పాకెట్ మనీ కోసం ప్రారంభించింది: బీబా పేరిట అప్పారెల్ మార్కెట్ నే షేక్ చేసింది!

“ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగిన ఓ గృహిణి కథ”

ఎన్ని సవాళ్లెదురు తన్నినా.. మీ బలమైన సంకల్పం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తే… మీ ఆశయం మీరు కన్న కలతో పెనవేసుకుని అడుగులు వేస్తే… విజయం మీదేనంటోంది మీనాబింద్రా.

ఒక డిజైనర్… ఎంటర్ ప్రెన్యూర్ గా అవతరించిన వార్త ఇది. ఇప్పుడు వందల కోట్లకెదిగిన బీబా ఇండస్ట్రీస్ అధినేతైన మీనాబింద్రా.. సరిగ్గా 39 ఏళ్ల వయస్సులో జస్ట్ హాబీగా ఉన్న తన డిజైనింగ్ ను తన వ్యాపారవృత్తిగా మొదలుపెట్టింది. బీబా అప్పారెల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ పరిశ్రమను ప్రారంభించింది. ముంబై కేంద్రంగా 1983లో తన సంస్థను ప్రారంభించిన మీనా… 2015లో ఇండియన్ అప్పారెల్ ఇండస్ట్రీలోనే ఓ గొప్ప అవార్డ్ గా చెప్పుకునే అపెక్స్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డునందుకుంది. ఇప్పుడేకంగా బీబా అప్పారెల్ మాల్స్ ని దుబాయ్, లండన్ లలో కూడా తెరిచింది. తను కేవలం ప్యాకెట్ మనీ సంపాదన కోసం బట్టలు కుట్టడం ప్రారంభించిది. మీరేదైనా అనుకుంటే చేస్తూ వెళ్తుండండి ఫలితాలు వాటంతటవే వస్తాయంటోంది మీనాబింద్రా.

దేశవ్యాప్తంగా మీనా బింద్రాకు సంబంధించిన బీబా స్టోర్స్ 372 ఉన్నాయి. అందులో మల్టీ బ్రాండెడ్ స్టోర్స్ 250 వరకూ ఉన్నాయి. విదేశాల విషయానికొస్తే ప్రారంభంలో దుబాయ్, లండన్ కే పరిమితమైన బీబా స్టోర్స్ ఇప్పుడు.. యూఏఈ, న్యూజెర్సీ, సింగపూర్ వంటి దేశాలకు కూడా విస్తరించింది. బీబాను గ్లోబల్ స్టోర్ గా అభివృద్ధి చేయాలన్నది.. దేశ, విదేశీ సంస్కృత డిజైన్లకు తన ఔట్ లెట్ ను మాడల్ గా చేయాలన్న తలంపు ఇప్పటికీ మీనా బింద్రాలో కనిపిస్తూనే ఉంటుంది.

ఇద్దరు పిల్లల తల్లైన మీనాబింద్రా సరిగ్గా మూడున్నర దశాబ్దాల క్రితం ఇంట్లో బట్టలకు డిజైనింగ్, కుట్లు వంటివి ప్రారంభించేందుకు బ్యాంక్ నుంచి ఓ 8 వేల రూపాయల రుణం తీసుకుని తన పనిని ప్రారంభించారు. తన భర్త ఓ ప్రభుత్వోద్యోగి. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న సమయంలో అక్కడికక్కడికే భర్త సంపాదన సరిపోతున్న రోజులవి. ఆ సమయంలో పాకెట్ మనీ కోసం తనకొచ్చిన కుట్లు అల్లికలతో చిన్నగా జీవితాన్ని ప్రారంభించింది. పోనీ, మీనా బింద్రా ఉద్యోగం చేద్దామంటే పెద్దగా చదువుకోలేదు. దాంతో ప్రారంభించిన బిజినెస్ లో మార్కెట్ కు వెళ్లి ఫ్యాబ్రిక్ కొనడం నుంచి ప్రింటింగ్ వరకూ అన్నీ తానై కళాత్మకంగా తీర్చిదిద్ది వాటిని ప్రదర్శనకు పెట్టింది. అలా ఎగ్జిబిషన్స్ లో ఆమె డిజైన్స్ కు మంచి ఆదరణ లభించడంతో.. ఏకంగా మెల్లిగా అప్పారెల్ ఇండస్ట్రీలోకే దిగి విజయవంతమైంది మీనా బింద్రా.

2004 వరకూ కూడా షాపర్స్ స్టాప్, లైఫ్ స్టైల్, ప్యాంటాలూన్స్ వంటి సంస్థలకు హోల్ సేల్ గా తన డిజైన్స్ అమ్ముకుంటు తన వ్యాపారాన్ని కొనసాగించేది. కానీ, 2004లో తామే ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో.. మొదట ముంబైలో రెండు స్టోర్స్ తో ప్రారంభమైంది బీబా కలెక్షన్స్. రెండో ఏడాది తిరిగేసరికి బీబా స్టోర్స్ సంఖ్య ఏకంగా 16కు చేరుకుంది.

ఇవాళ ఆడవాళ్లు ధరించే… ప్రతీ ఇంట్లో మహిళల వార్డ్ రోబ్ లో కనిపించే పంజాబీసూట్స్ కు రూపకర్త మీనాబింద్రానే. అంతేకాదు మహిళలు ధరించే కుర్తాలకు ప్యాకెట్ కల్చర్ ను అలవాటు చేసిన బింద్రా… 2004లో నా తుమ్ జానో న హమ్ సినిమా నుంచి బాలీవుడ్ సినిమాలకూ డిజైనర్ గా పనిచేసింది. బజరంగీ భాయ్ జాన్, దేవదాస్, బాగ్ బన్, హల్చల్ వంటి పలు బాలీవుడ్ సినిమాలకు ఆమె కాస్ట్యూమ్స్ అందించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్సైన రోహిత్ బాల్, అంజూమోడీ వంటివారితో టై అప్ అయి తమ బీబా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకెళ్లింది.

డెబ్బై ఏళ్ల వయస్సులోనూ తన బ్రాండ్స్ ను తాను కూడా ధరిస్తూ… ఒకింత గర్వపడుతోంది మీనాబింద్రా. ఓ లక్ష్యంతో బయల్దేరి మార్గమధ్యంలోనే కష్టాలకు ఎదురోడలేక విడిచిపెట్టేవారెందరికో ఓ స్ఫూర్తి ఎనిమిది పదుల మీనా కథ. కష్టపడే తత్వముంటే కచ్చితంగా మీనాబింద్రాలు కాగలరనడానికి ఆమే ఓ మాడల్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles