కింద ఉన్న పెయింటింగ్ చూస్తే కొద్దిమందికి నచ్చకపోవచ్చు. కారణం వయసులో ఉన్న యువతి ఒక పెద్దాయనకు చనుబాలు ఇవ్వడమేంటి అనిపించవచ్చు. మానవ సహజ ప్రవృత్తేంటంటే… ఏమిటి, ఎందుకు, ఎలా అనే మౌలిక ప్రశ్నలతోనే… ఎలాంటి కారణాలు అన్వేషించకుండా తొందరపడి ఒక అంచనాకు రావడమే!

ఇదమిద్ధంగా ఎప్పుడన్నది తెలియదు కానీ.. ఈ పెయింటింగ్ 30 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన డబ్బుతో పోలిస్తే ఉజ్జాయింపుగా రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలకు కొన్నారు. ఆ చిత్రాన్ని పరీక్షగా చూస్తే ఒక బాలింతరాలు ఒక పసివాణ్ణి ఎత్తుకుని జైల్లో ఉన్న వ్యక్తికి పాలిస్తోంది.
ఆమె అతని కూతురు. అతను ఒక బ్రెడ్ దొంగతనం చేశాడన్న ఆరోపణల మీద నామమాత్రపు విచారణ జరిపి ఖైదు చేశారు.
లూయిస్ ది గ్రేట్.. లేదా, సన్ కింగ్ అని పిలవబడే louis XIV కాలంలో.. అంటే దాదాపుగా నాలుగు వందల ఏళ్ల క్రితం.. లేదా, నాలుగు వందల పాతికేళ్ల క్రితం జరిగిందీ సంఘటన.
అప్పటి ఫ్రాన్స్ రాజులు ప్రజలను పీడించుకుని పన్నులు వసూలు చేసుకుని ఆడంబరంగా బతికేవారు. సామన్య ప్రజలు మాత్రం తిండి దొరక్క.. మురికి కాలువల్లో తిరిగే పందికొక్కులను, ఎలుకలను, వివిధ రకాల పురుగులను పట్టుకుని బతికేవారు. అంటే ఎంత అధ్వాన్నంగా ఉండేవో పరిస్థితులు ఊహించుకోండి!
ఆ సమయంలో ఆ ముసలాయన బ్రెడ్ దొంగలించాడని ఆరోపింపబడి.. ఖైదు చేయబడ్డాడు. అప్పట్లో ఫ్రాన్స్ లో అరాచకం చట్టమేలుతోంది. సామాన్యుల ప్రాణాలకు విలువ లేదు. జడ్జిగారు బ్రెడ్ దొంగిలించిన పాపానికి, ప్రాణాలు పోయేంత వరకూ… జైల్లో తిండి పెట్టకుండా అతన్ని బంధించి ఉంచమని ఆదేశాలు జారీచేశారు.
అతన్ని కలవడానికి రోజూ అతని కూతురికి అనుమతి ఇచ్చారు. కూతురు తండ్రిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రికి ఎటువంటి తిండిపదార్థాలు తీసుకువెళ్ళట్లేదు అని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. కొద్దిసేపు తండ్రిని కలవడానికి లోపలికి పంపించేవారు.
అతన్ని ఖైదుచేసిన నాలుగు నెలలకు కూడా అతను సన్నబడడం.. లేదా నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనిపించక పోయేసరికి జైలు అధికారులు విస్తుపోయారు. రోజూ వచ్చి తండ్రిని కలిసే కూతురు లోపలికి ఏమి తీసుకెళ్లట్లేదు.. అయినా అతను మాములుగా ఎలా ఉంటున్నాడు అనే అనుమానంతో చాటుగా ఆ అమ్మాయిని గమనించసాగారు.
ఆ అమ్మాయి చేసే పని చూసి నివ్వెరపోయారు జైలు అధికారులు. తన పసికందుకి కొన్ని పాలు తగ్గించి.. ఆమె రోజూ తండ్రిని కలిసినప్పుడు తండ్రికి కూడా పాలు ఇవ్వసాగింది ఆ మాతృమూర్తి.
విషయం విన్న జడ్జి ఆమెకూ ఏం శిక్ష విధిస్తారో అనుకున్నారంతా! కానీ, ఈసారి జడ్జ్ లో కూడా పశ్చాత్తాపం కల్గి ఆమెకు శిక్ష వేయకపోగా.. ఆమె తండ్రిని కూడా విడుదల చేశారు. ఇందడీ.. ఆ ఫోటో వెనుకున్న ఇంత కథ!
సుబ్రహ్మణ్యం వల్లూరి.. ✍️




Story best but
Weast ilanti story dwara yuvatha chedipotunnaru