one of my inspirational director
Balaji Prasad (బాలాజీ ప్రసాద్).. ✍🏻
చాలా మంది గ్రేట్ డైరెక్టర్స్ కి ఇతను one of the inspiring director అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇతని మేకింగ్ స్టైల్, స్టోరీ టెల్లింగ్, సస్పెన్స్ ని హోల్డ్ చేసి స్క్రీన్ ప్లే ని నడిపే విధానం world సినిమాలో ప్రత్యేకమైనది.
#FightClub సినిమాని ఐతే నెత్తిన పెట్టుకోని సినిమా మేకర్ ఉండడు, ఫేవరైట్ లిస్ట్ లో పెట్టుకోని సినిమా లవర్ ఉండడు.
ఒకటేంటి ఇతని ప్రతీ సినిమా ఇంకొన్ని సినిమాలకి రిఫరెన్సే.
Even మన గ్రేట్ డైరెక్టర్ శంకర్ #అపరిచితుడు ఆనవాళ్లు కూడా #Seven తో వచ్చినవే (ఈ ఎనాలసిస్ ఇంకొక రోజు పెట్టుకుందాం)
అలానే ఇంకోక సీరియల్ మర్డర్స్ సినిమా #Zodiac అవ్వొచ్చు.. #thegirlwiththedragontattoo అవ్వచ్చు ప్రతీ సినిమా ఒక ప్రత్యేకం.
– ఇవన్నీ పక్కన పెడితే నా వరకు డేవిడ్ ఫించర్ మూవీస్ లో #TheCuriousCaseofBenjaminButton అండ్ #gonegirl నా ఫేవరైట్ మూవీస్
ఇందులో బెంజమిన్ బటన్ గురించి కొద్దిగా చెప్తాను నచ్చితే ఈ వీకెండ్ కి చూసేయండి.
ఇందులో హీరో బ్రాడ్ఫిట్ ఏజ్ వెనక్కి వెళ్తుంది. అంటే పుట్టడమే ముసలి వ్యక్తిలా పుడతాడు. చిన్నగా వయసు తగ్గుతూ వస్తుంది. హీరోయిన్ మాత్రం మనలానే సాధారణంగా పుట్టి వయసు పెరుగుతూ ఉంటుంది. ఇద్దరూ యుక్త వయసు వచ్చేసరికి ప్రేమలో ఉంటారు. ఆ తర్వాత ఇద్దరి వయసు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అంటే హీరోయిన్ ముసల్ది అవుతుంటే హీరో చిన్న పిల్లాడు అవుతూ ఉంటాడు. చివరికి హీరో పుట్టిన పసిపిల్లాడిలా అవుతాడు.
ఇలాంటి స్క్రీన్ ప్లే ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అంటే సాహసమే కదా?. అలాంటి సాహసోపేతమైన కథనాలే ఉంటాయి అతని సినిమాల్లో.
– ఒకవేళ క్రైమ్, సస్పెన్స్, సీరియల్ కిల్లింగ్, సైకాలజికల్ థ్రిల్లర్స్ , సైకో కిల్లర్, ట్విస్టింగ్ లాంటి సినిమాలు ఇష్టం ఉండి డేవిడ్ ఫించర్ సినిమాలు చూడకపోతే వరుసగా ఇతని సినిమాలు చూడండి. మిమ్మల్ని ఒక ట్రిప్ లోకి తీసుకొని వెళ్తాడు



