తన సక్సెస్ స్టోరీ చెప్పాలనకున్నాడు.. కానీ, సోషల్ మీడియాకు దొరికిపోయాడు! ఓ ఐపీఎస్ ఎందుకు వైరలయ్యాడు..?

ఒక అద్భుతాన్ని సాధించావనుకో లోకం హర్షిస్తుంది. అభినందనలు తెలుపుతుంది. కానీ, ఎన్నో అద్భుతాలు సృష్టించినా.. అయ్యో ఈ మాత్రం తెలీదా అనేంత ఓ బ్లండర్ చేశావనుకో.. అదే లోకం నిన్ను దెప్పి పొడుస్తుంది. ఇప్పుడో ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ స్టా లో అదే అనుభవిస్తున్నాడు. తన సక్సెస్ స్టోరీకెంత క్రేజ్ వచ్చిందో… ఆయన చేసిన ఓ చిన్న వాక్య నిర్మాణంలోని ఎర్రర్ ను పట్టుకున్న నెటిజనం వెటకారాన్నీ దట్టిస్తున్నారు. మొత్తంగా ఆ ఐపీఎస్ కథ.. తొందరపాటో, తెలియకుండా చేసే పనులు ఎంత కొంపముంచుతాయో ఇతరులను అప్రమత్తం చేసేది.

సమీర్ శర్మ అనే ఐపీఎస్ ఒక వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో అంతా తన స్ఫూర్తిదాయకమైన జర్నీ గురించే చెప్పుకొచ్చాడు. అందుకు ఆయన చాలామంది నుంచీ ప్రశంసలూ అందుకున్నాడు. కానీ, అందులో ఆయన చేసిన ఒక ఒక్క మిస్టేక్ మాత్రం డేగ కళ్లతో చూసే సోషల్ మీడియా వారియర్స్ కు ఆయన జుట్టునందించింది.

ప్లస్ వన్.. అంటే ఇంటర్ ఫస్ట్ ఈయర్ లో కేవలం 34 శాతంతోనూ.. అలాగే, ఇంజనీరింగ్ లో 24 బ్యాక్ లాగ్స్ తోనూ తన అకడమిక్ జీవితాన్ని చాలా కష్టంగా గడిపిన తాను.. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి 182 ర్యాంకుతో ఐపీఎస్ పొజిషన్ కు రావడంపై సమీర్ ఆ వీడియో చేశారు. తనలాగే సివిల్స్ సాధించాలనే తపనతో ఉండే ఎందరో అభ్యర్థులకు ఉపయోగపడుతుందన్న ఒక యోచనతో… సివిల్స్ కు ప్రిపేరయ్యే క్రమంలో తన 18 నెలల ప్రయాణాన్ని వివరించాడు. కానీ, ఆ ఇన్ స్టా వీడియో పోస్ట్ పక్కనే ఇంగ్లీష్ లో రాసిన ఓ వాక్య నిర్మాణం మరీ డొల్లగా ఉండటంతో.. దానిపై నెటిజనం దృష్టి పడింది.

https://www.instagram.com/reel/DGWXjV6T_-C/?igsh=Y3VodDB3aHlrZnZl

ఇంతకీ సమీర్ శర్మ ఏం రాశారంటారా..? “Do not heard about UPSC 18 months before exam.” అనేదే ఆ గ్రామటికల్ ఎర్రర్. అసలు సమీర్ శర్మ చెప్పాలనుకున్నది ఓసారి పరిశీలిస్తే… “Had not heard about UPSC till 18 months before the exam.” అంటే 18 నెలల క్రితం వరకూ కూడా నేను యూపీఎస్సీ గురించి పెద్దగా వినలేదనేది ఆయన చెప్పాలనుకున్న సారాంశం. కానీ, ఇంగ్లీష్ కన్వర్సేషన్ లో వాక్యనిర్మాణంలో దోషంతో నెటిజన్స్ కు దొరికిపోవడంతో.. తాను చెప్పాలనుకున్న ఇన్స్పిరేషన్ స్టోరీ కంటే… తన మిస్టేకే ఆయనకిప్పుడు తలబొప్పి కట్టిస్తోంది.

కొందరు పెద్ద మనసుతో సమీర్ సక్సెస్ స్టోరీని ప్రశంసించినా.. చాలామంది నెటిజన్స్ మాత్రం వదలడం లేదు. ఐపీఎస్ మే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నహీ హోతా హై క్యా..? అని ఒకరంటే… మీ గ్రామర్ లో గల్లత్ ఉందంటూ ఇంకొంకరు సూటిగానే తప్పుపట్టారు. దీంతో తన సక్సెస్ స్టోరీ వైరల్ అవుతుందనుకున్న దానికన్నా.. తన మిస్టేక్ తో ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక మిగిలిన తన ఐపీఎస్ ప్రిపరేషన్ లో సమీర్ ఏవిధంగా ముందుకెళ్లాడో చెప్పిన ప్రతీ అంశమూ అదే స్థాయిలో నెటిజన్స్ నుంచి ప్రశంసలను కురిపించింది. తన ప్రతీ వైఫల్యాన్నీ సవాల్ గా స్వకీరించి ముందుకెళ్లిన తీరు, మానసిక సంసిద్ధత, ఆశావహ దృక్పథం, వైఫల్యాలను విజయానికి మెట్లుగా మల్చుకున్న తీరు, పరిపూర్ణత కంటే కూడా స్థిరత్వమెంతో ముఖ్యమో చెప్పిన విధానం ఇవన్నీ వెరసి శర్మ వీడియో 9 లక్షల మంది చూశారు.

అయితే, ఐపీఎస్ సాధించిన వ్యక్తిగా తాను చెప్పిన అంశాలెంత ప్రశంసలందుకున్నాయో.. ఒకే ఒక్క చిన్న దోషం మాత్రం సమీర్ ను ఇరకాటంలో పడేసింది. సమీర్ శర్మకు సోషల్ మీడియా వేదికగా తాకిన ఈ దెబ్బ.. ఏమాత్రం ఆదమర్చినా, యాక్యురసీ మెయింటెయిన్ చేయకపోయినా, చిన్న తప్పు దొర్లినా సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా పనిచేస్తుందో తెలియజెప్పే ఓ పాఠంలాంటింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles