పది ప్రాయంలోనే సీరియల్ కిల్లర్! సైకోపాథ్ గా మారిన ఓ పాప కథ!!

తల్లిదండ్రుల నిరాదరణకు గురై.. ప్రతికూలమైన వాతావరణాల్లో పెరిగితే పిల్లలు ఏవిధంగా తయారవుతారు.. ? సైకోపాథ్ గా రూపాంతరం చెందితే ఏం జరుగుతుంది.. ? ఇంగ్లాండ్ కు చెందిన మేరీ బెల్ కథ స్పష్టం చేస్తుంది. జస్ట్ ఓ సినిమాను తలపించేలా సాగే మేరీ బెల్ స్టోరీలో… చిన్నప్పట్నుంచే వరుస హత్యలకు పాల్పడాల్సిన అవసరమేమొచ్చింది..?

జస్ట్ 10 ఏళ్లకే సీరియల్ కిల్లర్ గా మేరీ బెల్ ఎందుకు మారింది..?

ఇంగ్లాండ్ న్యూ క్యాజిల్ కు చెందిన మేరీ బెల్… 1968లోనే వరుస హత్యలతో వార్తల్లోకెక్కింది. నాల్గేళ్ల మార్టిన్ బ్రౌన్ అనే అమ్మాయిని.. గొంతు కోసి.. తానే మర్డర్ చేసినట్టు నోట్ కూడా రాసిపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్ల పాప బ్రయాన్ హోవ్ ను చంపేసింది.

మేరీ బెల్ అలా తయారు కావడానికి.. ఆమె అప్పటికే అలాంటి హింసాత్మక ధోరణులు, ప్రవృత్తి వంటివి చూసిన వాతావరణ ప్రభావమే ప్రధాన కారణం. అయితే, 1968లో మొట్టమొదటి మర్డర్ చేసేకంటే ముందే… ఎందరో పిల్లల్ని గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నాలు చేసిన మేరీ బెల్.. తన డైరీలో, తనకు చంపాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో కూడా రాసింది. మొత్తంగా జస్ట్ పదేళ్లకే ఓ సైకోపాథ్ గా… ఇంగ్లాండ్ లో పోలీసుల మెయిన్ టార్గెట్ గా మారింది. పదేళ్ల వయస్సు నుంచే హత్యలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరిగిన మేరీ బెల్… ఎట్టకేలకు పోలీసులకు చిక్కి… 12 ఏళ్ల పాటు జైలు శిక్షననుభవించి… తన 23 ఏళ్ల వయస్సులో జైలు నుంచి విడుదలైంది.

అయితే, మేరీ చిన్ననాటే సైకోపాథ్ గా మారడానికి ప్రధాన కారణం ఆమె చుట్టూ ఉన్న హింసాత్మక, జుగుప్సాకర వాతావరణంతో పాటు.. ఆమె తన తల్లి సెక్స్ వర్కర్ అయిన బెట్టీ మెక్క్రికెట్ ప్రేమానురాగాలకు నోచుకోకపోవడం, ఆప్యాయత, ఆత్మీయ స్పర్శ లేకుండా పెరగడం.. కనీసం తండ్రెవ్వరో కూడా తెలియని బాల్యంలో ఒంటరితనానికి గురైంది. 1957, మే 26న బెట్టీ మెక్క్రికెట్ కు 16 ఏళ్ల వయస్సులో మేరీ బెల్ జన్మించింది. తల్లి ఎడతెగని సెక్స్ వర్కర్ బిజీ జీవితంలో.. ఉంటే తినడం.. లేకుంటే పస్తులుండటం.. ఈ క్రమంలో మేరీ బెల్ జీవితం తల్లి ఉన్నా అనాథలా సాగింది.

అలా పదేళ్ల వయస్సు వచ్చేసరికి విపరీత మనస్తత్వం తయారైన మేరీ.. 1968, మే 11న ఓ మూడేళ్ల బాలుణ్ని విమానశ్రయంలో పై నుంచి నెట్టేసింది. కానీ, దానికి మేరీనే కారణమనే ఆధారాల్లేవు. దాంతో ఆ బాలుడి హత్య.. కేవలం ఓ యాక్సిడెంట్ గా నమోదైంది. అదేరోజు ఆమె మరో ముగ్గురు యువతుల గొంతు కోసి చంపడానికి విఫలయత్నం చేసింది. అప్పుడు పోలీసులు చిన్న పాప.. పిల్లల మధ్య ఓ చిన్న గొడవ అన్న ఉద్ధేశ్యంతో.. ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారే తప్ప.. ఎలాంటి చర్యలకూ పూనుకోలేదు.

తన పదకొండో పుట్టినరోజుకు ముందు మేరీ.. స్కాట్స్ వుడ్ లోని ఓ పాడుబడ్డ ఇంట్లో మార్టిన్ బ్రౌన్ ను గొంతు కోసి చంపిన ఘటనతో ఆమె హత్యలు వెలుగులోకొచ్చాయి. మార్టిన్ ఇంటికివచ్చి.. ఆ ఇంట్లో ఉన్న శవపేటిక ఓపెన్ చేసి అందులో పడుకోబెట్టి గొంతు నులిమి చంపేసింది. ఇక అక్కడి నుంచి మేరీ బెల్ రెగ్యులర్ గా ఎవర్నైనా ఒకర్ని చంపే మనస్తత్వంతో.. జస్ట్ లైక్ రాక్షసత్వంతో.. ఓ దెయ్యం పట్టిందానిలాగా తిరిగింది.

అయితే, మార్టిన్ బ్రౌన్ ను చంపాక కూడా మేరీ బెల్ మర్డరర్ అనే విషయం ఆధార సహితంగా ఎక్కడా రుజువు కాకపోవడంతో పాటు.. అనుమానాలు కల్గినా ఏమీ చేయలేని పరిస్థితి అక్కడి పోలీసుల్లో నెలకొంది. కానీ, 1968, జూలై 31వ తేదీన బ్రయాన్ హువేను కూడా తన మరో స్నేహితురాలైన నార్మాతో కలిసి గొంతు నులిమి చంపడంతో.. ఆమె హింసాత్మక ప్రవర్తన న్యూక్యాజిల్ ప్రాంతంలో ఓ పెద్ద చర్చగా మారింది. ఆ కేసులో పోలీసులు ఆధారాలతో సహా మేరీ బెల్ తో పాటు.. నార్మా కలిసి మర్డర్ చేసినట్టుగా నిర్ధారించగల్గారు.

మేరీ బెల్ మానసిక ప్రవృత్తి కారణంగానే.. అభంశుభం ఎరుగని చిన్న వయస్సులోనే వరుస నర హత్యలకు పాల్పడుతోందనే విషయాన్ని.. పోలీసులు, సైకాలజిస్టుల సాయంతో తెలుసుకోగల్గారు. చంపడంలో ఆమెకున్న ఆనందం, ఉత్సాహాన్ని కోర్ట్ ముందుంచడంతో.. మేరీ బెల్ ఎంత చిన్న వయస్కురాలైనా.. సమాజానికి హానికరమనే భావనతో ఆమెకు జైలు శిక్ష వేసింది కోర్ట్. అలా మేరీ బెల్ బ్రిటన్ యంగెస్ట్ ఫీమేల్ కిల్లర్ గా వార్తల్లోకెక్కింది. జైలు జీవితం పూర్తై బయటకు వచ్చిన నాల్గేళ్లకు 1984లో ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లైంది. కానీ, ఆ బిడ్డకు 1998లో తన 14 ఏళ్ల వయస్సు వరకూ కూడా తన తల్లి నేరిచరిత్ర ఎంత మాత్రం తెలియలేదు. అయితే, ఆ తల్లీ బిడ్డల కథ మరోసారి మీడియాలో హైలెట్ అవుతుండటంతో అప్పటివరకూ సస్సెక్స్ కోస్ట్ లో ఉన్న వారు… సుమారు 18 నెలల పాటు కనిపించకుండా పోయారు. టైన్ సైడ్ కు తమ మకాం మార్చేశారు. అక్కడ తన పేరు మార్చుకుని మేరీ బెల్ తన కూతురితో సహా జీవించింది. ఎందుకంటే, ఓ సీరియల్ కిల్లర్ గా చిన్ననాటే ముద్ర వేసుకుని సుదీర్ఘమైన జైలు జీవితమనుభవించి బయటకొచ్చాక… సమాజంలో నల్గురి మధ్య జీవించడమూ ఓ నరకయాతనే. అదే మేరీ బెల్ తన కూతురితో సహా అనుభవించింది. ప్రస్తుతం 67 ఏళ్ల వయస్సులో.. చిన్ననాటే భారమైన తన నేరప్రవృత్తి జీవితానికి భిన్నంగా.. ఆ చేదు జ్ఞాపకాలకు మర్చిపోయేందుకు యత్నిస్తూ.. కొత్త జీవితాన్ని గడుపుతోంది మేరీ బెల్.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన మేరీ బెల్ రియల్ లైఫ్… పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్రతో పాటు.. వారి ఆలనాపాలనా కరువైతే పిల్లలు ఎలాంటి విపరీత మనస్తత్వాలకు గురవుతారో చెప్పేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles