స్వస్తిక్.. దాని కథ!

స్వస్తికా చిహ్నం 1900 ముందు.. ఆ తర్వాత!

.…………………………………………..

సుబ్రహ్మణ్యం వల్లూరి… ✍🏻

హిందువులకు, జైనులకు, బౌద్ధులకు అత్యంత పవిత్ర చిహ్నం అయిన స్వస్తికాను ఇరవైవ శతాబ్దం మొదటి అర్ధ భాగంలో ఒక వ్యక్తి తన అధికార దాహానికి స్వస్తికాను బలిచేసి ఎంతటి చెడ్డపేరు , మాయనిమచ్చ తీసుకువచ్చాడో గుర్తుచేసుకుందాం. మనం ఎంతో పవిత్రంగా భావించే స్వస్తికా గుర్తును దొంగిలించి తన నాజీ పార్టీ ముఖ్య గుర్తుగా వాడుకొని తరువాతి తరాలకు స్వస్తికాను చూస్తే నియంతృత్వ నాజీ అధినేత గుర్తుకువచ్చేలా మాయనిమచ్చ తెచ్చాడు ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్.

————————————-

స్వస్తికా అంటే సంస్కృతంలో “శ్రేయస్సు” అని అర్ధం. ఆంగ్ల అక్షరం “ఎస్” రెండు అడ్డంగా పేరుస్తే వచ్చే గుర్తు అని సులువుగా చెప్పవచ్చు స్వస్తికాను. ఈ క్రాస్ ఆకారంలో వుండే స్వస్తికాకు చాలా విశిష్టమైన స్థానం ఉంది మన వేద కాలం నుంచి. ఏన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది స్వస్తికాకు. ఆ గుర్తు హితం కోరేది, యుద్ధచిహ్నం కాదు. మన ప్రాచీనకాలం నుంచి శ్రేయస్సు కోసం ఆ గుర్తు వాడిన దాఖలాలు ఉన్నాయి. మన పూర్వీకుల నుంచి ప్రస్తుత కాలంలో కూడా ఏ గ్రంధం రాసినా మొదటి పుటలో రాసేది స్వస్తికా గుర్తునే! అది రాసిన తరువాతే, ఆ గుర్తుకు పసుపు కుంకుమ రాసి పూజ చేసి పుస్తకం రాయడం – ప్రారంభించడం ఆనవాయితీ. అందరి శ్రేయస్సు కొరడమే వారి ఉద్దేశ్యం.

అంతటి గొప్ప చరిత్ర కల గుర్తు.. గత శతాబ్దంలో మొదటి అర్ధభాగంలో అణిచివేతకు, ఒక జాతిని ప్రపంచ పటం మీద నుంచి చేరిపివేసే ప్రయత్నానికి గుర్తుగా యూరోప్, అమెరికా దేశస్థుల మదిలో నిలిచిపోయింది.

అతి పురాతనమైన స్వస్తికా ఎన్నో వేల ఏళ్ల క్రితం గతించిపోయిన ఏనుగుల్లో ఒక జాతి అయిన మామ్మోత్ ఏనుగు దంతాల మీద చెక్కబడి రష్యాలో దొరికింది. ఈ మామ్మోత్ జాతి ఏనుగు డైనోసార్ ల కాలం నాటిది అంటే ఎంత పురాతనమైందో ఊహించండి. మన వేదాలు అంతకన్నా ముందు కాలానివి, వేదాల్లో ఈ స్వస్తికా గుర్తును విస్తృతంగా వాడారు.

ఆ కాలంలో స్వస్తికాను సంతానోత్పత్తికి చిహ్నంగా కూడా కొన్ని ప్రాంతాలవారు వాడినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఏనుగును కూడా శ్రేయస్సు, సంతానోత్పత్తికి గుర్తుగా వుండబట్టి ఆ మామ్మోత్ ఏనుగు దంతంతో స్వస్తికాను చెక్కారు అని తెలుస్తోంది.

విడిగా స్వస్తికా ప్రత్యక్షమైంది యూరోప్లోని తూర్పు దక్షిణ ప్రాంతం, నియోలిథిక్ విన్క సంస్కృతి కాలంలో అంటే సుమారు ఏడు వేల ఏళ్ల క్రితమే.. కాంస్య కాలానికి యూరోప్ మొత్తం స్వస్తిక లభ్యమయ్యేది.

Indian festival Diwali, Diya oil lamps lit on colorful rangoli with Swastika symbol. Hindu traditional. Happy Deepavali.

పంతొమ్మిదవ శతాబ్దానికి పశ్చిమ దేశాలు అన్నిటికీ పాకింది స్వస్తికా.

ప్రతిదాంట్లో, ప్రకటనలో, డిజైన్లలో, హాకీ , ఫుట్బాల్ క్రీడాకారుల జెర్సీల మీదకు పాకింది స్వస్తికా. ఎవరు పడితే వారు , వారికిష్టమైన రీతిలో వాడుకోవడం ప్రారంభించారు.

అంతెందుకు మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం వారి దుస్తులమీద స్వస్తికాను ముద్రించిది లేదా విడిగా కుట్టించింది. నాజీ పార్టీ , జర్మనీలో 1935 నుంచి తమ పార్టీ చిహ్నంగా, జెండా పైనా, అన్ని వస్తువుల మీద ఎరుపురంగు మధ్యలో స్వస్తికాను వాడేవారు. బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ 1939 దాకా ఈ స్వస్తికాను తమ యుద్ధ విమానాల మీద ముద్రించేవారు.

హిట్లర్ యుద్ధ దాహంతో స్వస్తికాకు ఓ కొత్త గుర్తింపు వచ్చింది! మంచికి కాదు, చెడుకి చిహ్నంగా!!

కొద్దిమంది జర్మన్ పండితులు స్వస్తికాకు కొత్త భాష్యం చెప్పడం ప్రారంభించారు సంస్కృత భాషలో ఉన్న స్వస్తికాతో పోలుస్తూ, ఆ గుర్తు తమ బాష వల్ల ఉద్భవించిందని కొత్త పాఠం ప్రారంభించారు. వారు కప్పిపెట్టిన విషయమేమిటంటే జర్మన్ వారి భాషామూలాలు సంస్కృతం వల్ల వచ్చాయని.

నరరూప రాక్షసులైన నాజీలు ఇంకో రకంగా ఊహించుకుని పురాతన భారతీయుల నుంచి తమ పూర్వీకులు వచ్చారని, అందువల్లే తమ జాతి పురాతన దేవుని యుద్ధవీరుల(ఆర్యులు) నుంచి ఉద్భవించిందనీ.. కొత్త పల్లవి అందుకున్నారు.

నాజీలు 1939కి అధికారం పూర్తిగా హస్తగతం చేసుకుని యూదులను ఊచకోత కొయ్యడం ప్రారంభించారు , అరవై లక్షల మంది యూదులను జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్.. ఇలా తాము ఆక్రమించుకున్న దేశ యూదులను అత్యంత దారుణంగా చంపారు. ఎలా ఎంత పాశవికంగా చంపారో ఇంకో వ్యాసంలో తెలుసుకుందాం. జర్మనీ హిట్లర్ అధికారంలోవున్న ఆరేళ్ళు.. ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసింది.

ఈ నాజీల పాలనలో, కొద్దిగా వంకరగా, నల్లటి వృత్తంలో ఉన్న స్వస్తికా.. వెనుకాల ఎరుపురంగు కనిపిస్తే సామాన్యులు భయబ్రాంతులకు గురయ్యేవారంటే ఊహించండి. పవిత్రమైన స్వస్తికాను ఏ స్థితికి తీసుకెళ్లారో..? నాజీల స్వస్తికా అణిచివేతకు, మారణహోమానికి చిహ్నంగా మారిపోయింది. ఈరోజుకీ స్వస్తికాను చూస్తే యూదుల వెన్నులో వణుకు స్పష్టంగా కనిపిస్తుంది. కారణం తమ తల్లితండ్రులు, తాతలు, బామ్మలు ,అమ్మమ్మలను, ఇతర దగ్గర బంధువులను ఎంత పాశవికంగా చంపారో వారికి మాత్రమే ఆ బాధ స్పష్టంగా తెలుసు. నాజీల శకం అంతమయ్యి డెబ్భై ఐదు సంవత్సరాలు అయినా.. స్వస్తికా మీద అభిప్రాయం మాత్రం వారిలో మారలేదు.

ఈమధ్యనే 2007లో జర్మనీ దేశం నాజీల స్వస్తికా గుర్తును నిషేధించింది. ఒక సడలింపుతో, ఇతర మతాల వారు, దేశస్థులు తమ సంస్కృతికి చిహ్నంగా ఉన్న స్వస్తికాను.. ముఖ్యంగా తూర్పు, దక్షిణ ఆసియా దేశస్థులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles