పచ్చని ప్రకృతి, హిమాలయాల చల్లదనం మధ్య.. విద్యానగరి డెహ్రాడూన్!

స్కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్నంటారు..?

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ గా ప్రసిద్ధి చెందింది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన, చారిత్రాత్మకమైన బోర్డింగ్ స్కూల్స్ కు డెహ్రాడూన్ ఓ హబ్. ఎత్తైన హిమాలయాల నడుమ ఆహ్లాదంగా, ప్రకృతిసిద్ధంగా కనిపించే ఈ నగరం… సహజ సౌందర్యం, ప్రశాంతతతో పాటే ప్రపంచ స్థాయి విద్యకు కేరాఫ్ గా మారింది. దశాబ్దాలుగా డెహ్రాడూన్ దేశంలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా పేరు తెచ్చుకుని… దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచీ విద్యార్థులను ఆకర్షిస్తోంది.

ఎందుకు స్కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా డెహ్రాడూన్ కు ఆ పేరు స్థిరపడింది..?

నాణ్యమైన విద్యావిధానం, క్రమశిక్షణ, సమగ్ర సమ్మిళిత అభివృద్ధి వంటివి డెహ్రూడూన్ ను భారతదేశ విద్యా రాజధానిగా నిలబెట్టాయి. ఇక్కడి స్కూల్స్ కేవలం చదువుకే పరిమితం కాదు. నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాల వంటివాటితో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే విద్యాకేంద్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బోర్డింగ్ స్కూల్స్ లో తమ పిల్లలను చేర్చేందుకు వచ్చే తల్లిదండ్రుల్లో విద్యార్థుల భద్రతపై కల్పించే భరోసాతో కూడా డెహ్రాడూన్ ఓ సేఫెస్ట్ స్టడీ సెంటర్ గా పేరుగాంచింది. అందుకే ఇక్కడ సంప్రదాయ బోర్డింగ్ స్కూల్స్ నుంచి ఆధునిక అంతర్జాతీయ స్కూల్స్ వరకూ ఎవరైనా ఏదైనా ఎంపిక చేసుకునే అవకాశాన్ని డెహ్రాడూన్ కల్పిస్తోంది.

డెహ్రాడూన్ లో కొన్ని ప్రసిద్ధ పాఠశాలల గురించి తెలుసుకుందాం!

ది డూన్ స్కూల్… 1935లో స్థాపించజిన ఈ పాఠశాల భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బాలుర బోర్డింగ్ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇక్కడ విద్యా పునాది పడ్డవాళ్లల్లో నాయకత్వ లక్షణాలెక్కువయ. అందుకు కావల్సిన శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ అలుమ్నీ నెట్వర్క్ గా ప్రసిద్ధి చెందింది ది డూన్ స్కూల్. ముఖ్యంగా ప్రముఖ నాయకులు, దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలెందరో ఇక్కడి చదివి ఇవాళ దేశాన్ని శాసిస్తున్నవారిలో ఉన్నారు.

వెల్హాం గర్ల్స్ స్కూల్… 1957లో ఆరంభమైంది ఈ స్కూల్. భారతదేశంలోనే ఉత్తమ బాలికల బోర్డింగ్ స్కూల్ గా గుర్తింపు పొందింది. క్రమశిక్షణ, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా విద్యనందిస్తోంది ఈ విద్యాకేంద్రం. విద్యతో పాటు, సాంస్కృతికంగా కూడా విద్యార్థులను తీర్చిదిద్దే విద్యాలయంగా దీనికి పేరు.

వెల్హాం బాయ్స్ స్కూల్… విద్య ప్లస్ క్రీడలు.. ఈ రెండింటి సమన్వయంగా వెల్హాం బాయ్స్ స్కూల్ ను చూడాల్సి ఉంటుంది. నాయకత్వం, టీమ్ వర్క్, బాధ్యత వంటి లక్షణాలను విద్యార్థులకు నేర్పిస్తుంది. ఇక్కడ చదివినవారెందరో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులుగా ఎదిగిన చరిత్ర ఈ వెల్హాం బాయ్స్ స్కూల్ ప్రత్యేకత.

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్… 1922లో స్థాపించిన ఈ ఆర్ఐఎంసీ.. జాతీయ రక్షణ అకాడమీలో ప్రవేశానికి విద్యార్థులను సంసిద్ధం చేస్తుంది. సైనిక శిక్షణతో కూడిన విద్యనందిస్తున్న ఉత్తమ విద్యాకేంద్రంగా గుర్తింపు పొందింది. దేశంలోనే పురాతనమైన, క్రమశిక్షణకు మారుపేరైన ఎడ్యుకేషన్ హబ్ గా పేరుగాంచింది.

సెయింట్ జోసెఫ్ అకాడమీ…. 1934లో స్థాపించిన ఈ అకాడమీ కో ఎడ్యుకేషన్ స్కూల్. విద్యానాణ్యత, నైతిక విలువలు, క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ దశాబ్దాలుగా డెహ్రాడూన్ లో మంచి పేరు సంపాదించుకుంది.

ఇలాంటి చారిత్రాత్మకమైన, పురాతనమైన, అంతర్జాతీయ విద్యాకేంద్రాలెన్నో డెహ్రాడూన్ లో కనిపిస్తాయి కాబట్టే ఈ నగరం ఎడ్యుకేషన్ క్యాపిటల్ కు చిరునామాగా మారిపోయింది.

డెహ్రాడూన్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు!

బ్రిటీషర్స్ కాలం నుంచే విద్యా వారసత్వం కల్గిన ప్రాంతంగా డెహ్రాడూన్ ప్రత్యేకత సంపాదించుకుంది. స్వాతంత్రం తర్వాత కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ విద్యా విధానాలను ఎప్పటికప్పుడూ అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఎడ్యుకేషనల్ హబ్ ఇది.

అలాగే, బోర్డింగ్ స్కూల్స్ కు పెట్టింది పేరు డెహ్రూడూన్. అందుకే, ఇక్కడికి దేశవిదేశీ విద్యార్థులు ఆకర్షితులై వలసలు వస్తుంటారు.

చదువుకు అనుకూలమైన వాతావరణం డెహ్రాడూన్ ప్రకృతి కొండల ప్రత్యేకత. అతి తక్కువ కాలుష్యం, ప్రశాంతత విద్యార్థుల దృష్టిని చదువుపైన, తమ ఎదుగుదలపైన దృష్టి సారించేందుకు ఉపయోగపడుతాయి.

డెహ్రాడూన్ ఇవాళ దేశంలో ఎదిగిన ఎందరో ప్రముఖ నాయకులకు, సైనిక అధికారులకు, రచయితలకు, బాలీవుడ్ నటులెందరి చదువులతో కేరాఫ్.

హిమాలయాలకు ముఖద్వారంగా ఉండే డెహ్రాడూన్.. ముస్సోరీ వంటి హిల్ స్టేషన్ కు సమీపంలో ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి అనుకూలమైన వాతావరణం డెహ్రాడూన్ ప్రత్యేకత.

ఇన్ని ప్రత్యేకతలతో విద్యావ్యవస్థలోనూ నేటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుని అనాదిగా పోటీ పడుతోంది కాబట్టే ఇప్పటికీ డెహ్రాడూన్ మన దేశ క్యాపిటల్ ఆఫ్ స్కూల్స్ గా ప్రసిద్ధిగాంచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles