మద్దతు ప్రకటించిన యావత్ భారతానికీ.. సర్కారే జవాబుదారీ!

Paresh Turlapati… ✍🏼

అమెరికాది ముందునుంచీ అహంకార పూరిత ధోరణే

పెద్దన్న పాత్రలో ఒక పక్షం వైపే పక్షపాతం చూపించే పెదరాయుడే

అ_మెరికా మోసపూరిత విధానాలను గమనించాలంటే ఓసారి గతంలోకి వెళ్లాలి


“పాకిస్తాన్ వ్యవహారాల్లో ఇండియా జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోం.. తగిన బుద్ధి చెపుతాం”

ఈ మాటలు అన్నది అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్

1971 లో ఇండియా.. పాకిస్తాన్ వార్ సమయంలో నిక్సన్ పాకిస్తాన్ తరపున పెద్దన్న పాత్ర తీసుకుని నాటి ప్రధాని ఇందిరా గాంధీ తో వైట్ హౌస్ లో చేసిన హెచ్చరిక అది

ఇందిర సమాధానం కోసం తడుముకోలేదు
వెంటనే ధీటైన జవాబు ఇచ్చింది

“మిస్టర్ ప్రెసిడెంట్.. మిమ్మల్ని మా మిత్ర దేశం గానే భావిస్తాం కానీ యజమానిగా భావించలేం.. భారత దేశ భద్రత కు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మాకు తెలుసు ” అంటూ ఖరాఖండిగా చెప్పేసి వైట్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది

దాంతో నిక్సన్ షాక్స్
ఇందిర రాక్స్

బయట అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ఇందిర దగ్గరకొచ్చి ” మేడం! మీరు మా ప్రెసిడెంట్ తో అంత కటువుగా సమాధానం చెప్పడం నచ్చలేదు.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయ్.. మరోసారి ఆలోచించుకోండి ” హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు

” మేము ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గేది లేదు..మా దేశ సార్వభౌమత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరు ” అని ధీటుగా సమాధానం చెప్పి ఇండియా వచ్చేసింది

ఇండియా రావడం ఆలస్యం ఇందిర అప్పటి ప్రతిపక్ష నాయకుడు వాజ్ పేయి ను తనవద్దకు పిలిపించుకుని చర్చలు జరిపింది

ఫలితం

ఐక్యరాజ్య సమితిలో భారత దేశం తరపున వాదనలు వినిపించటానికి వాజ్ పేయి హుటాహుటిన అమెరికా వెళ్ళారు

ఇది అమెరికా ఊహించని పరిణామం

విమానాశ్రయంలో అమెరికా విలేఖరులు వాజ్ పేయి ను చుట్టుముట్టి ” మిస్టర్ వాజ్ పేయి.. ఇండియాలో రాజకీయంగా మీ బద్ద శత్రువు తరపున మీరు ఎలా వకాల్తా పుచ్చుకుంటారు.. ఇది మీకు అవమానం కాదా? అని ఆశ్చర్యం గా ప్రశ్నిస్తే,

వాజ్ పేయి చిరునవ్వుతో ” డియర్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్.. ఇండియాలో ఇందిర నాకు రాజకీయంగా శత్రువు కావొచ్చు. సిద్ధాంత పరంగా మాకు విభేదాలు ఉండొచ్చు.. కానీ దేశం వరకు వచ్చేసరికి మేమంతా ఒక్కటే.. మూడో వ్యక్తి ని మా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొనివ్వం ” అని చెప్పారు

దాంతో అమెరికా మీడియా షాక్స్
వాజ్ పేయి రాక్స్

దరిమిలా అమెరికా పాకిస్తాన్ కు మద్దతుగా ఇండియాకి వ్యతిరేకంగా యు_ద్ద నౌకలను పంపింది

ఇండియా ధీటుగా ఎదుర్కొని వాటిని తిప్పి కొట్టింది

ఒకవైపు పాకిస్తాన్ తో యుద్ధం
మరోవైపు పాకిస్తాన్ కు అమెరికా మద్దతు

రెంటినీ ధీటుగా ఎదుర్కొని పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటును ను ప్రకటించింది ఇందిర

ఆ సందర్భంగా వాజ్ పేయి ఇందిరను దుర్గా మాతగా అభివర్ణించారు


గత మూడేళ్లుగా రష్యా.. ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యు_ద్ధం గురించి అందరికీ తెలిసిందే

ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఎన్నికైన తర్వాత మళ్ళీ అదే అహంకారంతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కి ని వైట్ హౌస్ లో అటెండెన్స్ వేసుకోవాలని పిలిచారు

చాలా సాదా సీదా ప్యాంట్ టీ షర్ట్ తో జెలెన్ స్కి వైట్ హౌస్ లో అమెరికన్ ప్రెసిడెంట్ ను కలిశారు

అ_మెరికాకి అహంకారం ఎక్కవ కదా

“మా ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు సూటు బూటు వేసుకుని రావాలని తెలీదా? “అని వెటకారంగా అడిగారు అక్కడి మీడియా వాళ్ళు

“టైట్ సూట్లు వేసుకుని మీరెంత బిగుసుకుపోతున్నారో చూస్తుంటేనే తెలుస్తుంది.. అయినా మీ కోరిక ఎందుకు కాదనాలి? రష్యా తో వార్ గెలిచాక మీకన్నా మంచి క్వాలిటీ సూట్ వేసుకుని వస్తా ” అని ధీటుగా సమాధానం చెప్పాడు జెలెన్

వాటే గట్స్

ఒక చిన్న దేశ అధ్యక్షుడు అగ్ర రాజ్యం అధినేత ఎదురుగా కాలు మీద కాలేసుకుని సమాధానం చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి?

యు_ద్ధం ఆపమన్నాడు ట్రంప్
కుదరదని బయటకు వచ్చేశాడు జెలెన్

ఇక్కడ నాకు దళపతి సినిమాలో ఓ సన్నివేశం గుర్తుకొచ్చింది

కలెక్టర్ అరవింద్ మమ్ముట్టి ని.. రజనీకాంత్ ను తన ఆఫీసుకు పిలిపించి ” తక్షణం అన్నీ ఆపేయండి” అని వార్నింగ్ ఇస్తాడు

ఒక్క క్షణం అరవింద్ వంక చూసి మమ్ముట్టి ఒకే ఒక డైలాగ్ చెప్తాడు

” కుదరదు”

ఆ డైలాగ్ తో థియేటర్లో ఈలలు మోత మోగిపోయాయి

నాకు జెలెన్ స్కి లో ఆ క్షణాన మమ్ముట్టి కనిపించాడు
యుద్ధం చేసేవాడికి ధైర్యం. తెగువ కూడా అవసరమే


నిన్న రాత్రి సడెన్గా ట్రం_ప్ ట్వీట్ చూసా
మళ్ళీ అదే అహంకారం

“రాత్రంతా నా మధ్యవర్తిత్వంతో ఇండియా.. పాకిస్తాన్ లు కాల్పుల విరమణ కు అంగీకరించాయి.. కొంచెం కామన్ సెన్స్ తెలివి తేటలు వాడినందుకు ఇరువురికీ నా అభినందనలు ” అని ట్వీట్ వదిలాడు

ఈ ట్వీట్ చూసిన ఎవరికైనా ట్రంప్ ఒళ్ళు బలుపు ఇట్టే అర్థమైపోతుంది

“ఇండియా పాకిస్తాన్ ల మధ్య కాల్పులు సిగ్గు చేటు”
ఆపరేషన్ సిందూర్ ప్రారంభం అయిన తర్వాత ఇదీ ఆయన గత ట్వీట్

ఇందులో ఎక్కడా పాక్ ఉగ్రవాద దాడుల ప్రస్తావన లేదు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయితే ఏకంగా ఈ విషయంలో మేము జోక్యం చేసుకోం అని తెగేసి చెప్పేశాడు

దాదాపు ఓడిపోయే పరిస్థితికి చేరుకున్న పా_కిస్తాన్ తన చీకటి మిత్రుడిని గోకింది

అహంకారంలో పెద్దన్న అయిన అగ్ర రాజ్యం వెంటనే స్పందించింది

భారత ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయకమునుపే కా_ల్పుల విరమణ నిర్ణయాన్ని ట్రంప్ ట్వీటారు

ఆపరేషన్ సిందూర్ ప్రారంభంలో పాకిస్తాన్ తో చర్చలు జరిపే ప్రసక్తి లేదన్న ఇండియా సడెన్గా చర్చలకు ఒప్పుకోవడం సగటు భారతీయుడు జీర్ణించుకోలేక పోయాడు

కనీసం అజార్ లాంటి ఉగ్రవాదిని తమకు అప్పగిస్తేనే చర్చలకు వస్తామని కండిషన్ పెట్టుంటే కొంత బాగుండేది

యుద్ధం కన్నా చర్చలే మేలు అని ఆపరేషన్ సిందూర్ ప్రారంభంలోనే నేను పోస్ట్ పెట్టా

కానీ అప్పుడు చాలామంది యు_ద్ధమే సరైన నిర్ణయం అన్నారు

ఇప్పుడు అదే వ్యక్తులు కా_ల్పుల విరమణ నిర్ణయమే సరైనది అంటున్నారు

కానీ ఒకసారి మన ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ నిర్ణయం తీసుకున్న తర్వాత భారతీయుడిగా ఆ నిర్ణయానికి మనః స్ఫూర్తిగా మద్దతు ఇచ్చా

అలాంటిది ఇప్పుడు బోలెడంత ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం జరిగిన తర్వాత మూడో వ్యక్తి ప్రమేయంతో కాల్పుల విరమణ నిర్ణయం ప్రకటించడం బాధాకరం

ఈ విషయంలో దేశ ప్రజల సందేహాలు తీర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

ముఖ్యంగా నా దేశంలో అంగుళం భూమి వైపు కూడా మిమ్మల్ని రానివ్వను అంటూ పాకిస్తాన్ తుపాకీ గు_ళ్ళకు ఎదురొడ్డి పోరాడి అమరుడైన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికైనా సంజాయిషీ చెప్పాల్సిన అవసరం ఉంది

జైహింద్ 🙏

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles