విమానంలో ఇద్దరు హీరోల కథ.. ఇప్పుడు ప్రపంచమంతా ఎందుకు మాట్లాడుకుంటోంది..?

స్ఫూర్తినిస్తోన్న ఆ హీరోలు ఎవరు…?

అసలు టెక్స్టైల్ వ్యాపారంలోకి వెళ్లాల్సిన ముంబై యువకుడు పైలట్ ఎలా అయ్యాడు..? నడిసంద్రంలో పైన వినీలాకాశంలో పీడ కలలాంటి ఘర్షణలో.. 174 మంది ప్రయాణీకులను ఎలా కాపాడాడు..? ఆ పైలట్ కు అండగా నిల్చి.. ఇజ్రాయెల్ లో హీరోగా మారిన మరో పౌరుడెవరు..?

అసలు FZ1073లో అసలు ఏం జరిగింది..?

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వైపు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానం ఏకంగా 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తోంది. మూడు గంటలుగా ప్రయాణం సజావుగానే సాగుతోంది. ఒకరు సినిమా చూస్తున్నారు. మరొకరు కిటికీల్లోంచి మేఘాలను తాకుతూ వెళ్లతున్న విమానంలో మాటలకందని అనుభూతి పొందుతున్నారు. ఇంకొకరు పడుకున్నారు. కానీ, మూడు గంటల తర్వాత ఒక్కసారిగా అలజడి చెలరేగింది. విమానంలోని ప్రయాణీకులంతా అలర్టయ్యారు. విమానం కిందకు దిగుతుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అలా కొద్ది సమయంలోనే 30 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం 14 వేల అడుగులకు పడిపోయింది. అదెంత కిందకు పడిపోతోందో లోపలి ప్రయాణీకులకు తెలియదు. అప్పుడప్పుడు కనిపించే కుదుపులకు లోనవుతుందని భావించారు. కానీ, కాక్ పిట్ లో మాత్రం ప్రాణాంతకమైన ఓ పోరాటమే నడుస్తోందని లోపలున్నవారికి తెలియడం లేదు. ఇదీ నిన్న సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన.

కో పైలట్ వర్సెస్ పైలట్!

ఉన్నపళంగా విమానంలో ఉన్న మరో కో పైలట్ విమానాన్ని దింపే ప్రయత్నం చేశాడు. దాంతో పైలట్ గా ఉన్న మన ఇండియన్, ముంబైకి చెందిన స్మిత్ మచ్చర్ అడ్డుకునే యత్నంలో ఘర్షణ జరిగింది. దాంతో కో పైలెట్, పైలెట్ స్మిత్ పై కత్తితో దాడి చేయడంతో పోరాడుతూనే కాక్ పిట్ తలుపులు తెరిచి లోపలికి ప్రయాణీకులు వచ్చేలా అవకాశం కల్పించాడు. అప్పడే మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతడే ఇజ్రాయెల్ ప్రయాణీకుడు.. ప్లంబర్ గా పనిచేస్తున్న యానివ్ హయూన్. కాక్‌పిట్‌లో ఏదో జరుగుతోందని గుర్తించిన వెంటనే ముందుకు పరిగెత్తాడు. మచ్చర్ తెరిచిన కాక్‌పిట్‌లోకి వెళ్లి, దాడి చేసిన కో-పైలట్‌ను పట్టుకుని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆ వెంటనే విమానం కిందకు దిగడాన్ని గమనించిన సదరు ప్లంబర్.. విమానం ముందరి భాగాన్ని కంట్రోల్ లోకి తీసుకొచ్చాడు.

మరి ప్లంబర్ కు ఏం తెలుసు విమానం నియంత్రణ గురించి..?

తాను ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ అనే టీవీ కార్యక్రమానికి అభిమాని. అధికారిక పైలట్ శిక్షణ లేకపోయినా.. టీవీలో చూసిన విషయాలను గుర్తు పెట్టుకుని అత్యవసర సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి.. కత్తిపోట్లకు గురైన పైలట్ స్మిత్ కు అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత అదనంగా మరో ఇద్దరు ఫ్లై దుబాయ్ పైలట్స్ విమానాన్ని కంట్రోల్ లోకి తీసుకున్నారు.

ఇంకో ఇజ్రాయెలీ ప్రయాణికుడు డాక్టర్ షోటా ముసాయేవ్.. గాయపడిన మచ్చర్‌కు ప్రాథమిక వైద్య సాయందించాడు. విమానంలో ఉన్న ఒకే ఒక్క వైద్యుడతను.

స్మిత్ మచ్చర్ ఎవరు..?

ముంబైవాసైన స్మిత్ మచ్చర్ ఏనాడూ పైలట్ కావాలనే కలలే కనలేదు. తన కుటుంబమంతా టెక్స్టైల్ వ్యాపారంలో ఉంది. కనుకు తానూ అదే వారసత్వంలో వెళ్దామని… స్కూల్ తర్వాత టెక్స్టైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు మేనేజ్మెంట్ పూర్తి చేయాలనుకున్నాడు. అదే సమయంలో సుమారు 19 ఏళ్ల వయస్సులో మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా ఏవియేషన్ సెమినార్ కు హాజరయ్యాడు. అక్కడే స్మిత్ మచ్చర్ జీవితం మారిపోయింది. పైలట్ కావాలన్న సంకల్పం బలపడింది. విమానయాన ప్రపంచంపై మక్కువ ఏర్పడింది.

టెక్స్టైల్ వ్యాపారం నుంచి కాక్ పిట్ వైపు అడుగులు!

తల్లి భయపడింది. అయినా పర్లేదు తాననుకున్నది చేయాలనకున్నాడు. కుటుంబ సభ్యులను ఒప్పింది న్యూజిలాండ్ లో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడి నుంచి స్పైస్ జెట్ లో 11 ఏళ్లకు పైగా కెరీర్ సాగింది. సీనియర్ కమాండర్, లైన్ ట్రైనింగ్ కెప్టెన్ గా ఇతర పైలట్లకు శిక్షణనిచ్చాడు. 2022లో ఫ్లై దుబాయ్ లో కెప్టెన్ గా చేరాడు. తన లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం బోయింగ్ 737 విమానాలపై దాదాపు 9 వేల 750 గంటలు ఫ్లైయింగ్ అనుభవం సంపాదించాడు స్మిత్.

నేటి పరీక్షకు ఉపయోగపడిన తన అనుభవం!

తీవ్రంగా గాయపడి కాక్ పిట్ పై రక్తమోడుతున్నప్పటికీ… కాక్ పిట్ డోర్ ఓపెన్ చేసే రిలీజ్ ను యాక్టివేట్ చేశాడు. ఆ ఒక్క చర్యే విమాన ప్రమాదాన్ని కాపాడింది. బయట ఉన్నవాళ్లు కాక్ పిట్ లోకి వచ్చే అవకాశం లభించింది. తను ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణీకులను కాపాడిన తీరుతో.. స్మిత్ ను ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు అంతా వావ్ భేష్ అని అభినందిస్తున్నారు.

మరి విమానంలో అలజడి సృష్టించిన ఆ కో పైలట్ ఎవరు..?

కో పైలట్ ఒమన్ జాతీయుడనే చర్చ జరుగుతోంది. కానీ, ఇప్పటివరకూ అతడి పేరైతే ఎవ్వరూ అధికారికంగా బయటపెట్టలేదు. తను ఫ్లై దుబాయ్ లో పనిచేస్తున్నాడు. తను ఎందుకు ఫ్లైట్ ను అదుపులోకి తీసుకుని కిందకు దింపాలనకున్నాడన్నది ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది.

వాస్తవానికి ఇజ్రాయెల్ వైప్ వెళ్లే గల్ఫ్, అరబ్ దేశాల ఫ్లైట్స్ పై పకడ్బందీ నిఘా ఉంటుంది. మరి ఒమన్ కు ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలు కూడా లేవు. అలాంటి ఒమన్ జాతీయుణ్ని టెల్ అవీవ్ కు వెళ్లే ఫ్లైట్ లో కో పైలట్ గా ఎలా అనుమతించారన్నదీ ఇప్పుడు మిస్టరీనే. ఫ్లై దుబాయ్ కి ఉన్న ఆపరేటింగ్ ఒప్పందంలో ఇజ్రాయెల్ తో సాధారణ సంబంధాలున్న పైలట్లకే అనుమతినివ్వాల్సి ఉంటుంది. కానీ, ఒమన్ జాతీయుడు ఎలా కో పైలట్ గా వ్యవహరించాడన్నదే ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా తేలాల్సిన అంశం. అతడికి ద్వంద్వ పౌరసత్వముందా అనే కోణంలోనూ ఇప్పుడు దర్యాప్తు జరుగుతోందా.. లేక క్రూ అసైన్మెంట్ లో లోపమా అన్నవీ తేలాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles