అలరించే అకార్డియన్.. దాని వెనుక కథ!

వంకాయి చేతుల్లో ఉంది… అది మంచి శాకం కావాలంటే… ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, పోపు విత్తులు, మెంతి.. ఇలా అన్ని ఇన్ గ్రేడియంట్స్ కావల్సిన పాళ్లల్లో మిళితం చేయాలి. అప్పుడే.. ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అని పాడుకుంటాం.

మరి పాట కూడా అంతేగా..?

కేవలం గాయకుడో, గాయనో పాడినంత మాత్రాన పాట రంజింపజేయదు. దానికి పక్క వాద్యాల సహకారం తప్పనిసరి. అలాంటి వాద్యాల్లో.. సింథసైజర్స్, స్యాక్స్ ఫోన్, ట్రంఫెట్స్, గిటార్స్, సితార్, వీణ, ఫ్లూట్, హార్మోనియం.. తాళానికి తబలా, కాంగో, డ్రమ్స్ ఇలా.. ఈమధ్య కాలంలో కొత్తగా వస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ తో కలిసి.. ఓ చాంతాడంత జాబితానే కనిపిస్తుంది. వీటన్నింటిలోనూ.. ఏ వాద్యానికదే ప్రత్యేకత కల్గి ఉన్నా… ఒక వెస్ట్రన్ వాయిద్యం మాత్రం మన సినిమా సంగీతంతో బాగా కనెక్టైపోయింది.

అదే.. అకార్డియన్. చూస్తే.. హార్మోనియం లాగే కనిపించినా… అకార్డియన్ నుంచి బయటకొచ్చే సౌండ్స్ వినసొంపుగా మననును ఆ పాట వెంటే తీసుకెళ్తాయి. అందుకే అకార్డియన్ ఇన్వెన్షన్ జరిగిన రోజు పురస్కరించుకుని.. ఆరోజు గూగుల్ డూడుల్ తో నూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

అకార్డియన్ ప్లేయర్లలో ఇప్పుడు ఎందరో సుప్రసిద్ధులున్నారు. మొట్టమొదట క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ లుడ్విగ్ బుష్ మన్ అనే వ్యక్తి బెర్లిన్ లో 1822లో దీన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత పలు మార్పులతో అకార్డియన్ వాద్యం మరింత వినసొంపుగా తయారవ్వడం.. కొత్త పుంతలు తొక్కే సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడమనేది… కజిన్ ఆఫ్ హార్మోనియమైన అకార్డియన్ ప్రత్యేకత.

1951లో సమాధి అనే ఓ బాలీవుడ్ సినిమాలో.. మొట్టమొదట గోరె గోరె ఓ బన్ కే చోరే అనే పాటలో సి. రామచంద్ర అనే కంపోజర్ ఈ ఆకార్డియన్ వాద్యాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత బాలీవుడ్ సంగీత గతిని మార్చేసిన నౌషాద్ అలీతో… అకార్డియన్ వాద్యానికి మరింత గుర్తింపు వచ్చి.. పాటలు వన్నెలద్దుకున్నాయి. 35 సిల్వర్ జూబ్లీలతో పాటు… మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ తో పాటు.. పద్మభూషణుడైన నౌషాద్ .. మొదట దాస్తాన్ అనే సినిమాలో అకార్డియన్ ను ఉపయోగించాడు. పార్సీ డ్రమ్మర్ కవాస్ వార్జ్ చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయి.. ప్రతిభావంతుడైన అకార్డియన్ ప్లేయర్ గూడీ సిర్వాయిని కలిశాడు నౌషాద్. అలా వారిద్దరి మధ్య పరిచయం బలపడింది. ఆ తర్వాత మససుల్ని దోచుకునే పాటల పూతోటలో అకార్డియన్ కూడా తప్పనిసరి స్థానాన్ని దక్కించుకుంది.

ఆ తర్వాత లక్ష్మీకాంత్ ప్యారెలాల్, శంకర్ జైకిషన్, బప్పీలహరి.. ఇలా వీరంతా అకార్డియన్ లేందే సినిమా పాటలు చేయమన్నట్టుగా ఆ వాద్యంతో పెనవేసుకున్నారు. అంతెందుకు ఆస్కార్ విజేత ఏ. ఆర్. రెహమాన్ కూడా అకార్డియన్ అంటే మనసు పారేసుకుంటాడు. హాంగ్ కాంగ్ టూర్ కు వెళ్లిన రెహమాన్ ను ఓ మ్యూజికల్ షాపులో ఓ అకార్డియన్ ఆకట్టుకుంది. ఇంకేం వెంటనే దాన్ని కొనేశాడు రెహమాన్. గురు సినిమాలోని… మాయ్య మాయ్య క్లబ్ సాంగ్ లో… తేరేబిన తేరేబిన పాటలో రెహమాన్ అకార్డియన్ ఉపయోగించిన తీరు ఆకట్టుకుంటుంది. చాలా మంది సంగీత దర్శకులు అకార్డియన్ ను వాడిన తీరుకు భిన్నమైన రీతిలో.. ఏ.ఆర్. సినిమాల్లోని పాటల్లో అకార్డియన్ సౌండ్స్ వినిపిస్తుంటాయి.

చూసేందుకు అచ్చూ హార్మోనియంలా కనిపించే అకార్డియన్.. పాటల్లో నేపథ్యంగా ఇంటర్ నోట్స్ గా వాయించడానికే పరిమితం కాలేదు. సినిమాల్లో హీరోలో, లేక క్లబ్బుల్లో పాడేవారో దాన్ని పట్టుకుని పాండే డ్యాన్స్ మూమెంట్స్ కూడా బాలీవుడ్ లో ఓ ఐకానిక్ సింబల్ గా మారిపోయాయి.

మొట్టమొదటి అకార్డియన్ ప్లేయర్ గా బెంగళూర్ వాసి ఎంబీ ప్రకాష్ పేరు వినిపిస్తుంది. అలాగే, వి. బల్సారా, గూడీసిర్వాయి, కేర్సీ లార్డ్, సుమిత్ మిత్రా వంటివారెందరో బాలీవుడ్ సంగీతంలో అకార్డియన్ వాద్యానికి పెద్ద దిక్కయ్యారు. నౌషాద్, ఎస్డీ బర్మన్ నుంచి మొదలుకుంటే… ఆ తర్వాత ఆర్డీ బర్మన్ వరకూ అకార్డియన్ ప్లేయర్స్ కు ప్రత్యేక డిమాండ్ తో పాటు… ఆ వాద్యానికి ఒక ప్రత్యేక స్థానముండేది. ఇప్పుడేకంగా మహిళా విద్వాంసులు కూడా అకార్డియన్ లో రాణిస్తున్నారు. వాళ్లలో ప్రధానంగా హిందీ, బెంగాలీ పాటలకు తన వాద్య సహకారమందించే షానోలీ పేరూ చెప్పుకోవాల్సిందే. అలా మన బాలీవుడ్ తో పెనవేసుకున్న అకార్డియన్ అనే వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్ బంధం… ఆ తర్వాత టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చోట్లా దాని ప్రాధాన్యతను మరింత పెంచుకుంది.

ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించే కాకుండా… కొన్ని వాద్యాల పుట్టుక… హంటింగ్ గా వెంటాడే పాటల వెనుక వాటి సౌండ్స్ గురించి కూడా చెప్పుకోవాలి. అందుకే.. ఎప్పుడో 1822లో జర్మనీలో పురుడుబోసుకుని… ఇప్పటికీ ఫోక్ టూ వెస్ట్రన్ మ్యూజిక్ వరకూ అన్ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనను అలరిస్తున్న అకార్డియన్ గురించి కూడా కూసింత!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles