షాక్ ఇచ్చిన ఇండియన్ కింగ్! దిగొచ్చిన రోల్స్ రాయిస్!!

రోల్స్ రాయిస్ కంపెనీకే గుణపాఠం చెప్పిన రాజతను!

అది 1910వ సంవత్సరం… భారతదేశం ఇంకా బ్రిటీష్, పోర్చుగల్, ఫ్రాన్స్ వంటి దేశాల ఆధిపత్యం నుంచి బయటపడని, స్వాతంత్ర్యం సాధించని కాలం. కొన్ని సంస్థానాల సమాహారంగా ఇంకా అఖండ భారతంగానే ఉన్న సమయం. అప్పుడు ది గ్రేట్ రోల్స్ రాయిస్ కు తగినశాస్తి చేశాడు మన ఇండియన్ కింగ్. అసలేం జరిగింది..?

రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అల్వార్ అనే సంస్థానాధీశుడైన జైసింగ్ ప్రభాకర్ బ్రిటన్ వెళ్లారు. ఇంగ్లాండ్ లో ఓ ఫైన్ మార్నింగ్ షోరూమ్ ఓపెన్ కాగానే.. రోల్స్ రాయిస్ కార్ల దుకాణంలోకి దూరాడు. ఆయన వెళ్లిన తీరు, వేషం చాలా సామాన్యంగా, ఓ సాధారణ పౌరుడిని తలపించేలా కనిపించింది షోరూమ్ నిర్వాహకులు, సిబ్బందికి. ఇంకేం, అప్పటి బ్రిటీష్ పొగరు తెలిసిందేగా.. ?డర్డీ బ్లడీ ఇండియన్ అన్నట్టుగా చూడటంతో పాటు.. రోల్స్ రాయిస్ కార్లంటే ఆశామాషీ కాదు.. వీటిని కొనడమంటే మామూలు విషయం కాదు.. మా టైం వేస్ట్ చేయకుండా వెళ్లిపోండని గెంటేశారట సదరు నిర్వాహకులు.

ఇంకేం అది కాస్తా మన జైసింగ్ ప్రభాకర్ మనసులో బలంగా నాటుకుంది. స్వదేశీ స్వాభిమానమూ తన్నుకొచ్చింది. వెంటనే ఇంగ్లండ్ లో తను బస చేస్తున్న హోటల్ కు తిరిగి వెళ్లి.. తన రాజదర్పంతో మళ్లీ అదే షోరూమ్ కు వెళ్లారు జైసింగ్ ప్రభాకర్. అంతకుముందే అతణ్ని ఓ సామాన్యుడిలా చూసి అవమానించిన షోరూమ్ నిర్వాహకుల ట్రీట్మెంట్ మారిపోయింది. ఎక్కడైతే అవమానించబడ్డాడో ఓ సామాన్య భారతీయ పౌరుడిగా.. అక్కడే ఆ షోరూమ్ నిర్వాహకుల నుంచి రెడ్ కార్పెట్ అందుకున్నాడు. అయినా, ఆ అవమానభారం మాత్రం జైసింగ్ ప్రభాకర్ మనసులో అలాగే ఫైరవుతోంది. ముఖ్యంగా స్వదేశీ స్వాభిమానానికి తాకిన దెబ్బగా భావించిన అతను.. అదే షోరూమ్ లో ఏకంగా పది కార్లు కొనుగోలు చేశారట.

అయితే, అవమానింపబడ్డ షోరూమ్ లో ఒకేసారి పది రోల్స్ రాయిస్ కార్లు కొంటే చాలు.. అవమానించినవారిలో ఓ పరివర్తన కచ్చితంగా కనిపిస్తుంది. కానీ, తనకు జరిగిన అవమానానికి జైసింగ్ ప్రభాకర్ మాత్రం ప్రతీకారాన్ని మామూలుగా తీర్చుకోలేదు. మరింత గట్టిగా తీర్చుకోవాలనుకున్నాడు. తాను కొనుగోలు చేసిన పది రోల్స్ రాయిస్ కార్లను తన సంస్థానమైన అల్వార్ కు తరలించాడు. తరలించిన వెంటనే అల్వార్ మున్సిపల్ అధికారులకు నగరంలో చెత్త సేకరణను తాను ఇంగ్లండ్ నుంచి కొనుక్కొచ్చిన రోల్స్ రాయిస్ కార్లలో చేయాలని ఆదేశించారట.

దాంతో నిత్యం అల్వార్ వీధుల్లో ది గ్రేట్ రోల్స్ రాయిస్ కార్లు పదికి పది చెత్త సేకరిస్తుండటం.. నాటి బ్రిటీష్ పాలకులను షాక్ కు గురిచేసింది. విషయం కాస్తా రోల్స్ రాయిస్ యాజమాన్యం వరకూ వెళ్లింది. ఇంకేం రోల్స్ రాయిస్ యాజమాన్యంతో పాటు.. బ్రిటీష్ పాలకులకు సంబంధించిన దూతలు కూడా వెంటనే అల్వార్ కు వచ్చి జైసింగ్ ప్రభాకర్ ను క్షమాపణలు అడిగారు. అంతేకాదు.. వీధుల్లో తమ కంపెనీకి చెందిన కార్లలో చెత్త సేకరణను నిలిపేయాలని వేడుకున్నారు. ఇప్పటికే చెత్త సేకరిస్తున్న రోల్స్ రాయిస్ పది కార్లకు బదులు మరో కొత్త పదికార్లు ఇస్తామని బతిమాలారు. కానీ, మన ఇండియన్ కింగ్ జైసింగ్ ప్రభాకర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు సరికదా.. వారికదే తగిన శాస్తన్నట్టుగా తన అల్వార్ సామ్రాజ్యంలో రోల్స్ రాయిస్ కార్లతోనే చెత్త సేకరణ చేయించాడు. మొత్తంగా కుక్క కాటుకు చెప్పుదెబ్బ ఎలా ఉంటుందో చూపించిన ఇండియన్ ప్రౌడ్ సింబల్ జైసింగ్ ప్రభాకర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles