నియంతల గొప్ప.. వందిమాగధుల వహ్వా!

ఆ నలుగురు! ??

……………………………………………………………………………………………………………

వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త..✍️

ఉత్తర కొరియా అద్ధ్యక్షుడు కిమ్ జోంగ్ ఒక మీటింగ్ లో.. కొన్ని దేశాలు చంద్రుడి మీదకు అంతరిక్ష నౌకల్ని పంపుతున్నాయి . అదేమంత గొప్ప విషయమా.. ? ఉత్తర కొరియా.. త్వరలోనే సూర్యుడి మీదకు అంతరిక్ష నౌకను పంపనుంది.

మీటింగ్ లో అందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు .
“కిమ్ జిందాబాద్.. కిమ్ జిందాబాద్” అంటూ పది నిముషాలు నినాదాలు.

హాల్ లో కూర్చొన్న ఒక వ్యక్తి లేచి నిలబడి భయంతో గజగజ వణుకుతూనే “ఏలినవారు క్షమించాలి.. సూర్యుడు భగభగ మండే అగ్నిగోళం.. అంతరిక్ష నౌక ఎలా పంపుతారనిని అడిగాడు.

“మూసుకోవోయ్.. పెద్ద అడుగుతున్నావు . ఎక్కువ మాట్లాడితే రాత్రికి నా పెంపుడు మొసలికి ఆహారమైపోతావ్! ఇదేమంత గొప్ప సమస్యా ? పగలు పంపితే నీవన్నట్టు వేడి. రాత్రి పూట పంపుతాము.. అంతే సింపుల్ అన్నాడు.

మరోసారి మీటింగ్ లో హర్షాతిరేకాలు.. జనరల్ సెక్రటరి కిమ్ జిందాబాద్ అంటూ స్లోగన్లు!

కట్ చేస్తే… అమెరికాకు నియంత.. సారీ… అధ్యక్షుడు కావాలనుకొంటున్న ట్రంప్ ఒక మీటింగ్ లో.

“మీరు అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయం. మన విరోధి దేశం ఉత్తర కొరియా సూర్యుడి పైకి అంతరిక్ష నౌక పంపుతోంది. మరి మీరేమి చేస్తారు ? ఓ విలేకరి ప్రశ్న..?

అందమైన అమ్మాయిలకు బుర్ర వుండదు అని నేను గతంలో పలుమార్లు చెప్పాను. కిమ్ గాడు కూడా ఒక అందమైన అమ్మాయి లెక్కే. వాడికి అసలు బుర్రే లేదు. ఉట్టెధవ! రాత్రి పూట అంతరిక్ష నౌక పంపుతాడట!!

రాత్రి పూట సూర్యుడుండడనే విషయం తెలియని దద్దమ్మ. వాడిలా దొంగతనంగా రాత్రి పూట పంపను. భూమి పైనున్న మొత్తం ఐస్ అంతా ప్యాక్ చేసి అంతరిక్ష నౌకలో నింపి పగటి పూటే పంపుతాను” ఇదీ ట్రంప్ సమాధానం!

ఇంకేం… “ట్రంపిజం జిందాబాద్” అంటూ ట్రంఫెట్ మోతలు!

మాస్కో – పుతిన్ .. చేతులు కడుక్కుని మీటింగ్ హాల్ లోకి వచ్చాడు .
చేతులు ఇంకా ఎర్రగానే ఉన్నాయి.

అప్పుడు ఒక విలేకరి లేచి నిలబడి.. “అమెరికా మన దేశంలో భాగమైన సైబీరియా నుంచి మంచు మొత్తం కొట్టేసి… అంతరిక్ష నౌకలో పోసి దాన్ని సూర్యుడి పైకి పంపాలని అనుకుంటోంది . మీరేమో మీకు పోటీ వచ్చే అవకాశమున్న మన దేశ నాయకుల్ని చంపే పనిలో ఉన్నారని.. మన దేశ సమగ్రతను కూడా కనీసం కాపాడలేరని.. అమెరికా మీడియా ఘోషిస్తోంది “

ఇది రక్తం అనుకొంటున్నావా ? అబ్బే! చైనా నుంచి తెప్పించిన టమాటో సాస్. ట్రంప్ ను సైబీరియాకు రానిస్తానా.. ? సైబీరియాలో ఉన్న మొత్తం మంచును ఐస్ క్రీంలుగా చేసి ఆఫ్రికాలాంటి ఎండ ఎక్కువగా ఉన్న దేశాల్లో అమ్మేస్తాను.

ఆ డబ్బుతో అణ్వస్త్రాలు తయారు చేసి ప్రపంచానికి నియంతనైపోతాను ” ఇదీ పుతిన్ జవాబు!

యాజ్ ఇట్ ఈజ్… అక్కడా మీటింగ్ లో పుతినిజం జిందాబాద్ అంటూ కూతలు!

బీజింగ్.. జిగుయాంగ్ హాల్.. చైనా అధ్యక్షుడు జింపింగ్.. పుతిన్ లాంటి వాళ్ళు ఒకే సూర్యుడు అనుకుంటున్నారు. వెధవలు! వారికేమి తెలియదు!!

మన పూర్వీకులు పది మంది సూర్యుళ్లున్న విషయాన్ని ఎప్పుడో గుర్తించారు. కార్పోరేట్ కంపెనీల్లోలా ఒకరి తర్వాత ఒక సూర్యుడు ఆకాశంలోకి వస్తారు. మన దేశం ఒకేసారి పది అంతరిక్ష నౌకల్ని… పది సూర్యుళ్ళపైకి పంపుతుంది. ఇక వేడి సమస్య అంటారా.. ? ముందుగా ఇప్పుడు మన ఊహను.. ప్రయోగశాలలో కొత్తగా తయారు చేస్తున్న కరోనా అక్క మరోనాను వదులుతాము . దెబ్బకు సూర్యులందరూ లాక్ డౌన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు అంతరిక్ష నౌకల్ని పంపుతాము. అయినా మనం తయారు చేసిన కృత్రిమ సూర్యుడి ముందు ఈ పది మంది సూర్యుళ్లెంత… ? ఇదీ జింపింగ్ ఆన్సర్!

జింపింగ్ జపాంగ్… లాంగ్ లివ్ చైనీస్ డ్రీమ్స్ అంటూ నినాదాలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles