపడేది.. కానీ, ఇప్పుడు ఐదొందల పక్షులకు తల్లైంది. ఇది పంజాబ్ లో ఆడపిల్ల పుట్టలేదన్న ఓ తల్లి బాధను ప్రకృతి భర్తీ చేసిన కథ.

ఏ ఇంటికైనా వారికున్న బంధువర్గం, స్నేహితులు, పరిచయాలు, పదవులను బట్టి అతిథుల సంఖ్య రావడం సర్వసాధారణం. కానీ, ఓ ఇంటికి పక్షులు అతిథులుగా నిత్యం వస్తుండటం విశేషం. ఆ ఇంటినే తమ బసేరాగా మార్చుకోవడం ఆసక్తికరం.

కొన్ని పక్షులకు ఆ ఇల్లే ఇప్పుడు తమ గూడైతే… మరికొన్ని పక్షులు తాత్కాలికంగా వచ్చి పలకరిస్తుంటాయి. ఆ వచ్చిన పక్షులన్నింటినీ తన పిల్లల్లా చూసుకుంటున్న ఆ మహిళ పేరు హర్ ప్రీత్ కౌర్.

మోగా జిల్లా నిధాన్ వాలా గ్రామానికి చెందిన హర్ ప్రీత్ కౌర్ వయస్సు 39 ఏళ్లు. ఆమె ఇంటి చుట్టూ ఎప్పుడూ పక్షుల కిలకిలారావాలే వినిపిస్తుంటాయి. రోజూ ఆ ఇంటికి సుమారు 500 వరకూ పక్షులు వస్తాయని… ఓ రెండొందల పక్షులు ఆ ఇంటినే తమ ఆవాసంగా చేసుకున్నాయన్నదే ఆసక్తికర విషయం. అయితే ఇదంగా ఒక్కరోజులో జరిగిన తంతు కాదు. దీని వెనుకా ఓ కథ ఉంది.

https://dainik.bhaskar.com/lTXBfSDsC5b

కూతురు కావాలన్న కోరిక!

హర్ ప్రీత్ కౌర్ కు కూతురు పుట్టలేదన్న బాధ ఉండేది. తన కోరిక నెరవేరకపోవడంతో ఆమెలో ఒక విచారం కనిపించేది. అలా మూడీగా బయట తిరుగుతున్న కౌర్ కు.. తన ఇంటి బయట ఓ పక్షి తన పిల్లలతో కలిసి ఉండటానికి సురక్షితమైన స్థలం కోసం వెతుకుతుండటం కనిపించింది. ఆ దృశ్యం ఆమెను కదిలించింది. ఆమెలోని అమ్మతనం అలా మరోసారి మేల్కొంది. కౌర్ వెంటనే ఓ కాగితంతో ఆ పక్షి కోసం ఓ చిన్న గూడు తయారు చేసింది. అక్కడి నుంచి పక్షులతో ఆమె అనుబంధం మొదలైంది. ఆ తర్వాత ఒక్కో పక్షి ఆమె ఇంటికి రావడం మొదలెట్టాయి. వాటికి దాణా, నీళ్లు పెట్టడం ఆమె రోజూవారీ జీవితంలో భాగమైంది.

ఓ సర్జరీ తర్వాత పక్షులతో మరింత పెరిగిన అనుబంధం!

2013లో హర్ ప్రీక్ కౌర్ కు ఓ సర్జరీ జరిగింది. ఆ సమయంలో ఆమె ఒంటరిగా, కొంత నిరాశగా గడిపిన సమయాల్లో.. ఆమె బాధను తీర్చే అతిథులయ్యాయి ఆ పక్షులు. ఉదయం నుంచీ సాయంకాలం వరకూ వాటితో గడపడం మెల్లిమెల్లిగా మానసికంగా ఆమెకు ఓ ఊరటలా మారింది. అలా క్రమంగా ఆ పక్షులు ఆమె కుటుంబంలో భాగస్వాములయ్యాయి. తన ఇంట్లోనే నివాసముంటున్న పక్షులను ఆమె రాకుమారులు, రాకుమార్తెలని పిల్చుకుంటోంది. ఆమె పిలుపు వింటే చాలు ఇప్పుడు పక్షులన్నీ ఆమె చెంతకు చేరుకుంటాయి.

ఇంట్లోనే 300కు పైగా పక్షి గూళ్లు!

పక్షుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ.. వాటికి సరైన ఆశ్రయం అవసరమైంది. దాంతో హర్ ప్రీత్.. తన ఇంట్లోనే వందలాది చిన్న చిన్న ఆశ్రయాలను ఏర్పాటు చేసింది. హిందీలో రైన బసేరాలుగా పిల్చే రాత్రివేళ పక్షులుండే ఆవాసాలను మట్టి, చెక్క వంటి పదార్థాలాతో ఏర్పాటు చేసింది. అలాగే తన ఇంటి చుట్టుపక్కల, గ్రామంలో వీలున్న చోట్ల కూడా అలాంటి గూళ్లను ఏర్పాటు చేశారు హర్ ప్రీత్.

తన పిల్లల్నెగైతే చూసుకుంటుందో పక్షులనూ ఎండాకాలంలో నీళ్లు, ఆహారం పెట్టడంతో పాటే.. చలికాలంలో వాటికి సురక్షితమైన స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు హర్ ప్రీత్. ఆమెకు తన భర్తతో పాటు, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తుండటంతో.. ఇప్పుడు హర్ ప్రీత్ ఇళ్లు ఓ పక్షుల గూడుగా మారిపోయింది.

చెట్లు తగ్గితే పక్షులకు గూళ్లెక్కడ..?

ఈ ప్రశ్నే వేస్తున్నారు హర్ ప్రీత్ కౌర్. చెట్లు తగ్గిపోవడంతో పక్షులకు అవసరమైన సహజమైన గూళ్లు, నివాస స్థలాలు తగ్గిపోతున్నాయన్నది ఆమె ఆవేదన. అందుకే ప్రతీ ఇంట్లో పక్షుల కోసం ఓ చిన్న ఆశ్రయం ఏర్పాటు చేయాలని.. ఇంటి పైకప్పులపై మట్టి పాత్రల్లో నీళ్లు పెట్టాలని, కొంత దాణా అందించాలని తక్కిన సమాజాన్నీ కోరుతున్నారు.

కూతురు కావాలన్న ఓ మహిళ కోరిక తీరకపోవచ్చుగానీ… వందలాది పక్షులనే కూతుళ్లుగా ఇచ్చి ప్రకృతి ఆమె అభిలాషను భర్తీ చేసింది. హర్ ప్రతీ కౌర్ ఇంటి గోడల మధ్య మొదలైన అనుబంధం.. ఇప్పుడు ఓ గ్రామం మొత్తానికీ, మిగిలిన సమాజానికీ ఓ సందేశంగా మారింది. మనిషి ప్రకృతికి కొంత చోటిస్తే… తిరిగి ఆ ప్రకృతి కూడా మనకు ఎంతో ప్రేమను తిరిగిస్తుందేమో! అందుకు ఓ ఉదాహరణ ఈ హర్ ప్రతీ కౌర్ కథ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles