డ్రోన్ టెక్నాలజీపై భారత్ ఫోకస్: ఓవైపు సవాళ్లనెదుర్కొంటూనే.. స్వావలంబన!

డ్రోన్స్ వినియోగం ఇప్పుడు సమకాలీన యుద్ధరంగంలో ఓ విప్లవాత్మకమైన మార్పు. లక్ష్యానికనుగుణంగా కచ్చితమైన దాడులు నిర్వహిస్తూ, డ్రోన్స్ ద్వారా మందుగుండును ప్రయోగించే ఏర్పాట్లను అన్ని అభివృద్ధి చెందిన దేశాలూ ఇప్పటికే సమకూర్చుకుంటున్నాయి. మానవ రహిత వైమానిక వాహనాల ద్వారా నిఘా వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నాయి. కేవలం ముందుగా నిర్దేశించే లక్ష్యాలను మాత్రమే ఛేదించే క్షిపణులకు భిన్నంగా.. ఈ విధ్వంసక డ్రోన్స్ పనిచేస్తాయి. శత్రువును ఛేదించడంలో మారుతున్న లక్ష్యాలకనుగుణంగా టార్గెట్స్ ను ఢీకొట్టేలా ఈ డ్రోన్స్ కదలికలికలను నిర్దేశించగల్గే అవకాశముండటం వీటివల్ల అదనపు లాభం. అలాంటి డ్రోన్స్ ను సమకూర్చుకోవడంపై ఇప్పుడు ఇండియా స్పెషల్ ఫోకస్ పెట్టింది.

అలాంటివే కామికేజ్ డ్రోన్స్. ఒక పది మిలియన్ డాలర్ల అత్యాధునిక యుద్ధతంత్రాన్ని కూడా.. కేవలం 500 డాలర్లకే అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు ఓ 43 వేల రూపాయలకే లభించే అత్యంత శక్తివంతమైన కామికేజ్ డ్రోన్స్ నిలువరించి, విధ్వంసం సృష్టించగల్గుతాయి. అలాంటి డ్రోన్స్ ఇప్పుడు భారత్ అమ్ములపొదిలోకొచ్చాయి.

కామికేజ్ డ్రోన్స్ వర్సెస్ ట్రెడిషనల్ ఆర్మర్స్!

చాలా తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల్గే డ్రోన్స్.. అత్యంత భారీ వ్యయంతో సమకూర్చుకునే సైనిక సామాగ్రికంటే ఎలా, ఎంత బెటర్ అనేది ఈమధ్య జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ వార్ లో కళ్లకు కట్టింది. రష్యా కేవలం 500 డాలర్స్ తో సమకూర్చుకున్న అత్యాధునిక ఘౌల్ డ్రోన్స్ తో… ఉక్రెయిన్ యుద్ధతంత్రాల్ని పూర్తిగా నిలువరించింది. ఉక్రెయిన్ కు సపోర్ట్ చేసిన యూఎస్ నిర్మిత పది మిలియన్ డాలర్ల విలువ చేసే అత్యాధునిక అబ్రమ్ ట్యాంక్స్ ను ఘౌల్ డ్రోన్స్ విజయవంతంగా ఎదుర్కొన్న తీరు ఇవాళ్టి యుద్ధతంత్రంలో క్వాడ్ క్యాప్టర్స్ ప్రాధాన్యత తెలియజెప్పేది. రక్షణరంగంలో ఇలాంటి టెక్నాలజీ వినియోగం వల్ల.. ఖర్చు తగ్గి ఆర్థికంగా కూడా గణనీయమైన మార్పు కనిపించబోతోంది.

భారత్ లోని దక్షిణ ఆర్మీ కమాండర్ జనరల్ ధీరజ్ సేథీ ఏమంటారంటే… కేవలం 500 డాలర్ల విలువ చేసే డ్రోన్… పది మిలియన్ డాలర్స్ విలువ చేసే ట్యాంకును నాశనం చేయగల్గే సామర్థ్యాన్ని కల్గి ఉండటమంటే యుద్ధరంగంలో ఖర్చు తగ్గినట్టేగా అంటారాయన. అయితే, శత్రువును ఎదుర్కొనే విషయంలో ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ నడుస్తోంది. ఈ క్రమంలో డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ తో పాటు, కౌంటర్ డ్రోన్స్ వ్యవస్థల తక్షణ అవసరమెంతో ఉందన్నారు ధీరజ్ సేధీ.

డ్రోన్ యుద్ధతంత్రాల్లో భారత వ్యూహాలు..?

రక్షణరంగంపై భారత్ మరింతగా ఫోకస్ చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని టెక్నాలజీకి అనుగుణంగా.. ఎప్పటికప్పుడు మారుతున్న డైనమిక్స్ ను దృష్టిలో పెట్టుకుని స్వదేశీ డ్రోన్స్ నిర్మాణ సామర్థ్యాలను పెంచుకునేందుకు అడుగులు బలంగా వేస్తోంది.

ఆ క్రమంలో మనం కొన్ని డ్రోన్స్ గురించి చెప్పుకోవచ్చు.

స్కై స్ట్రైకర్ డ్రోన్: ఇప్పటికే భారత్ వద్దనున్న ఈ డ్రోన్ 500 కిలోమీటర్ల పరిధిలోని శత్రువుల వాయు రక్షణ మిషన్స్ ను అణిచివేయడానికి ఆప్టిమైజ్ చేయబడి రెడీ ఉన్నాయి.

అలాంటి కోవలోదే నాగాస్త్రా-1 డ్రోన్. 2024లో భారత యుద్ధ విపణిలోకి వచ్చిన ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల పరిధిలో 1 కిలో వార్ హెడ్ తో అధిక ఎత్తున్న ప్రాంతాల్లో నిఘాకోసం పనిచేస్తోంది. ముఖ్యంగా ఇండియా-చైనా బార్డర్ లో ఈ డ్రోన్ ను భారత్ వినియోగిస్తోంది.

ఈ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిలో ఇప్పుడు ప్రైవేట్ రంగం పాత్రే కీలకంగా మారింది. Zmotion అటానమస్ సిస్టమ్స్ వంటి కంపెనీలు లడఖ్ వంటి సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో తమ డ్రోన్స్ ను ప్రయోగించి విజయవంతమయ్యాయి. బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఖర్చుతో పోలిస్తే 40 శాతం రక్షణరంగానికి బడ్జెట్ ఈ డ్రోన్లను సొంతంగా తయారు చేసుకోవడం వల్ల ఆదా అవుతోంది. తాజాగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ALS-50 డ్రోన్ ను పూర్తిగా నిలువుగా టేకాఫ్ అయి మళ్లీ అదే పద్ధతిలో వెర్టికల్ గా ల్యాండింగ్ అయ్యే ట్రయల్సునూ విజయవంతంగా పూర్తి చేసింది. ఇవన్నీ డ్రోన్ సాంకేతికతలో ప్రైవేట్ రంగం పాత్రను కళ్లకు కట్టేవి.

ఫ్యూచర్ వార్ ఫేర్ అంతా ఏఐ ఇంటిగ్రేషనే!

అత్యాధునిక సాంకేతిక రోజుల్లో నిన్న ఉన్నది నేడు ఉండకపోవచ్చు. కాబట్టి, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై దృష్టి సారించాయి. అదే కోవలో భారత్ కూడా తన రక్షణ వ్యూహాల్లో భాగంగా స్వార్మ్ వార్ ఫేర్, ఆర్ఠిఫిషియల్ ఇంటలిజెన్స్ తో నడిపించగల్గే యుద్ధరీతులపై దృష్టి సారించింది.

స్వార్మ్ సామర్థ్యాలేంటి..?

2021లో భారత సైన్యం 50 కిలోమీటర్ల పరిధిలో ఒక సమన్వయంతో 75 డ్రోన్ స్వార్మ్స్ ను ప్రదర్శించింది. కానీ, 2023కు వచ్చేసరికి ఒక వంద డ్రోన్ స్వార్మ్స్ ను ఏకకాలంతో సమన్వయంతో ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎప్పటికప్పుడు మారిపోతున్న యుద్ధరీతులను, అప్డేషన్ ను గుర్తు చేసే ఓ ప్రక్రియ. ఈ ప్రక్రియలో చైనా ఇప్పటికే అడ్వాన్స్డ్ గా ఉంది. రాడార్ ను కన్ఫ్యూజ్ చేస్తూ బిగ్గర్ సైజ్ లో ఆబ్జెక్ట్ కనిపిస్తూ శత్రు లక్ష్యాలను ఛేదించడంలో ఈ గుంపులుగుంపులుగా వెళ్లే స్వార్మ్ డ్రోన్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఏఐ డ్రోన్స్:

ఇవి శత్రువుల ఆస్తులను సెన్సార్స్ సాయంతో గుర్తించి ధ్వంసం చేసేలా ఈ డ్రోన్స్ తయారీపై భారత్ ఫోకస్ చేసింది. ఇప్పటికే విస్తృతంగా ఈ పరిశోధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ లో 150 కిలోల బరువున్న సంచార డ్రోన్స్ తయారీ కూడా రూపకల్పన జరుగుతోంది. 900 కిలోమీటర్ల దూరంలో కనీసం 6 నుంచి ఎక్కువలో ఎక్కువ 9 గంటల సమయం ఓర్పుగా ఛేదించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సంచరించే ఆయుధ సామాగ్రి తయారీపై పరిశోధనలు సాగుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఇండియన్ మిలట్రీ ఆపరేషన్స్ లో కీలకపాత్ర పోషించే అవకాశముంది.

రక్షణరంగానికి సవాళ్లుగా ఆర్థిక చిక్కులు, స్వావలంబన సాధన!

రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు అతి తక్కువ ఖర్చుతో డ్రోన్స్ తయారీలో రాటుదేలిపోతుంటే… భారత్ మాత్రం ఇంకా సవాళ్లను ఎదుర్కుంటూనే ఉండటం విచారకరం. భారత రక్షణ పరిశ్రమ పోటీ తత్వాన్ని పెంచి, ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు భారత్ 65 శాతం రక్షణ రంగ పరికరాలను సొంతంగా తయారు చేసుకునే స్వావలంబన సాధించింది. గతంలో ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డ స్టేజ్ నుంచి ఇప్పుడు సాధించిన మార్పు కచ్చితంగా అభినందించతగ్గదే. 2024-25 మన భారత దేశ రక్షణ రంగ ఉత్పత్తులు ఏకంగా 1 కోటి 27 లక్షల స్థాయికి చేరుకున్నాయి. ఇది గత దశాబ్దకాలంలోనే 174 శాతం పెరుగుదలగా ఏకంగా రక్షణశాఖే నివేదికనిచ్చింది. ఇది రక్షణరంగంలో భారత్ సాధిస్తున్న స్వావలంబనకు నిదర్శనంగా కూడా పేర్కొంటున్నారు రక్షణరంగ విశ్లేషకులు.

భారత్ రక్షణరంగం ఆయుధాల తయారీపై సీరియస్ గా ఫోకస్ చేస్తోంది, సమకూర్చుకుంటోందనేందుకు.. కామికేజ్ డ్రోన్స్ తో పాటు, నేటి ఆధునిక యుద్ధవ్యూహంలో పరిణామాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలను శత్రుదేశాలకు అందిస్తోంది. డ్రోన్ టెక్నాలజీ దిగుమతులను వద్దనుకుని.. ఏకంగా తయారీపైనే దృష్టి సారించడం కూడా కచ్చితంగా మరో ముందడుగు. ఈ క్రమంలో ఏఐ ఇంటిగ్రేషన్, డ్రోన్ స్వార్మ్ టెక్నాలజీ, కామికేజ్ డ్రోన్స్ పై పెట్టుబడులు పెట్టడం భారత రక్షణరంగానికి మరింత బలం చేకూర్చేది. భవిష్యత్ పోరాట పరిస్థితులకు సంసిద్ధం చేసేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles