(వాట్సాప్ లో వైరల్ గా తిరుగుతున్న ఓ అజ్ఞాత రచయిత పోస్ట్.. 👌🏻)
మొన్న సుధా మూర్తి నేను ముప్ఫై సంవత్సరాల నుంచి ఒక్క చీర కూడా కొనలేదు అంటూ గారాలు పోయారు.
నిజమే కొని ఉండక పోవచ్చు. లేదా తన తరానికి సరిపోయేతంటి సరుకు తన బీరువాల్లో మగ్గుతూ ఉండచ్చు. సింప్లిసిటీ డబ్బులున్న వారికి ఒక అలంకారం.
మనలాంటి వారికి సాధ్యపడుతుందా..? చిన్నప్పుడు కనీసం ఒక మోస్తారు బట్టలు లేవు అన్న కారణoతో ఎన్నో పెళ్ళిలకు, ఫంక్షన్ లకు వెళ్ళలేని పరిస్థితుల నుంచి వచ్చాను…
డబ్బులు ఉన్న వాళ్ళు సింపుల్ గా ఉండటం ఈజీ, డబ్బులు లేని వాళ్ళు సింపుల్ గా ఉండటం చానా కష్టం!
నేను ఏదో డబ్బులు లేకున్నా అప్పులు చేసి నగలు గట్రా కొనమని కాదు, ఆవిడ చీర వరకు మాట్లాడింది, నేను అంత వరకే మాట్లాడుతున్నా…మరీ వేలు ఖరీదు అయ్యే చీరల గురించి మాత్రం కాదు!
నారాయణ మూర్తి దంపతులు ఇద్దరూ వారానికి డెబ్బై పని గంటల గురుంచి పట్టుబడుతున్నారు, చర్చ కూడా జరుగుతోంది. చాలా మంది వ్యాపారవేత్తలు వీరికి వత్తాసు పలుకుతున్నారు. ఓలా వాడితో సహా!

నారాయణ మూర్తి బాగా సిల్లీగా రైతుల ఉదాహరణ చెబుతున్నాడు, డెబ్బై గంటలు పని చేస్తారు రైతులు అని. అవును చేస్తూ ఉండవచ్చు రైతులు, కానీ రైతు కూలీలను కూడా వారితో పాటు పని చేపిస్తూ ఉంటే అది నేరం, శ్రమ దోపిడీ కాదా..?
రోజుకు పద్నాలుగు గంటలు పని చేయడం సాధ్యమా? బెంగళూర్ లాంటి నగరాల్లో ఆఫీస్ చేరడానికే గంట పైన పడుతుంది. రాను పోనూ రెండు గంటలు. ఇక ఆఫీస్ కు తయారు కావడానికి కనీసం ఒక గంట. పదిహేడు గంటలు పోయాయి. పిల్లలు ఉంటే, వారిని స్కూల్ డ్రాప్, లేదా సాయంత్రం ట్యూషన్ లకు డ్రాప్ లాంటి పనుల కోసం ఇంకో గంట కనీసం. ఇక మహిళా ఉద్యోగస్తులు అయితే ఇంటి పని అదనo. అంటే మనం కేవలం నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్దుర పోవాలి. దేశం అభివృద్ధి చెందుతుంది పద్నాలుగు గంటలు పని చేస్తే అంటున్నాడు, దేశాలు అభివృద్ధి చెందవచ్చు, వేళకు ఇంత తిండి, ఎనిమిది గంటల నిద్దుర లేకుంటే, దేహాలు దివాళా తీస్తాయి….దేశం రోగిష్టుల దేశం అవుతుంది. మొదటికే మోసం వస్తుంది, ఆరోగ్యకరమైన పౌరులు లేక. మానసిక, శారీరిక జబ్బులతో అలరారుతుంది దేశం.
వీరు అంతా దేశాన్ని, దేహాలను దోచుకునే రాబoదులే!

అంతగా వీరి కార్యాలయాల్లో పద్నాలుగు గంటల పని ఉంటే, ఒకరి స్థానానా ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వండి. పని ఉంది అంటే రాబడి కూడా ఉన్నట్లే కదా…అలా నిరుద్యోగ సమస్య తీరుతుంది, దేశంలో కొనుగోలు, ఖర్చు చేసే శక్తి పెరుగుతుంది, GDP పెరుగుతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది. అవును వీళ్ళు డెబ్బై గంటల పని చేస్తున్నాo అంటారు….ఒక యజమాని పద్నాలుగు గంటలు పని చేయడానికి, ఒక ఉద్యోగి పద్నాలుగు గంటలు పని చేయాలి అన్న దానికి చాలా తేడా…ఒక యజమాని ఇంట్రెస్ట్ లెవెల్, ఎనర్జీ లెవెల్స్ వేరు….ఉద్యోగిటివి వేరు….మీకు ఉన్న వనరులు, సౌకర్యాలు ప్రతి ఉద్యోగికి ఉండవు…మీ వద్ద పదుల సంఖ్యలో నౌకర్లు, డ్రైవర్లు ఉండచ్చు, ప్రతి ఉద్యోగి వద్ద అలాంటివి ఆశించ లేము…
ఇప్పటికే కార్పొరేట్ ప్రపంచం మూలంగా, ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిలు ఎక్కువ అయ్యాయి…నగరాల్లో విడాకుల కేసులు పెరుగుతూ పోతున్నాయి….పద్నాలుగు గంటల పని పెట్టండి, జంటలు ఉండవు, సంసారాలు ఉండవు.
అసలు వీరి నోటి వెంట ఈ సింప్లిసిటీ పదాలు వింటూ ఉంటేనే అసహ్యంగా ఉంటుంది….వీరి సంపాదనలో ఒక శాతం చారిటీ కు ఖర్చు పెట్టడం, మేము మొత్తం త్యాగం చేసేసాము అని డప్పులు కొట్టడం….
మొన్న అంబానీల పెళ్లి లో, ఆ అనంతు కూడా తన కష్టాలు వెళ్ళ బూసుకున్నాడు…. ఆరే దేశ సంపదను మొత్తం మీ బొక్కసంలో నిoపుకున్నా, ఇంకా కష్టాలు అంటే, కష్టాలకు అర్థం లేకుండా పోతోoది…
అంబానీల నెలల తరబడి సాగుతున్న పెళ్లి తంతు, అది ఇతర దేశ ప్రజలను అపహాస్యం చేయడమే. సంపద ప్రదర్శన…నీతిగా నిజాయితీగా పని చేస్తే అంత సంపద వస్తుంది అంటే నేను పదహారు గంటలు పని చేయడానికి సిద్దం…రోజుకు…
చట్టాలను, ప్రభుత్వాలను manipulate చేసి, లాభియిoగ్ లు, లంచాలతో పనులు కానిచ్చి, దేశ వనరులను పైసల్లో కొని వాటిని కోట్లకు అమ్ముకొని, చూడండి మా సంపద అంటూ సిగ్గూ లేకుండా ప్రదర్శిస్తున్నారు….
వీళ్ళను చూసి మధ్య తరగతి కుటుంబాలు, కాస్త ఆ పై వర్గం ఖచ్చితంగా, వారి వారి స్థాయి కంటే కొంచం మెరుగ్గా జరగాలి పెళ్లిళ్లు అని కోరుకుంటారు….అమ్మాయి తల్లిదండ్రుల పై భారం పెరుగుతుంది….
ఒక అమ్మాయి పెళ్లి అంటే, ఆ ఇంటి యజమాని తన జీవిత కాలపు సంపాదన….మధ్య తరగతి కుటుంబాల్లో…..
ఏదో రెండు రోజులో, మూడు రోజులో పెళ్లి వేడుకలు అంటే ఓకే, నెలల తరబడి జరుగుతున్న ఆ హంగామా చూస్తూ ఉంటే కోపం, విరక్తి, అసహ్యం కలుగుతున్నాయి…..ఆ పెళ్లి నిర్వహిస్తున్న ఆ కుటుంబం మొత్తం మానసిక రోగులే….
ఆ పెళ్లి సంబరాలు అన్నీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లా అనిపిస్తున్నాయి, రోజూ చూస్తూ ఉంటే!
ఆ రాధిక మర్చంట్ అయితే… ఇంగ్లీష్ సినిమా లోని స్పీచ్ మొత్తం మక్కీకి మక్కీగా దింపేసింది తన పెళ్లి స్పీచ్ లో……ఆ దేశపు ప్రజలు ఇంగ్లీష్ సినిమాలు ఎప్పుడు చూడాలి, చూసినా వీళ్ళకు ఇంగ్లీషు ఎప్పటికి అర్థం అవ్వాలి అనుకుOది ఏమో….మంచి కంటెంట్ రైటర్ కు ఒక పది వేలు ఇచ్చి అంటే అదిరి పోయే వాక్యాలు రాసి ఇచ్చి ఉండే వారు…పెళ్లికి ఇంత ఖర్చు పెట్టారు…స్పీచ్ ల వద్ద తేలిపోయారు
ఇక అదానీ అన్నకు ఒక విజ్ఞప్తి….అందరూ సింప్లిసిటీ రాగం అoదుకన్నారు అని, మిమ్మల్ని దత్తత తీసుకున్న తండ్రి కూడా ఎప్పుడూ ఇలానే జనాల వద్ద సింపతీ కొట్టేయాలనీ ప్రయత్నిస్తూ ఉంటారు, పది కోట్ల సూట్ వేసుకొని…మీరు వీరి నుంచి ప్రేరణ పొంది, నేను అండర్ వేర్లు కొని నాలుగు సంవత్సరాలు అయ్యింది అని మాత్రం సెట్మెంట్ లు ఇవ్వకండి సార్…మేము జీర్ణించుకోలేం!
దేశం, దేశ ప్రజలు అంటే వీళ్ళందరికీ కామెడీ అయిపోయింది!



