ఇప్పుడు దాని మొహం నల్లపిల్లి మొహంలానే ఉంది! చీకటిపై ఓ సమీక్ష!!

INDUS MARTIN.. ✍🏻

…………………………………………………………………………………………………….

చీకటి… చిమ్మచీకటి!

థ చదివాక నాలో మిగిలిన పదార్ధం అదే!
బహుశా… నాదేహం కూడా చీకటేనేమో
అనంత విశ్వమ్నుండి నా పితరులను మోసుకొచ్చిన నక్షత్రశకలం చీకటిని తాగుతూ ఎన్ని బిలియన్ల మైళ్ళు ప్రయాణించిందో ఈ కథ చెబుతుంది. అంతా చీకటి… ఆ చీకటి తాలూకు శకలాలు నా క్రోమోజోముల్లో నిక్షిప్తమయ్యున్నాయనే నిజాన్ని తెలుసుకున్నప్పుడు…. చల్లటి ఒక చెమట దుప్పటి నన్ను నిలువెల్లా కప్పేస్తుంది.

కథ మొత్తంగా దృశ్యాలను దండగుచ్చిన విధానంలో సాగింది. కథలోని ఎమోషన్స్ కూడా ఇమేజరీ బలంతోనే నిలదొక్కుకున్నాయి. నాన్న నెత్తురును అద్దుతున్న అమ్మ దృశ్యంలో ఆ నీచువాసనా కడుపులో దేవే ఆ వికారం ఇన్ బిల్ట్ గా ఉన్నాయి. దానికి కాంట్రాస్ట్ గా నెరేటర్ చూపించే నిర్భావ రియాక్షన్ జుగుప్సును ఇనంటెన్సిఫై చేస్తుందేగానీ పాఠకుడుకి ఎలాంటి రిలీఫ్ ఇవ్వదు.

కథలో గత పదేళ్ళుగా ( మరీ ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో) పెచ్చుమీరుతున్న మూఢనమ్మకాలూ, వాటితాలూకు దుష్ఫలితాలూ స్మరణకు వస్తూ పోతూ ఉంటాయి. మొదటి డంబెల్ దెబ్బకే మదనపల్లె లెక్చరర్ కుటుంబం వచ్చి నాముందు బాసంపట్టు వేసుకుని ముగ్గులో కూర్చుంది. హానీని మొదటిసారి గుడ్డమూటలోనుండి బయటకు తీసే దృశ్యం మొన్నామధ్య రోడ్ యాక్సిడెంట్లో నక్కిరేకల్లు దగ్గర చనిపోయిన ఆ హీరో తండ్రిని జ్ఞాపకం తెచ్చింది. ఆ సందర్భంగా నేను ఆయన నమ్మకాల గురించి విన్న అనేక కథలు గుర్తొచ్చాయి. ఆయన నడిపే హోటల్ గదిలో బోనులో పెంచుకుంటున్న నక్కా, ప్రతీ ఉదయం బయటకు పోయేటప్పుడు ఆయన తొక్కే దాని తోకా జ్ఞాపకం వచ్చాయి. రైస్ పుల్లింగ్ బౌల్, ఇరీడియం కనుగొనే రెడ్ సాండ్ బోవా… వాటి మాయలో పడి ఆత్మహత్య చేసుకున్న గోదావరి జిల్లా డాక్టర్ కుటుంబం… ఇలా ఒక్కొక్కటే వచ్చీ పోయాయి.

అమ్మా నాన్నల ప్రేమరాహిత్య సాంగత్యంలో ఆర్గాజానికి బై ప్రోడక్ట్స్ అయిన పిల్లల మానసిక పరివర్తనా, జీవన ప్రవర్తనా పకడ్బంధీగా రూపుదిద్దుకున్నాయి. మూఢత్వం, మోసం, లేకితనం లాంటి అనేక నీచ మానవ విలువల మధ్య పెరిగే పిల్లల శారీరక మార్పులు కూడా నెరేటర్ ఎండిన, పెళుసుబారిన, పొలుసులు రాలుతున్న శరీర వివరణలో చాలా డిటెయిల్డ్ గకనబడుతున్నాయి.

కథలో శబ్ధం కూడా విజయవంతంగా తన పాత్ర నిర్వహించింది. డంబెల్ శబ్ధంతో మొదలై, అదే డంబెల్ శబ్ధంతో అంతం అవుతుంది. అయితే మధ్యలో నల్లపిల్లి ప్రసవం ఎపిసోడ్ లో పడిన మాయ శబ్ధం మినహా శబ్ధాన్ని మరింతగా ఎంప్లాయ్ చేసిన ప్రయత్నం కనబడదు. నల్లపిల్లి ప్రసవం తాలూకు మరిన్ని శబ్ధ దృశ్యాలు శృష్టించే వీలూ, దానితాలూకు ఎమోషన్ ని క్యాప్చర్ చేసే వెసులుబాటూ పుష్కలంగా ఉన్న కథ.

అమ్మా నాన్నల వెకిలితనాన్నీ నిక్కచ్చిగా చెబుతూ ఆ ‘ దైవం’ అనబడే స్టీరియో టైప్ మొహాన డంబెల్ పెట్టి గాట్టిగా గుద్దేశారు. అమ్మా నాన్నలు కూడా మనుషులే. వాళ్ళకూ అందరిలానే బలహీనతలూ, లోపాలూ ఉంటాయి. వాళ్ళ నిర్ణయాలు అత్యంత లోపభూయిష్టమైనవే అయి ఉంటాయనే సత్యం ఆవిష్కరించబడింది. అమ్మా నాన్నలంతా అంత ప్రేమైక జీవులైతే, దైవాంశ సంభూతులైతే ఇంత దుర్మార్గం ఎక్కడినుండి వచ్చిందీ సమాజంలోకీ – ఈ ప్రశ్న కథ మొత్తం గుచ్చుకుంటూనే ఉంటుంది.

రచయితకన్నా ఇందులో కరుణా పాత్ర కెమేరా పర్సన్ గానే చక్కగా కుదురుకుంది.

అచ్చెయ్యకుండా సినిమాగా దీన్ని తీయాల్సిన బాధ్యత ఉంది.

చదివే గొప్ప అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సోదరా!

కథను చదవాలంటే ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.

https://udayini.com/page/2/?fbclid=IwY2xjawEZDa1leHRuA2FlbQIxMQABHZJyASzjWu9rkITbhby1lTeQGW3ngC1jt-tadXQGNFhjkdIALvz3L18D0w_aem_rfnJftBRzYWygpMQLD_D1Q&sfnsn=wiwspwa

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles