అయితే నలుపో లేకపోతే తెలుపో… కానీ బూడిద రంగు మాత్రం నాకొద్దంటారు ఫుట్ బాల్ దిగ్గజం డియాగో మారడోనా.
విజయాల వల్లే కాదు.. జీవితాంతం వారు పాటించే విలువలు, సూత్రాల వల్ల కూడా కొందరు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. అలాంటి క్రీడాకారుడే డియాగో మారడోనా.
am black or white, i’ll never be grey in my life..ఇదే మారడోనా ప్రిన్స్పుల్. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సూత్రం. రాజీపడే ధోరణి కంటే కూడా.. తాము నమ్మినదానికి కట్టుబడి ఉండటం.. గట్టిగా నిలబడి ఉండటానికే ఈ ఆటగాడు జీవితాంతం ప్రాధాన్యతనిచ్చాడు. మారడోనాకు ఎందరో అభిమానులున్నారు. అలాగే, విమర్శకులూ ఉంటారు. కానీ, తన విశ్వాసాలకు కట్టుబడి జీవించడమే తనకిష్టమన్నది ఈయన ఫిలాసఫి.

ఏంటి నలుపు తెలుపు కథ..?
స్పష్టమైన వైఖరి. నమ్మినదానికి కట్టుబడే దృఢమైన నిర్ణయం. తమకున్న అభిప్రాయాలను తరచిచూసుకుని సరైందనుకున్నప్పుడు నిబద్ధతగా నిలబడటం. ఇదే నలుపు తెలుపు కథ. సందిగ్ధత, అస్పష్టత, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన వచ్చినప్పుడు వెనుకడుగు వేయడం, అనుమానపడటం వంటివన్నీ గ్రేను సూచిస్తాయి.
వ్యక్తిగత జీవితంలోనైనా, ఉద్యోగాల్లోనైనా, రోజూవారీ నిర్ణయాల్లోనైనా కొన్నిసార్లు రాజీ మార్గాన్ని ఎంచుకోవడం కంటే కూడా విలువలకే కట్టుబడి ఉండటమే ముఖ్యమనే సందేశం డియాగో మారడోనాది.
మారడోనా సూక్తి వెనుకున్న తత్వమేంటి..?
నిజాయితే ప్రామాణికత. ప్రతీ ఒక్కరినీ సంతోషపెట్టే యత్నం చేయడం కంటే కూడా మనం నమ్మిన విషయాన్ని ధైర్యంగా చెప్పడం.. దానివల్ల ఎదురయ్యే పరిణామాలను స్వీకరించడమే గొప్ప విషయం.
సమగ్రత, నిజాయితీ, బాధ్యత వంటి విలువలను గుర్తు చేసే సూక్తి చెప్పేదేంటంటే.. విలువలు తెలుసుకోవడం, వాటికి కట్టుబడి ఉండటం, నిజాయితీగా జీవించడం, ఇతరుల మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకోకపోవడం.
ఆత్మవిశ్వాసం నటిస్తే వచ్చేది కాదు… మనమేంటో అదే విధంగా జీవించడం వల్లే.. ఒర్జినాలిటీలోనే అది ఉంటుందన్నది మారడోనా అభిప్రాయం.
నేటి కాలంలో ఈ సూక్తి ఎందుకు ప్రాసంగికం..?
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన రోజుల్లో విమర్శలు, ప్రతివిమర్శలు, వ్యతిరేకత వస్తుందని చాలామంది నిజమైన తమ అభిప్రాయాలను బయటపెట్టడానికి కూడా భయపడుతున్నారు, వెనుకాడుతున్నారు. ఈ సమయంలో ఈ మారడోనా అవలంబించే సూత్రం ఒక అద్భుతమైన సందేశాన్నిచ్చేది. అందరికీ నచ్చేలా ఉండటానికి యత్నించడం కన్నా.. మన విలువలకు కట్టుబడి నిజాయితీగా జీవించడమే గొప్ప. అదే సమయంలో మన అభిప్రాయాలను గట్టిగా తెలియజేస్తూనే.. ఇతరుల అభిప్రాయాలనూ గౌరవించడమూ అవసరమనే ఒక సామాజిక సందేశం మారడోనా am black or white, i’ll never be grey in my life చెప్పే పాఠం.



