మనవణ్ని ఆశ్చర్యపర్చిన తాత పాప్యులారిటీ!

ప్యార్ హువా ఇక్ రార్ హువా అంటూనే.. ప్రేమంటే ఎందుకు భయమని ప్రశ్నించాడు. సవాళ్లను స్వీకరించాలని అందరినీ తన నటనతో ప్రేమలో పడేశాడు. మరి ఆ రాజ్ కపూర్ అంటే ఎంత ఫేమ్..? హిందీ సినీ అభిమానులకు.. ఇంకా కావాలంటే భారతదేశం మొత్తం ఆయన్నారాధించే స్థాయిలో అనుకోవచ్చా..? కానీ, రాజ్ కపూర్ ఇంపాక్ట్ అంతకుమించి! ఆయన్ను క్లార్క్ గేబుల్ తో పోల్చింది ప్రపంచ సినిమా. అలాంటి ఓ జ్ఞాపకాన్నే పంచుకున్నారు ఆయన మనవడు.

ఒకానొక రోజు అమెరికా పెన్సిల్వేనియాలో భారీ మంచు తుఫాన్ గడగడలాడించింది. ఆ సమయంలో రాజ్ కపూర్ మనవడైన నిఖిల్ నందా… యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువుతున్నాడు. రెండు నుంచి మూడడుగుల మేర మంచంతా పేరుకుపోయింది. నందా ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాడు. 20 నుంచి 30 నిమిషాలవుతోంది కానీ ట్యాక్సీ దొరకలేదు. చివరకొక క్యాబ్ దొరికింది. క్యాబ్ లో కూర్చున్న నందాకు… ముందర నుంచి చిన్న సౌండ్ తో రాజ్ కపూర్ పాటలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ ను మీదెక్కడా అని అడిగితే రష్యా అని చెప్పాడు. రాజ్ కపూర్ మా తాతయ్య అని చెప్పాడు నిఖిల్. డ్రైవర్ నవ్వి ఊరుకున్నాడే తప్ప నమ్మలేదు. కానీ, లక్కీలీ తన తాతతో నిఖిల్ దిగిన ఓ ఫోటో తన దగ్గరుంది. డ్రైవర్ నమ్మకపోయేసరికి ఈగో కాస్తా దెబ్బతిన్న నందా.. ఆ ఫోటోను ఆ రష్యన్ డ్రైవర్ కు చూపించాడు. వెంటనే క్యాబ్ ఆపిన ఆ డ్రైవర్ వచ్చి నిఖిల్ నందాను సార్ మీరు నిజంగా రాజ్ కపూర్ మనవడా అంటూ తన భాషలో అడగడంతో పాటే… నందాను గమ్యస్థానంలో దింపి.. బలవంతం చేసినా.. క్యాబ్ ఛార్జ్ కూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు. అప్పుడర్థమైందట తన తాత రాజ్ కపూర్ ఎంత ఫేమసో!

రాజ్ కపూర్ ప్రభావం భారత్ కే పరిమితం కాలేదు.. విదేశాల్లోనూ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నందాకు ఎదురైన ఉదంతం వెల్లడించింది. ఆ డ్రైవర్ చెప్పినందాన్ని బట్టి తన తాతకు రష్యాలో ఎంత అభిమానముండేదో తనకర్థమైందంటూ ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడాయన.

రాజ్ కపూర్ పాప్యులారిటీ ఎంతంటే..?

రాజ్ కపూర్ తీసిన ఆవారా చిత్రం 1954 – 55 కాలంలోనే సోవియట్ యూనియన్ తో పాటు.. ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా వంటి దేశాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. హావారా హూ పాటనైతే సోవియట్ యూనియన్ ఉర్రూతలూగించింది. అప్పట్లోనే పాన్ ఇంటర్నేషనల్ స్టార్ రాజ్ కపూర్. ఎందుకంటే తన 12 పాటలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోకి అనువదించుకున్నారంటేనే ఆయన ప్రభావం ఎంతగా ఉండేదో చెప్పనక్కర్లేదు. సోషలిజం భావవ్యక్తీకరణకూ తన సినిమాను మాధ్యమంగా మల్చుకున్నవాడు రాజ్ కపూర్.

రాజ్ కపూర్ తో నందా బంధమేంటి..?

రాజ్ కపూర్ బిడ్డ కొడుకు నిఖిల్ నందా. చిన్నప్పట్నుంచీ వేసవి సెలవుల్లో ముంబైకి తీసుకెళ్లి.. తన తాత, అమ్మమ్మల దగ్గరే తన తల్లి రీతూ నందా దింపేదని.. దాంతో తన తాతను తాను ఒక స్టార్ నటుడిగా చూడటం కంటే.. తాతయ్య అన్న ఆప్యాయతే ఎక్కువుండేదన్నాడు.

నిఖిల్ కు రాజ్ కపూర్ ఏం సలహా ఇచ్చారు..?

సుమారు 12 ఏళ్ల వయస్సులో రాజ్ కపూర్ తో జరిగిన ఓ సంభాషణలో మీ మనవడిగా నేను ఎలా ఎదగాలని మీరు అనుకుంటున్నారని నిఖిల్ ప్రశ్నించాడట రాజ్ కపూర్ ని. నువ్వు జీవితంలో పదవీ విరమణ చేసేనాటికతి ఖరీదైన కారులో కాకుండా.. సాధారణ రిక్షాలోనో, ఆటోలోనో దిగినా ప్రజలు నీకు ప్రేమతో నమస్కరిస్తే.. నువ్వు సృష్టించిన పేరు, గౌరవం, ప్రేమే నీ సపందవుతుందని చెప్పారట రాజ్ కపూర్. నువ్వూ సంపాదించాల్సిందదేనని సూచించారట.

నిఖిల్ నందా గురించి!

నిఖిల్ నందా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా బచ్చన్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. నవ్యా నవేలీ నందా, అగస్త్యా నందా. అగస్త్యా నంద ది ఆర్చీస్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇటీవలే ఇక్కిస్ సినిమాలోనూ నటించాడు.

నిఖిల్ నందా అగ్రికల్చర్ మిషనరీ, కన్స్ట్రక్షన్ మిషనరీ, రైల్వే ఎక్విప్మెంట్స్ తయారీ సంస్థైన ఎస్కార్ట్స్ కుబోటా అనే సంస్థకు ఎండీ అండ్ చైర్మన్ పొజిషన్ లో పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles