ఓ పిట్ట కోసం నెలరోజుల చీకట్లనుభవించిన ఓ గ్రామం!

చిన్న పిట్ట కోసం, 35 రోజులపాైటు… చీకటిలోనే ఉండిపోయిన గ్రామం!

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పిట్ట పేరు రాబిన్ చోజ్.. కొన్ని ప్రాంతాల్లో దీనిని ధోభీ పిట్ట అని కూడా పిలుస్తుంటారు. ఎక్కువగా నీటి వసతి ఉన్న చోటే ఈ పిట్ట కనిపిస్తూ ఉంటుంది. ఆకారంలో చాలా చిన్నగా కనిపిస్తూ.. శబ్దాలను చేస్తూ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. అలాంటి ఈ చిన్నపిట్ట కోసం ఓ గ్రామంలో నెల రోజుల పాటుగా అంధకారంలోకి వెళ్ళిపోయింది.

అవునండీ.. ఇది మీరు నమ్మలేకపోయినా నిజం.. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కొత్తకుడి అనే గ్రామంలో వీధి దీపాలను ఆన్ చేసే జంక్షన్ బాక్స్ లో ధోభీ పిట్ట గూడుకట్టుకుంది. అందులో మూడు గుడ్లు కూడా పెట్టుకుంది. అయితే అనుకోకుండా వీధిదీపాలను ఆన్ చేసేందుకు వెళ్లిన ఓ యువకుడికి ఈ సీన్ కనిపించింది. అయ్యో పాపం.. అనుకోని.. ఆ పూటకి లైట్లు వెయ్యడం మానేసి.. ఆ విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు. అయితే గ్రామస్థులు కూడా ఆ యువకుడు చేసిన పనిని మెచ్చుకొని.. ధోభీ పిట్ట గుడ్లు పొడిగేంతవరకూ లైట్లు వేయవద్దని తీర్మానించుకున్నారు.

ఇలా ఒక రోజు .. రెండు రోజులు కాదు.. ఏకంగా 35 రోజుల పాటుగా వీధిదీపాలను ఆన్ చేయలేదు. గ్రామంలోని 35 లైట్లు వెలగకపోయినా.. సంతోషంగా చీకటిలోనే ఆ బాధను భరించారు. ధోబీ పిట్ట గుడ్లు పొదిగి పిల్లలు బయటకు వచ్చాక అప్పుడు గ్రామంలో తిరిగి లైట్లు ఆన్ చేశారు. ధోబీ పిట్ట గుడ్లు పెట్టే వరకూ ఆ గ్రామంలో కొందరికి వర్గ తగాదాలు ఉన్నా.. అవన్నీ పక్కనపెట్టి ధోభీ పిట్ట కోసం అందరూ ఒక్కటయ్యారు.

(డిస్ క్లెయిమర్: ఇదెవరో అజ్ఞాన రచయిత రాసిన కాపీ. కానీ, ఇంట్రెస్టింగ్ గా, స్ఫూర్తిదాయకంగా ఉందని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగిందని గమనించగలరు. ఇది జరిగి కూడా చాలా కాలమే అయినా.. కాస్తా ఇంట్రెస్టింగ్ గా ఉందని పోస్ట్ చేస్తున్నది. ఒక మంచి స్టోరీని లోకం ముందుకు సదరు రైటర్ కు కృతజ్ఞతాభినందనలు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles