కమల్ అతిని నియంత్రించడంలో.. మణి కృతకృత్యుడైనట్టే: థగ్ లైఫ్ పై ఓ పాజిటివ్ రివ్యూ!

Shankar G.. ✍🏼

ఎవరేమనుకున్నా సరే నాకు నచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి, సాలర్ లాంటి తలతిక్క సినిమాల కంటే బాగుంది. నిస్సందేహంగా కమల్ గొప్ప నటుడే కానీ, అంత గొప్ప నటుడి కి కూడా వేపకాయంత వెఱ్ఱి ఉన్నట్లు చేస్తున్నారు ఈమధ్యన కొన్ని సినిమాల్లో నటన.. ఆ అతిని నియంత్రించడంలో మణిరత్నం గారు కృతకృత్యులు అయినట్లే అనిపించింది.

3 దశాబ్దాల క్రితం వీరి జోడీలో వచ్చిన నాయకుడు సినిమా గుర్తుండే ఉంటుంది.. ఆ సినిమాలో తనవల్ల అనాధని అయిన టిను ఆనంద్ ని చేరదీస్తే, ఇక్కడ శింబు అంతే, అదనంగా అతగాడికి ఒక చెల్లెలు అంతే.. నాయకుడు స్థాయిలో కమల్ పాత్ర ఉన్నతంగా ఉండదు, కానీ మాఫియా, గ్యాంగ్ లలో ఉండే ఈర్ష్య, అసూయ సొంత తమ్ముడి ఎదుగుదల తట్టుకోలేక అతన్ని చంపేయాలి అనుకునే అన్న.. ఇలా చాలా విభిన్నమైన పాత్రలు రూపొందించారు మణిరత్నం..

సాధారణంగా ఈ రకమైన డాన్స్ వీరందరికీ వివాహేతర సంబంధాలు, ప్రియురాలు ఉంటారు, కానీ సమాజంలో ఈమధ్యన ఎక్కువ అవుతున్న షుగర్ డాడీ ట్రెండ్ ని త్రిష పాత్ర ద్వారా చూపించారు..ఎంత మణిరత్నం సినిమాలో అయినా సరే ఇటువంటి పాత్ర పోషించడం సాహసం అనే చెప్పాలి..

శింబు పాత్ర కూడా మనుషుల్లో తగ్గిపోతున్న నైతిక విలువల్ని కళ్ళకు కట్టింది.. తనని పెంచి పోషించిన కమల్ హత్య కు పూనుకోవడం, ఆ త్రిష ని చెరబట్టడం లాంటివి నిజమే కదా, ఇలాంటిదే మొన్న ఎక్కడో వార్తల్లో చూసాను అనిపించక మానవు..

నాజర్ కి బాహుబలి ద్వారా రాజమౌళి స్టాంప్ వేసేసారు.. ఇంక ఈ నటుడు వేసే ప్రతి పాత్ర అసూయ, ఈర్ష్య వీటితోనే ఉంటుంది..

అశోక్ సెల్వన్ పాత్ర ఓపెనింగ్ బాగుంటుంది కానీ,ఎడిటింగ్ లో లేపేసారేమో అనిపించింది..

మరొక ముఖ్యమైన పాత్ర ఐశ్వర్య లక్ష్మి, ఈమెకు చివరి 10 నిమిషాల్లో కొంచెం నటించే అవకాశం దక్కింది, దాదాపుగా అది కూడా విషాదాంతమే చేసారు..

చివరిగా కత్తి పట్టిన వాడు కత్తి దెబ్బకే పోతాడు అనే మూలసూత్రం వదలకుండానే, అమర్ (శింబు) పాత్రకి ఒక తరహా ముగింపు, రంగరాయ శక్తిరాజన్ (కమల్) పాత్రని మరొక రకంగా ముగించారు..

సినిమా నిడివి ఫర్వాలేదు కానీ, కథనం మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించింది.. పోరాటాలు కూడా సుదీర్ఘంగా సాగుతాయి, ముఖ్యంగా కమల్ మీద జరిగే హత్యా యత్నం, క్లైమాక్స్ పోరాటాలు చాలా సుదీర్ఘంగా అనిపిస్తాయి.. కానీ సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు, ముందే చెప్పుకున్నట్లు మణిరత్నం ఎక్కడా కమల్ గారి నటన ని కట్టు దాటనివ్వలేదు.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కూడా మణిరత్నం గారు తాను ఇంకా రేసు లో ఉన్నట్లు చెప్పినట్లు అనిపించింది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles