తాత్విక దర్శనంలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే.. a journey to kasi!

SUJATHA CHEBROLU.. ✍🏻

ఈ ప్రపంచం లో కోట్లాది మందికి భగవంతుడు ఒక సమాధానం.. ఒక పలాయనానికి కూడా అవకాశం.. సాధారణంగా కుటుంబం అంటేనే బాధ్యత.. బరువు కూడా! పెళ్లి సంసారం ఇచ్చే సంతోషం ఆ కుటుంబాన్ని సాకటంలో ఉండదు.. సంపాదన కోసం వళ్ళు అరిగిపోవాలి..ఈ యాతన వద్దు అనుకుంటే ఒక్క అడుగులో దాటిపోవచ్చు.. ఇందుకు కూడా సింహద్వారం తెరిచేది దేవుడే!

కధలో ఒక తాత. .వయసులో సుఖంగా జల్సా చేసి ఓపిక చచ్చాక దేవుడి పేరు చాటున ఉంటాడు. కొడుకు.. ఆయనకి భార్య, పిల్లా.. హఠాత్తుగా కాశీలో పరమేశ్వరుడు గొంతెత్తి ఆయన్ను పిలిచాడు. అంతే.. వయసులో ఉన్న భార్య, పిల్ల తండ్రి జ్ఞాపకంలోంచి జారిపోయారు..ఇల్లు వదిలేశాడు.. ముక్తిమార్గం! కానీ అదే అతని అడుగు జాడల్లో నడిచే భార్య ఏం చేయాలి..? నమ్ముకున్న తండ్రి ఏం కావాలి..??

చిత్రం ఏమిటంటే తండ్రి వడిలో గారాలు పోయే కూతురు చివరకు ఏమైందో చూడండి. భగవంతుడు అనేవాడు పిల్ల బతుక్కి చూపిన ముక్తిమార్గం రక్త మాంసాలతో నిండిన వైతరణిలో కాపురం. విముక్తి మార్గం కాదది.. సాక్షాత్తు నరక ద్వార దర్శనం! మరి తండ్రికి తన పిలుపుతో రెండవ జన్మ అనే సన్యాస జీవితం ఇచ్చి.. ధన్యుడిని చేసిన పరమాత్ముడు పిల్లకి సమాధానమే లేని ప్రశ్న వంటి జీవిత మెందుకు ప్రసాదించాడు..?

సర్వసాక్షి చూపుల్లో కూడా స్వపర బేధం ఉండాలా.. ఉంటుందా..? నాకు భజన చేసి నా ఉనికి ప్రచారం చేస్తాడు కనుక.. తండ్రిని ఇహలోక బంధాల నుంచి విముక్తుడిని చేసి.. పిల్లను మాత్రం వదిలి… ఉన్న ఒకే ఒక ఆధారం తల్లి, తాతను ఆయుస్సు చాల్లే అని ఎత్తుకుపోతే.. పిల్ల అనాథై.. .జీవితం చక్కబెట్టుకోలేని అభాగ్యురాలై.. తనను తాను రక్షించుకోలేని దీనురా లై.. కాస్తయినా సున్నితత్వం ఎరుగని రాతి బొమ్మై.. బతక వలసిన యోగం కల్పించిన భగవంతుడిని ఎందుకు.. ఏమని.. కీర్తించాలి..??

మనుషులు కర్కశులై, రాక్షసులై, పశువులై బతుకుతూ ఉండేలా.. తన పరిపాలన ఇంత నికృష్టంగా నడిపించాలా ఆ దేవుడు..? సర్వ ప్రాణులను సమదృష్టితో చూడటం ముందు దేవుడు నేర్చుకుంటే.. అది మనుషులకు కూడా అందుతుంది.

సినిమా చూసి చాలా డిస్టర్బ్ అయ్యాను. దిగులు బాధ కలిగింది. ఎవరో డైరెక్టర్ బాగా చెప్పాలని చూశాడు. రాసుకున్నారు. ఇది ప్రైమ్ లో రెంటుకు ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles