మూడు సెంచరీల మధ్యన కనుమరుగైన ఇన్నింగ్స్!

వెంకట్రామయ్య గుళ్లపల్లి.. ✍🏼

మూడు సెంచరీల మధ్యలో కనుమరుగైన సొగసైన ఇన్నింగ్స్!

ఈ మ్యాచ్‌లో అందరి కంటే ఎక్కువ బంతులు ఆడింది రాహుల్.. 328 బంతులు.. టెస్ట్ క్రికెట్‌లో అదే విలువైన ఫాక్టర్..

టెస్టు క్రికెట్లో బంతి పాతబడే వరకూ బ్యాటింగ్ చేయడమే మ్యాచ్‌లను నిలబెట్టేది..

ఈ ఫార్ములా ఓవర్సీస్‌లో పక్కాగా ఫాలో అయ్యే ప్లేయర్ రాహుల్.. ద్రావిడ్ అదే చేసేవాడు..

సాహిత్య చాలా సార్లు తిట్టేది.. వాడు ఆడకపోయినా ఎందుకు వెనకేసుకు వస్తావని.. ఇప్పుడు రాహుల్‌కి ఫ్యాన్ అయిపోయింది..

రాహుల్ నిలబడటంతోనే ఇంగ్లీష్ బౌలర్లు అలసిపోయారు, అది తర్వాత కలిసి వచ్చింది..

గమనించారా.. గిల్ 80 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేస్తే.. రాహుల్ 93 బంతుల్లో 30.. అంటే 16 ఓవర్లు దాదాపుగా ఆడేసాడు..

141 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసాడు.. అప్పటికి గిల్ ఆడింది 112.. బంతులే.. దాదాపు 60 చేసినట్టు ఉన్నాడు గిల్..

గిల్‌కు ఫాస్ట్ బౌలర్ల వీక్నెస్ ఉంది.. బంతి పాతబడే వరకూ రాహుల్ డీల్ చేసాడు.. కావాలంటే చూసుకోండి.. గిల్ ఆడినా షాట్స్ ఆడాడు..

ఆ తర్వాత కాస్త స్పీడ్ పెంచాడు.. ఒక స్టేజ్‌లో ఇద్దరూ ఆడిన బంతుల్లో దాదాపు 50 బాల్స్ తేడా ఉంది.. పరుగులు దగ్గరగానే ఉన్నా..

చాలా సేపు, 30,40 మధ్య నడిపాడు.. స్పిన్ వస్తేనే గిల్‌కు ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాడు..

గిల్ 150 బాల్స్ ఆడే సమయానికి రాహుల్ 200 దాటేసాడు..

సింగిల్ ఛాన్స్ ఇవ్వలేదు సెకండ్ ఇన్నింగ్స్ లో.. మొత్తం 230 బంతులు ఆడాడు..

అవుటైన బాల్ తీసేస్తే 229.. సింగిల్ లైఫ్ లేదు..

యార్కర్, ఫుల్ లెంగ్త్, షార్ట్ పిచ్ బాల్స్.. చాలా పర్ఫెక్ట్ గా ఆడాడు.. డాసన్ బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ డిఫెన్స్ టెక్నిక్ బా నచ్చింది..

గిల్ ను డైరెక్ట్ చేయడం, స్ట్రైక్ రొటేట్ చెయ్యడం, బౌలర్లు అలసిపోయేలా చేసాడు..

నిజానికి రాహుల్, గిల్ దెబ్బకు 4వ రోజే ఇంగ్లాండ్ బౌలర్ల పని అయిపోయింది..

రాహుల్ ఇన్నింగ్స్‌లో ఒకటి రెండు ఫోర్లు మినహా.. అద్భుతమైన షాట్స్ ఉన్నాయి..

ఈ సీరీస్‌లో సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ రాహుల్..

పిచ్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు..

ఆర్చర్ బౌలింగ్‌లో రాహుల్ ఆట చాలా బాగా నచ్చింది.. ఆ బ్యూటిఫుల్ టెక్నిక్‌కు ఎన్ని మార్కులు వేసినా తక్కువే..

ఐపీఎల్ అప్పుడు రాసా.. రాహుల్ 2.o చూస్తాం ఇంగ్లాండ్‌లో అని..

మరో మూడు నాలుగేళ్ళు టీమిండియా బ్యాటింగ్ పిల్లర్ రాహుల్..

ఎన్నాళ్ళకు రాహుల్ టాలెంట్ క్రికెట్ ప్రపంచం చూసింది..!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles