టైటిల్ తోనే దృష్టి నాకర్షించే.. DIES IREA!

శబ్దమే కాదు.. నిశ్శబ్దమూ భయపెడుతుంది. దర్శకుడి ఆలోచనలు, సినిమాటోగ్రాఫర్ లైటింగ్ టోన్ ను ఓన్ చేసుకునే సంగీత దర్శకుడుంటే.. నేపథ్య సంగీతంతో ఆ ఫీల్ తీసుకురావొచ్చు. అవసరమైన సౌండ్ వదలడం.. అనవసరం గందరగోళాన్ని సృష్టించకపోవడమూ ఓ కళే. అది DIES IRAE (డైస్ ఇరే) తో చెప్పగలిగాడు సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్ . హర్రర్ థ్రిల్లర్స్ అంటే భయపెట్టడానికి పెద్ద, పెద్ద శబ్దాలు, అరుపులు, పెడబొబ్బలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పిన అద్భుతమైన స్క్రీన్ ప్లే DIES IREA!

Dies Irae Pranav Mohanlal Stills

విదేశాల్లో తల్లిదండ్రులు.. ఇక్కడేమో జల్సాలకు బాగా అలవాటు పడ్డ ధనవంతుడైన ఓ ఆర్కిటెక్ట్ కుర్రాడు… అతడి జీవితంలో సుస్మితాభట్ (కని) ఓ స్నేహితురాలు. ఆ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోవడంతో..ఆ తర్వాత రోహన్ పాత్రలో నటించిన ప్రణవ్ మోహన్ లాల్ వాళ్ల ఇంటికెళ్తాడు. తిరిగి ఇంఇకొచ్చాక.. తన లంకంత కొంపలో ఏం జరుగుతుందన్న కథనంతో సినిమా అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. అప్పటివరకూ జల్సాలకు పరాకాష్ఠలా కనిపించే రోహన్.. కనీ ఆత్మహత్య తర్వాత.. ఆమె ఇంటికెళ్లి ఓ పిన్నీస్ పట్టుకొచ్చింతర్వాత చోటు చేసుకునే ఘటనలు ఉత్కంఠ క్రియేట్ చేస్తాయి. గతంలో తాను ప్రవర్తించిన తీరుపై రోహన్ లో కలిగే పశ్చాత్తాపం వంటివాటిని థ్రిల్లింగ్ గా చిత్రీకరించడంలోనూ, దాని నేపథ్య సంగీతమివ్వడంలోనూ దర్శకుడు, సంగీత దర్శకుడి కో ఆర్టినేషన్ ను మనం ఎంజాయ్ చేస్తాం.

అసలెలాంటి హీరోయిక్ ఎలివేషన్స్ లేకుండా… మమ్ముట్టి వంటి హీరోతో భ్రమయుగం నిర్మించి, విమర్శకుల ప్రశంసలందుకున్న రాహూల్ సదాశివన్ సినిమా అంటే సాధారణంగానే అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు.. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ ను ఎంచుకున్నందుకు.. ప్రణవ్, రోహన్ పాత్రతో చిత్రానికి అంతే ఊపిరి పోశాడు. కథ కన్నా కథనాన్ని ఆసక్తిగా రక్తి కట్టించి.. కొన్ని మలుపులతోనూ.. ముఖ్యంగా చివర అరగంటలో వచ్చే ట్విస్టులతోనూ ఈ మధ్యకాలంలోనే వచ్చిన బెస్ట్ హార్రర్ సినిమాగా DIES IREA నిల్చింది.

DIES IREA అంటే లాటిన్ లో కోపం దినమని.. ఉగ్రతా దినమని అర్థమట. అంత్యక్రియల సమయంలో పాడే పాటగా చెబుతారు. కణి ఆత్మ చూపించే కోపానికి ప్రతీకగా ఈ పేరు పెట్టి ఉండొచ్చునేమో బహుశా! ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు.. భిన్నమైన టైటిల్ తోనే తన సినిమా వైపు దృష్టిని ఆకర్షించాడు రాహూల్ సదాశివన్. నేపథ్య సంగీతం, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఆసక్తికర కథనం వెరసి.. జియో హాట్ స్టార్ లో ఉన్న DIES IREA హార్రర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఓ మంచి ఛాయిస్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles