సూపుల్లో కసి-బౌలర్లు మసి: దటీజ్ సూర్యవంశీ!

Ramu suravajjula.. ✍🏻

—————————————————-


85 దగ్గర 3 వరస సిక్స్ లు ఏంట్రా నాయనా?

ఎంతటి మొనగాడైన బ్యాట్స్ మన్ అయినా
85 పరుగులు స్కోర్ చేశాక కాస్తనైనా ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా అడుగులు వేస్తాడు. ఎంతకాదనుకున్నా దూకుడు కొద్దిగా తగ్గిస్తాడు. ఈ 15 ఏళ్ల పాలబుగ్గల పిల్లగాడు 85 పరుగుల తర్వాత వరసగా మూడు సిక్స్ లు కొట్టి స్టైలిష్ గా శతకం పూర్తిచేసాడు. ఈ అబ్బాయి అసాధ్యుడు. అనితరసాధ్యుడు. వంద కోట్లకు ఒక్కడు!

ipl టోర్నమెంట్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను జైపూర్లో తుక్కురేగకొట్టి 36 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అందులో నేలబారుగా వచ్చిన (ఫోర్స్ 5) పరుగుల కన్నా గాల్లో కలిసిపోయినవే (సిక్స్ లు 12) ఎక్కువ కావడం విశేషం. అలవోకగా అనిపించిన సిక్స్ లు కళ్ళు చెదిరేలా గ్రౌండ్ నలుమూలలా పంపించి వావ్ అనిపించాడు.

బుజ్జిబాబు చెలరేగుతుండగానే… శ్రీలంక క్రికెట్ లెజెండ్స్ అయిన #RR కోచ్ సంగక్కర, #SRH కోచ్ మురళీధరన్ సూర్యవంశీ గురించి భలే సరదాగా కామెంట్స్ చేశారు. పిల్లవాడికి ప్రత్యేకించి చెప్పేదేమీలేదనీ, హాయిగా ఆటను ఆస్వాదించనివ్వడమే చేస్తానని సంగక్కర చెప్పాడు. ప్రత్యర్థి జట్టు కోచ్ అయిన స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ సూర్యవంశీ ని వండర్ కిడ్ అంటూ… ఇంకా నయం నేను ఇప్పుడు ఆడడం లేదని (బతికి పోయానన్నట్లు)… నవ్వుతూ అన్నాడు. “బౌలర్ల పాటి పీడ కల ఈ అబ్బాయ్,” అని కితాబు నిచ్చాడు.


ఇప్పుడు కోచింగ్ సెంటర్లలో బ్యాటింగ్ మాత్రమే నేర్చుకునే వారి సంఖ్య పెరిగిందని, ఈ విధ్వంసకర ఆట చూసి బౌలింగ్ వేయడానికి భయపడే పరిస్థితి ఉందని కామెంటరీ బాక్స్ లో నిపుణులు కూడా సరదాగా చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles