ఆయనే ఆ సినిమా ఎస్సెట్! కానీ, వారొప్పుకోకపోవడమే.. ఆయన్నా అవకాశం తలుపు తట్టింది!!

భారతీయ చలనచిత్ర సీమపై.. ఎప్పటికీ చెరగని సంతకం… షోలే!

విడుదలై రికార్డ్స్ సృష్టించి దశాబ్దాలు దాటుతున్నా… ఇప్పటికీ సినీ పరిశ్రమ గురించి చెప్పుకోవాలన్నా… ఒక సినిమా హిట్టంటే ఏ స్థాయి అని మాట్లాడుకోవాలన్నా.. ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా.

ముంబై మరాఠామందిర్ లో వరుసగా ఏడేళ్లపాటు నడిచిన సినిమా.

అలా సినిమా ఎంత గొప్ప టాక్ సాధించిందో.. అందులో యాక్షన్ సీన్స్.. పాటలు, వాటి చిత్రీకరణతో పాటు.. స్టార్ క్యాస్ట్ కూ అంతే పేరొచ్చింది.

అయితే, అందరు నటులూ ఒకరిని మించి మరొకరు నటించిన షోలే సినిమాలో.. మొత్తం సినిమాకే ఎస్సెట్ గా నిల్చిన ఒకే ఒక్క నటుడి పేరు చెప్పండంటే మాత్రం.. గబ్బర్ సింగ్ పాత్ర పోషించిన అమ్జాద్ ఖాన్ పేరే మొదట వినిపిస్తుంది.

కిత్ నే ఆద్మీ తి… ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ పాత్రలోని అమ్జాద్ ఖాన్ నోట… ఒక ఊపు ఊపింది. షోలే సినిమాకు ఒక ప్రత్యేక అభిమానగణాన్ని సృష్టించింది. జస్ట్ గబ్బర్ సింగ్ పాత్ర కోసమే సినిమా చూసేలా ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ మళ్లీ రప్పించి.. అంతకుముందు ఇంకే సినిమా ఆడని రీతిలో ఏళ్లకేళ్లు ఆడేలా చేసింది. మొత్తంగా అమ్జాద్ ఖాన్ నవ్వు… కిత్నే ఆద్మీ తి డైలాగ్ సినీ అభిమానుల గుండెల్లో, మెదళ్లలో ఒక చెరగని ముద్ర వేసింది.

ఆ ఒక్క సినిమా అమ్జాద్ ఖాన్ సినీ కెరీర్ నే మలుపు తిప్పగా… ఆయన ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. అమ్జాద్ ఖాన్ అంటే గబ్బర్ సింగ్ గానే గుర్తున్నాడంటే.. షోలేలో తన పాత్ర ఎంత శక్తివంతమో మనందరం చూసిందే.

అయితే, అమ్జాద్ ఖాన్ కు ఆ పాత్ర మరో ఇద్దరు కాదంటే వచ్చిందనే విషయం మీకు తెలుసా..?

ఎవరు వారు… ఎందుకు రిజెక్ట్ చేశారు..?

1975లో విడుదలైన షోల్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రగా పేరొందిన గబ్బర్ సింగ్ క్యారెక్టర్ కు ముందుగా డ్యానీ డెంజోగ్పా, రంజిత్ సంభావ్యను సంప్రదించారు. అదే అవకాశం డ్యానీకి కూడా వచ్చినట్టు… తమ ఇద్దరినీ దర్శక, నిర్మాతలు సంప్రదించినట్టు తెలుసుకున్న రంజిత్.. డ్యానీతో ఉన్న స్నేహంతో ఆ ఆఫర్ ను తానే రిజెక్ట్ చేసినట్టు ANIకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

వాళ్ళు తన దగ్గరకు వచ్చి… డ్యానీ ఇప్పుడు రాలేడని చెప్పారన్నాడు రంజిత్. నిజానికి ఆ పాత్ర గురించి కూడా తనకు అవగాహన లేదన్నతను.. డానీ తనకు మంచి స్నేహితుడని… అతన్నుంచి తనకు నో ఆబ్జెక్షన్ లెటర్ ఒకటి తీసుకొచ్చినా.. లేదా, కనీసం తనతో మాట్లాడించినా.. అప్పుడు డ్యానీ అంగీకరిస్తే.. తాను సినిమా చేస్తానన్నాడట రంజిత్. కానీ, డ్యానీ ఎందుకు రాలేదో తనకు తెలిసిందని.. అందుకే, తాను కూడా షోలేలో గబ్బర్ పాత్రను వదిలేసినట్టు రంజిత్ ఆమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

బహుశా విధి అంటే అదేనేమో…? తానుగానీ, డ్యానీగానీ గబ్బర్ సింగ్ పాత్ర చేసుంటే… అంత పేరు వచ్చి ఉండేది కాదేమోనన్న అభిప్రాయాన్ని కూడా కుండబద్ధలు కొట్టాడు రంజిత్. ఆ పాత్రకు అమ్జాద్ ఖాన్ వందశాతం న్యాయం చేశాడని.. ఆ పాత్ర ఉద్ధేశించబడిందే అమ్జాద్ ఖాన్ కోసమన్నట్టుగా.. ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందని… రంజితే గబ్బర్ సింగ్ పాత్ర గురించి చెప్పుకొచ్చాడు.

మొత్తంగా లెజెండరీ ఫిల్మ్ మేకర్ గా ఇండియన్ సినిమాపై ఒకే ఒక్క షోలే సినిమాతో… అందులో తీర్చిదిద్దిన పాత్రలతో దర్శకుడిగా రమేష్ సిప్పీ… బాలీవుడ్ టాప్ క్లాసిక్స్ లో ఒక్కటిగా, ఎవర్ గ్రీన్ సినిమాగా గుర్తింపు సాధించిపెట్టాడు. అయితే, అన్నింటికంటే సినిమా చూస్తున్నంతసేపూ.. తమల్ని భయపెట్టిన విలన్ గా.. ఆ తర్వాత విలనంటే అమ్జాద్ ఖాన్ అన్నట్టుగా ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న పాత్ర వెనుక ఇంత కథ జరిగిందనే విషయం తెలియడానికే ఈ కథ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles