అన్ని నదుల్లోకీ.. నర్మద ఎందుకు ప్రత్యేకం..?
హిమాలాయల నుంచి మొదలకుంటే మధ్య భారత పర్వత ప్రాంతాల్లో పుట్టి… మనదేశంలో ప్రవహించే ఏ నదైనా సముద్రంలోకి చేరే సమయంలో తూర్పు దిశగా ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ విషయాన్ని చిన్ననాటే భౌగోళిుక శాస్త్రంలోనూ నేర్చుకుంటాం. అందువల్ల, నదులు ఏ దిశగా ప్రవహిస్తాయనే అంశం పెద్దగా సందేహంలా అనిపించకపోవచ్చు. కానీ, ఈ సాధారణ నియమాన్ని బ్రేకే చేస్తోంది ఓ ప్రధాన నది. భారతదేశానికే హృదయం లాంటి మధ్యప్రదేశ్ లో పుట్టిన ఈ నది… తూర్పుకు వ్యతిరేక దిశలో పడమటకు ప్రవహించడమే విశేషం. ఇంతకీ ఎక్కడా అంటారా.. ? రండి తెలుసుకుందాం!

తన ప్రయాణంలో ఎన్నో భూభాగాలను తాకుతూ, ఎందరికో లైఫ్ లైన్ గా మారి, విశ్వాసాలకు చిరునామాగా… ఓ పొడవైన నదిగా, సాంస్కృతికంగా ప్రాధాన్యత సంతరించుకుని, భూగర్భశాస్త్రవేత్తలచే పలు అధ్యాయాలకు కూడా నోచుకున్న ఆ నదే నర్మద. ఇప్పటికీ ఈ నదీ తన వేగం వల్లో, పరిమాణం వల్లో కాకుండా… దాని ప్రవాహ తీరుతో అందరినీ ఆశ్చర్యపర్చేదే.
మిగిలిన నదుల్లా కాకుండా నర్మదా వెనక్కి ఎందుకు ప్రవహిస్తుంది..?
అన్ని నదులు తూర్పుకు ప్రవహిస్తే.. మరి నర్మదా మాత్రమే అందుకు వ్యతిరేక దిశలో పడమటికెందుకు ప్రవహిస్తోంది. 1 వెయ్యి 310 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అతి పెద్ద నదుల్లో ఐదో పెద్ద నది నర్మద. గంగా, గోదావరి నదుల మాదిరిగా ఇది బంగాళాఖాతంలో కలవదు. ఇది పుట్టిన చోటు నుంచి పశ్చిమదిశగా ప్రయాణించి.. అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి పద్ధతిలో ప్రవహించే నదులు భారతదేశంలో వేళ్లపైన లెక్కించొచ్చు. తాపీ, మహీ, సబర్మతి, బ్రహ్మపుత్ర వంటి నదులు కూడా ఇలాంటి స్వరూపాన్నే కల్గి ఉన్నాయి. నర్మద చుట్టూ ఉన్న ఇతర నదులు తూర్పు దిశగా ప్రవహించడం వల్లే.. నర్మద వెనక్కి ప్రవహిస్తోందనే భావనా ఒకటుంది.
నర్మదా నది పుట్టుక..?
నర్మదా నది మధ్యప్రదేశ్ లోని అమరకంటకంలో పుట్టింది. ఈ ప్రాంతమంతా పెద్ద అరణ్యమే కాకుండా.. పుణ్యక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచే నది పశ్చిమ దిశగా ప్రవహించడం ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ గుండా ప్రయాణించి.. కొద్ది దూరం తర్వాత మహారాష్ట్రనూ తాకుతూ… ఆ తర్వాత గుజరాత్ లోకి ప్రవేశిస్తుంది. చివరకు భరూచ్ సమీపంలోని అరేబియా సముద్రంలో కలుస్తుంది. ప్రయాణంలో నది స్వరూపం మారుతూ ఉంటుంది. కొన్ని చోట్ల కొండలు, ఇరుకైన లోయల మధ్య వేగంగా ప్రవహిస్తూ ప్రకృతిసిద్ధంగా ఆకట్టుకుంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించి నెమ్మదిగా కనిపిస్తుంది.
నర్మద పశ్చిమ దిశగా ప్రవహించేందుకు కారణమేంటి..?
నర్మదా నది పడమటి దిశకు ప్రవహించేందుకు ప్రధాన కారణం.. భూగర్భ శాస్త్రం. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతమంతా భూకంపాలకు లోను కావడం వల్ల.. భూమి ఉపరితలంలోని సమాంతరంగా ఉండే ప్రాంతం తూర్పు నుంచి పశ్చిమం వైపు వంగిపోవడంతో.. నర్మదా నదీ ప్రవాహం పశ్చిమం వైపు సాగుతున్నట్టుగా కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. సాధారణంగానే నీరు వాలు దిశను అనుసరిస్తూ పశ్చిమానికి ప్రవహిస్తుందన్నది అంచనా. ఈ నర్మదా నదీ పరీవాహక ప్రాంతానికి ఉత్తర దిశలో వింధ్య పర్వత శ్రేణులు, దక్షిణాన సత్పుర పర్వత శ్రేణులున్నాయి. రిఫ్ట్ లోయగా పిలిచే ఈ ప్రాంతంలో వాలు దిశలో ప్రవహించడం వల్లే నర్మద.. మిగిలిన అన్ని నదుల కంటే భిన్నంగా ప్రవహిస్తోంది. పెద్ద పెద్ద డెల్టా ప్రాంతాలు ఈ నదీలోయలో కనిపించవు.
నర్మద ప్రవహించే భూభాగాలు!
నర్మదా నదీ పరీవాహక ప్రాంతం భిన్న భూభాగాలను కల్గి ఉంది. కొండలు, ఎత్తుపల్లాలు, అరణ్యాలతో కనిపిస్తుంది. జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతంలోనూ నదీ ప్రవాహం ఎక్కువే. పశ్చిమానికి వెళ్లేకొద్దీ.. విస్తృతంగా మారుతుంది. ఇక్కడి మైదానాలు సారవంతమై.. వ్యవసాయానికి ప్రధానంగా ఆధారంగా నర్మదా వరదాయినిగా నిలుస్తోంది. గోధుమలు, పప్పుధాన్యాలు, పత్తి వంటి పంటలకు ఈ నదీ పరీవాహక ప్రాంతం కేరాఫ్. తాగునీటి అవసరాలకూ ఈ నది కీలకం. కాలక్రమంలో ఈ నది నీటిని కాలువలు, జలాశయాల ద్వారా మరింత విస్తృతంగా పట్టణాల ప్రాంతాలకు కూడా పంపిణీ చేస్తున్నారు. నర్మద ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలకు రోజూవారీ అవసరాల్లోనూ ఈ నదే కీలకం.
నర్మదపై ఉన్న డ్యాములు, ప్రాజెక్టులు!
నర్మదా నదిపై అనేక పెద్ద ఆనకట్టలు నిర్మించారు. గుజరాత్‌లో సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రసిద్ధి చెందింది. మధ్యప్రదేశ్‌లో ఇందిరా సాగర్ డ్యామ్, ఓంకారేశ్వర్ డ్యామ్ వంటి ఇతర పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇవి విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా, వ్యవసాయం, గృహ అవసరాల కోసం కూడా నీటిని సరఫరా చేస్తాయి. అయితే ఇవి నది సహజ ప్రవాహాన్ని మార్చాయి. భూముల ముంపు, ప్రజల పునరావాసం, పర్యావరణ ప్రభావాలపై ఈ ప్రాజెక్టులు గతంలో ఎన్నో చర్చలకు కారణమయ్యాయి. ఆ చర్చలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
నర్మదా వెంట కనిపించే సహజ ప్రదేశాలు!
నర్మదా నది తీరం సహజసిద్ధ ఆకర్షణతో ఆకట్టుకుంటుంది. జబల్‌పూర్ సమీపంలో ఇది మార్బుల్ రాక్స్‌గా పిలవబడే ఎత్తైన పాలరాయి కొండల మధ్యగా ప్రవహిస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే ధువాంధర్ జలపాతం చూడదగ్గది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ కొండల నుంచి నీరు భారీగా కిందకు జాలువారే నీరు దట్టమైన ఆవిరిని సృష్టిస్తుంది. ఈ ప్రాంతాలకు పర్యాటకంగా ఇంకా అంత విస్తృతి ఏర్పడకపోయినా.. వెళ్లినవారిని కొత్త అనుభూతికి లోను చేస్తూ, లోతైన ముద్ర వేస్తాయి. ఇక్కడ ప్రవహించే నీటి శబ్దం దూరం వరకూ వినిపిస్తుంది.
నర్మద అంటే విశ్వాసం!
చాలామందికి నర్మద కేవలం ఒక నది కాదు. మహేశ్వర్, ఓంకారేశ్వర్, అమరకంటకంలో ఉన్న ఆలయాలు ఏడాది పొడవునా యాత్రీకులతో కిటకిటలాడుతాయి. కొంతమంది నర్మదా పరిక్రమ అనే దీర్ఘ యాత్రను నది ఒడ్డు వెంట చేస్తారు. ఈ నదిని జీవంతో ఉన్న శక్తిలా కొలుస్తారు. ఈ నది దారి పొడవునా విశ్వాసం, ఎందరో నివాసం, రోజువారీ జీవితం, నదిని కేంద్రంగా చేసుకుని జరిగే వ్యాపారం, కనిపించే ఆధ్యాత్మికత ఇవన్నీ.. ఈ నది విస్తరించిన నాగరికతకు ప్రతీకలు.



