జీవితంలో ఒక్కసారైనా ఆ హైవే ఎక్కాలనుకునే వారెందరో! ఎందుకు..?

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి ఎక్కడుందో తెలుసా..? 14 దేశాల గుండా సాగుతూ.. యూ-టర్నే అవసరం లేని 30 వేల కిలోమీటర్ల ఆ ప్రయాణం గురించి కాస్త తెలుసుకుందాం.

చిన్న చిన్న రహదారులకు కూడా యూటర్నులు తప్పని రోజుల్లో… ఒక ప్రయాణం మొదలెడితే ఎక్కడా యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేని రహదారి పాన్ అమెరికా హైవే. ఒక ఖండం నుంచి మరో ఖండానికీ… పర్వత శ్రేణులు, వర్షారణ్యాలు, ఎడారులు, మహానగరాలు ఇలా సాగిపోయే ఓ రహదారి ప్రయాణం నిజం ఓ అనుభూతి. 30 వేల కిలోమీటర్ల మేర 14 దేశాల గుండా నిర్మించిన ఈ రహదారి ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా కూడా గుర్తింపు పొందింది.

పాన్ అమెరికా హైవే ఓ రహదారి మాత్రమే కాదు… దేశాలను, ఖండాలను, మహానగరాలను కలిపే ఓ వంతెన. ఆయా నగరాల్లోని ప్రగతినీ, రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు ఆస్వాదించే ప్రకృతినీ కళ్లముందుంచే ఒక అనుభూతి.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గంగా పాన్-అమెరికన్ హైవేకు ఎందుకు పేరు వచ్చింది..?

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పొడవైనది. నిరంతరం తిరిగే వాహనాలతో కనిపించే ఓ బిజీబిజీ రోడ్డు. అలాస్కాలోని ప్రూడో బే నుంచి అర్జెంటీనాలోని ఉషువాయా వరకూ విస్తరించింది ఈ రహదారి.

19 వేల మైళ్లు.. అంటే 30 వేల కిలోమీటర్ల పొడవుతో ఈ హైవే ఉత్తర, దక్షిణ అమెరికాలను కలుపుతోంది.

పాన్ అమెరికా హైవేలో తారసపడే దేశాలు!

కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటీమాలా, హోండూరాస్, కోస్టారికా, పనామా, కొలంబియా, పెరూ, చిలీ, అర్జెంటీనాతో పాటు మరికొన్ని దేశాలను కూడా ఈ హైవే టచ్ చేస్తుంది.

ఈ హైవే ఆలోచనకు బీజం ఎలా పడింది..?

పాన్ అమెరికా హైవే ఆలోచనకు 1923లో బీజం పడింది. అమెరికా ఖండంలోని పలు దేశాల నాయకులు కలిసి.. కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచేందుకు ఒక హైవే నెట్వర్క్ ను నిర్మించాలని యోచించారు.

అలా మొదలైన పాన్ అమెరికా రహదారి అంటే ఒక్కటే రహదారి కాదు. వివిధ దేశాల్లో నిర్మించిన అనేక రహదారుల సమాహారం.

నో యూటర్న్ వండర్!

ఈ హైవే పైకెక్కి డ్రైవింగ్ మొదలెట్టామంటే మార్గమంతా యూటర్న్ తీసుకోకుండా ప్రయాణించవచ్చు. అదేం ట్రాఫిక్ రూల్ అనేం కాదు. కానీ, ఈ రహదారిని అందుకు అనుగుణంగా నిర్మించారు.

డారియన్ గ్యాప్ అంటే ఏమిటి..?

అయితే ఇంత పెద్ద పాన్ అమెరికా హైవేలో ఒక పెద్ద లోటు మాత్రం తప్పడం లేదు. అదే డారియన్ గ్యాప్. పనామా- కొలంబియా మధ్యనున్న దట్టమైన సాంద్ర వర్షారణ్య ప్రాంతమిది. ఈ ప్రాంతంలో మాత్రం రహదారిని నిర్మించకుండా వదిలేశారు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణీకులు ఇతర మార్గాల్లోనో, కాస్సేపు కాలినడకనో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఖండాలను కలిపే ఒకే ఒక్క రహదారిగా ఈ పాన్ అమెరికా హైవే గుర్తింపు పొందింది.

ప్రకృతి వైవిధ్యానికి కేరాఫ్ గా హైవే వెంట కనిపించే వాతావరణం!

పాన్ అమెరికా హైవే ప్రత్యేకత కేవలం పొడవుకే పరిమితం కాలేదు. ప్రకృతి సిద్ధమైన, వైవిధ్యమైన రోడ్డు ఇది. ఈ రహదారిలో ప్రయాణిస్తే అలాస్కా మంచు మైదానాలను చూడొచ్చు. మధ్య అమెరికా ఉష్ణమండల అరణ్యాలను వీక్షించొచ్చు. ఆండీస్ పర్వతాలను దర్శించవచ్చు. చిలీ ఎడారుల తాపాన్నీ అనుభవించవచ్చు.

అలా ఒకే ప్రయాణంలో ఇన్ని రకాల వాతావరణాలు, సంస్కృతులు, జీవ వైవిధ్యం అనుభవించడం ప్రపంచంలోనే అరుదు. అది పాన్ అమెరికా హైవే సొంతం.

అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి నిదర్శనంలా హైవే!

1937లో పాన్ అమెరికా హైవే ఒప్పందం కుదిరింది. అప్పటినుంచి పలు దేశాలు కలిసి ఈ రహదారి నిర్మాణం, నిర్వహణ చేపట్టాయి. భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైన దేశాల మధ్య విజయవంతమైన సహకరానికి ప్రతీకలా ఈ రోడ్డు మనల్ని పలకరిస్తుంది.

పాన్ అమెరికా హైవేపై ప్రయాణం చాలామందికి జీవిత లక్ష్యం!

ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారైనా పాన్ అమెరికా రహదారిపై ప్రయాణించాలన్న కోరిక చాలామందిలో ఉంటుంది. ఇంకొందరికైతే ఓ లైఫ్ గోల్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా మాత్రమే కాకుండా.. పాన్ అమెరికన్ హైవే నో యూ టర్న్ వండర్ గా కూడా ప్రయాణీకులను ఆకట్టుకునేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles