తండ్రేమో నియంత్రణకు వెళ్లితే.. కొడుకేమో నిరసనకు వెళ్లాడు: సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో!

హక్కుల కోసం గళమెత్తితే… విద్యాశాఖా మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తే.. ఓవైపు పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. వాటర్ కెనాన్స్ ఉపయోగిస్తున్నారు. మేకులు కొట్టిన లాఠీలతో బాదుతున్నారు. ఇంకోవైపు, స్పందించాల్సిన ప్రభుత్వాధినేతలు మాత్రం నోరు మూసుకుని చోద్యం చూస్తున్నారు. అయితే హా లేకుంటే నా అని స్పందించినా పర్లేదు. కానీ.. అసలే పట్టకుండా పోయినట్టు నటించడమంటే ఆస్కార్ విజేతలన్నట్టే వారు. అలాంటి ఆస్కార్ విజేతలొకవైపు… కర్కశంగా వ్యవహరిస్తున్న పోలీసింగ్ మరోవైపు ఉద్యమాన్ని ఛిన్నాభిన్నం చేయాలని యత్నిస్తుంటే.. సీజేపీ ఉద్యమాన్ని నిలబెట్టేందుకు అదే సంఖ్యలో జనం కదం తొక్కుతున్నారు. అందులో ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే, నాన్నా నేను జంతర్ మంతర్ కు వెళ్తున్నామంటూ ఓ పోలీస్, ఆయన కొడుకు సీజేపీ ధర్నాకు వెళ్లడమే ఆ వీడియో సారాంశం.

జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నాపైన పొలిటికల్, నాన్ పొలిటికల్ గా హైలెట్స్, సైడ్ లైట్స్ ఎన్నో వింటున్నాం, చూస్తున్నాం, వీలైనంత ఫాలో అవుతూనే ఉన్నాం. అందులో ఓ ఇన్ఫ్లుయెన్సర్ విడుదల చేసిన వీడియో మాత్రం అన్నింటికంటే ఎక్కువ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ పిల్లవాడు తండ్రితో కలిసే జంతర్ మంతర్ కు వెళ్తున్నట్టు చెబుతున్నాడు.

తండ్రేమో పోలీస్ ఆఫీసర్ గా తన డ్యూటీ కోసం పోతే.. కొడుకేమో సీజేపీ నిరసనకు మద్దకు తెలిపేందుకు వెళ్లడమే ఆ వీడియో విశేషం.

అందులో ఆ పిల్లాడేమంటాడంటే… పాపా ఔర్ మై.. దోనో జంతర్ మంతర్ జా రహే హై.. మై పిట్నే ఔర్ పాపా పీట్నే… అంటే, నేను, నాన్న ఇద్దరం జంతర్ మంతర్ పోతున్నాం… నేను కొట్టించుకోవడానికి పోతున్నా… మానాన్న కొట్టడానికి పోతున్నాడు అనేది ఆ పోస్ట్ సారాంశం.

ఈ వీడియో వెంటనే వైరల్ అయి నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది.

కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో జరుగుతున్న నిరసన ఇప్పటికే నెల దాటుతున్నా పాలకుల నుంచి ఉలుకూ పలుకూ లేదు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో.. చలో సంసద్ మార్చ్ అనంతరం సీజేపే ప్రతినిధులు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కూడా కలిశారు.

ఈ క్రమంలోనే ఇన్ స్టా లో dev_ashish28 అనే ఖాతా ద్వారా ఈ పోస్టును షేర్ చేశారు. దీనికిప్పుడు అనూహ్య స్పందన వస్తోంది.

సీజేపీ నిరసనల మీద ఇంట్లో మీరు ఇద్దరూ ఎలాంటి చర్చలు చేసుకుంటారో తెలుసుకోవాలని ఉందని ఒకరంటే…. ఒకవేళ పోలీసులు విద్యార్థులను కొట్టకుండా, వారికి మద్దతుగా నిలిస్తే ఎలా ఉంటుందన్నది మరొకరి ప్రశ్నైంది. నేను కూడా వచ్చి ఉంటే, మనిద్దరం ఒకే వైపు ఉండేవాళ్లమని ఒకరు ఆ అబ్బాయి పోస్టుకు మద్దతు తెలిపితే… మీ తండ్రి–కొడుకుల బంధం నిజంగా విప్లవాత్మకమైందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. నీపై నాకు గౌరవం పెరిగింది.. నీ తండ్రి తన సొంత కొడుకు కూడా అక్కడే ఉన్నాడని గుర్తుంచుకుని విద్యార్థులను ఎక్కువగా కొట్టకూడదని ఆశిస్తున్నానంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తంగా ఏదో ఒకరూపంలో వివిధ మాధ్యమాల ద్వారా, వివిధ వయస్సులవారి ద్వారా.. సీజేపీ నిరసన అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. మరిది బీజేపీ పాలనకే బ్రేక్ వేయగలదా… లేక, బీజేపీ పాలనా విధానాలను నియంత్రించే స్పీడ్ బ్రేకర్ కానుందా అన్నది చూడాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles