ఈ అభిమన్యుడు.. ఏఐ మార్కెటింగ్ విజయాల్లో మాత్రం అర్జునుడు!

కొత్తగా ఆలోచించాలి. వాటిని మరింత కొత్తగా ఆచరణలో పెట్టి కొత్తదనానికి ప్రతీక కావాలి. ఇదే ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ఎరాలో నేటి యువత లక్ష్యం. అందుకు సృజనాత్మకతా అవసరం. అలాంటి క్రియేటివిటీతో 26 ఏళ్ల యువకుడు ఇప్పుడు కృత్రిమ మేథ మార్కెటింగ్ ఏజెన్సీని పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా తానో చర్చయ్యాడు. పేరుకు అభిమన్యుడే అయినా.. అతడు సాధించిన విజయం నేటి సాంకేతిక యుగంలో అర్జునుడంతటిది. ఎవరతను… ఏం చేశాడు..?

అభిమన్యు నిర్బన్.. 26 ఏళ్ల ఈ కుర్రాడు భారత్ ఇన్నోవేషన్స్ పేరుతో ప్రారంభించిన స్టార్టప్ తో ఇప్పుడు ప్రపంచంలోనే ఓ చర్చయ్యాడు. అభిమన్యు ప్రారంభించిన ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత మార్కెటింగ్ ఏజెన్సీ భారతదేశంలోనే మొట్టమొదటిది. తన భారత్ ఇన్నోవేషన్స్ నేడు నెలవారీ ప్రకటన ఖర్చులు 40 లక్షలైతే… రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ ROAS కింద ఏకంగా పది డాలర్లు వెచ్చిస్తే 150 డాలర్లు రిటర్న్ తో అధిక లాభాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. 42 జ్యూవెల్లరీ బ్రాండ్స్ తో పాటు.. 70 కంటే ఎక్కువ ఈ కామర్స్ బ్రాండ్స్ తో నాల్గు దేశాల్లో భాగస్వామ్యంతో అభిమన్యు పేరు ఇప్పుడు ఏఐ ఆధారిత మార్కెటింగ్ ప్రపంచంలో మార్మోగిపోతోంది. అభిమన్యు కంపెనీల పోర్ట్ ఫోలియోలో.. స్యామ్ సంగ్ ఇండియా, బర్గర్ ఫామ్, నికాన్ ఇండియా వంటి గుర్తింపు పొందిన కంపెనీలున్నాయి.

రాజస్థాన్ సికార్ లో జన్మించిన అభిమన్యుకు ఈ విజయమేమీ అంత సులువుగా దక్కలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. శోధించాడు. తన తండ్రి ఇచ్చిన ఓ పాత ల్యాప్ టాపే తన ప్రపంచమైపోయింది. అలా తన ఊళ్లో సికార్ లో ఓ చిన్నగదిలో ప్రారంభించిన భారత్ ఇన్నోవేషన్స్ ఇప్పుడు ఏఐ ఆధారిత మార్కెటింగ్ ప్రపంచంలో అగ్రశ్రేణి బ్రాండ్ గా గుర్తింపు పొందింది. అభిమన్యు వెంట ఎవ్వరూ ఇతర స్నేహితులో, సలహాలు, సూచనలు ఇచ్చేవారో.. ఏదైనా పొరపాటు జరిగితే సరిచేసేవారో, హెచ్చరించేవారో కూడా లేరు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి అభిమన్యు.. ఏఐ ఫస్ట్ మార్కెటింగ్ ఏజెన్సీని సృష్టించి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు.

2024లో అభిమన్యు ఆభరణాల పరిశ్రమ కోసం RASA- recieve, appriciate, summerize, ask అనే ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టాడు. ఎన్నో ప్రయోగాలు చేశాడు. వందకంటే ఎక్కువ మార్కెటింగ్ ఫ్రేమ్ వర్క్స్ ను పరీక్షించిన తర్వాత.. రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అనే మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించాడు. 6x roas అంటే.. పది డాలర్లు వెచ్చిస్తే.. కనీసం 60 డాలర్లైనా రెవెన్యూ వచ్చేలా.. చాలా ఏజెన్సీలు అసాధ్యంగా భావించిన టెక్నాలజీని సాధించాడు. బ్రాండ్ ఇంటలిజెన్స్, ఏఐ నర్చరింగ్, యంగేజ్ మెంట్ ఎకో సిస్టమ్, ఎక్స్పీరియన్స్ ఆటోమేషన్ కు తోడు ట్రస్ట్ బిల్డ్ చేసేలా పబ్లిక్ రిలేషన్స్ తో ఆభరణాల పరిశ్రమకు విశ్వవ్యాప్తంగా మార్కెటింగ్ టెక్నిక్స్ ను అందించాడు. ఆభరణాల పరిశ్రమ అంటే ఎన్నో పేరెన్నికగన్న బ్రాండ్స్ మనకు కనిపిస్తాయి. వాటి పోటీలో తట్టుకుని, లాభసాటిగా నిలబడేలా తన కస్టమర్స్ ను స్కేల్ చేస్తూ అభిమన్యు చేసిన డీకోడింగ్ అందరినీ అబ్బురపర్చింది.

భారత్ ఇన్నోవేషన్స్ ఎందుకు ప్రత్యేకం..?

ఎందుకంటే, భారత్ ఇన్నోవేషన్స్ ఏఐ మార్కెటింగ్ లో మొట్టమొదటి ఇండియన్ ఏజెన్సీ. రెండు ఈ కామర్స్ బ్రాండ్స్ ను లాభదాయకంగా నడపడంలో ఈ ఏఐ మార్కెటింగ్ స్టార్టప్ తన కస్టమర్స్ కు పూర్తి స్థాయిలో సాయమందిస్తోంది. అంతేకాదు, భారత్ లో రెండేళ్లల్లోనే అతిపెద్ద పీఆర్ నెట్ వర్క్ సిస్టమ్స్ లో ఒకదాన్ని తయారు చేసుకోగల్గింది. తన క్లయింట్స్ కు ఏకకాలంలో వెయ్యి కంటే ఎక్కువ మీడియా పోర్టల్స్ ద్వారా ప్రచారం నిర్వహించుకునే అవకాశం, అధికారంతో విశ్వసనీయతను పెంచుకుంది. ఏఐ ఆధారిత మార్కెటింగ్ లో భారత్ ఇన్నోవేషన్స్ కచ్చితత్వం, పబ్లిక్ రిలేషన్స్ లో దాని ఆధిపత్యం.. అభిమన్యు స్టార్టప్ సంస్థను దేశంలోనే అత్యంత వేగవంతమైన ఏజెన్సీగా నిలబెట్టాయి.

ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ అంటే భవిష్యత్తే కాదు. ఆల్రెడీ వచ్చేసిన వర్తమానం. కాబట్టి వర్తమానానికి తగ్గట్టుగా పనిచేస్తూనే.. భవిష్యత్ పై దృష్టి సారించింది భారత్ ఇన్నోవేషన్స్ ఏఐ మార్కెటింగ్ ఏజెన్సీ. డేటా బేస్డ్ గానే క్రియేటివిటీ ఉండాలని నమ్ముతాడు అభిమన్యు. మార్కెటింగ్ ను గొప్పల్లో కొలవలేమని… లాభసాటిగా నడపడం, వృద్ధిలో మాత్రమే కొలవగలమని నమ్మే పక్కా ప్రాక్టికల్ మెంటాల్టీ అభిమన్యు. ఇప్పుడు అభిమన్యును.. ఆయన ప్రారంభించిన ఏఐ మార్కెటింగ్ ఏజెన్సీ భారత్ ఇన్నోవేషన్స్ ను నమ్ముకున్న ఆభరణాల పరిశ్రమతో పాటు, ఈ కామర్స్ బ్రాండ్స్ అన్నీ వారు ఊహించినదానికన్నా గుర్తింపుతో పాటు.. రాబడిని కూడా సాధిస్తుండటంతో భారత్ ఇన్నోవేషన్స్ పేరు.. దాని వ్యవస్థాపకుడైన అభిమన్యు పేరు మార్మోగిపోతోంది.

తాను ఎలా ప్రారంభమయ్యానో తిరిగి చూసుకున్నప్పుడు ఓ చిన్న గది, తండ్రి తనకిచ్చిన ఓ పాతబడ్డ ల్యాప్ టాప్ తో పాటు.. ఏదో సాధించాలన్న కల తప్ప ఇంకేమీ లేవంటున్నాడు ఈ ఏఐ మార్కెటింగ్ హీరో. ఏఐ మార్కెటింగ్ ను పునర్నిర్వచించగలనన్న పట్టుదలే అభిమన్యును మిగిలినవారికి భిన్నంగా నిలబెట్టింది. తన స్టార్టప్ కు ఇవాళ గ్లోబల్ రికగ్నేషన్ ను అందించింది. తన ఫార్మూలా క్లిక్ అయ్యేవరకూ ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాడు. కానీ, ప్రయోగాలు, పరీక్షలు మాత్రం ఆపలేదు. RASA వంటి ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్ ఫర్ బిల్డింగ్ కన్వర్సేషనల్ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ కు అసలెలా బీజం పడిందో.. అదేవిధంగా భారత్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ కూడా ప్రారంభమైంది. మేం మా ఏఐ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా కేవలం వ్యాపార, వాణిజ్య ప్రకటనలు అందించడమే కాదు.. మేం లాభదాయకమైన గ్లోబల్ బ్రాండ్స్ గా మా కస్టమర్స్ ను మారుస్తున్నామంటున్నాడు అభిమన్యు.

రాజస్థాన్ లోని ఓ మారుమూల పల్లె గదిలో ఓ పాత ల్యాప్ టాప్ తో ప్రారంభమైన ఓ స్టార్టప్.. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రచారంలో దేశంలోనే ఓ టాప్ కంపెనీగా నిలవడమంటే ఇది కదా ఏఐ ఎరాలో సక్సెస్ స్టోరీ అంటే!

సాధించాలన్న తపన, కల, వాటిని నిజం చేసుకునే పట్టుదల, చేస్తున్న పని మీద స్పష్టత కల్గి ఉంటే.. ఎలాంటి ఆవిష్కరణలైనా మానవుడు సాధించగలడనడానికి అభిమన్యు నిర్బన్ స్టోరీ ఓ ఉదాహరణ. ఏఐ ఆధారిత మార్కెటింగ్ లో, పబ్లిక్ రిలేషన్స్ లో గ్లోబల్ లీడర్ గా నిలవాలన్న తపనతో అభిమన్యు.. తను స్థాపించిన భారత్ ఇన్నోవేషన్స్ ఏఐ మార్కెటింగ్ ఏజెన్సీ దూకుడు ప్రదర్శిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles