కరువైన కరచాలనం.. కొరవడిన క్రీడా స్ఫూర్తి!

Ramu Suravajjula…✍🏻

—————————————————————————

తూడ్త్ …కరచాలనం లేదు… క్రీడాస్ఫూర్తి లేదు…

S 4 D స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్
S 4 P స్పోర్ట్స్ ఫర్ పీస్
S 4 E స్పోర్ట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్

ఇదీ ఆటల పరమావధి, మాధుర్యం, మహిమ.
అంతేగానీ ఆటలో ప్రత్యర్థులను శాశ్వత శత్రువులుగా చూడడం అన్యాయం.
చాలా రోజుల తర్వాత టీవీ ముందు కూర్చుని
మొదటి బాల్ నుంచి చివరి బాల్ దాకా టీ20 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో తలపడిన ఇండియా – పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్ చూసా.

ఇండియా 61 పరుగుల తేడాతో గెలిచిన మజా లేకుండా పోయింది నాకు. నేను టీవీ లో చూసిన దాని ప్రకారం…ఇందుకు కారణాలు రెండు.
1) టాస్ దగ్గర రెండు దేశాల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు.
2) ఆట అయ్యాక రెండు జట్ల సభ్యులు సంప్రదాయం ప్రకారం కలుసుకోలేదు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు.

ఆసియా కప్ లో ఈ ధోరణి మొదలయ్యింది. పాక్ వాడి చేతుల మీదుగా కప్ తీసుకోకుండా వచ్చేశాం. అయిందేదో అయ్యింది. ఆ వైషమ్యం ఇంకా సాగిస్తే ఎట్లా? రెండు వైపులా ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లా చేస్తే అది… అత్యంత విచారకరం. చేయి కలపడం ఇష్టం లేకపోతే… వాళ్ళతో ఆడడమే తప్పు.

ఇండియాతో ఆడేది లేదని ప్రకటించి… మాట మార్చి పాకిస్ధాన్ ఆడింది కదా! మనవాళ్ళు చొరవచూపి హ్యాండ్స్ షేక్ చేస్తే పోయేది ఏమీ లేదు. నిర్ణయం…ఆటగాళ్లకు వదిలితే… స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ (క్రీడా స్పూర్తి) కి విరుద్ధమైన ఈ పిచ్చిపని చేయరు.

నా అనుమానం ప్రకారం… పెద్ద తలకాయల హస్తం ఈ చెత్త నిర్ణయం వెనుక ఉండి ఉంటుంది. ఈ మ్యాచ్ కోట్లాది మంది వీక్షించారు. ఇందులో పిల్లలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ధోరణి ద్వారా వాళ్ళకి మనం ఏమి సందేశం ఇచ్చినట్లు? దేశాల మధ్య విభేదాలను క్రీడా మైదానాలకు తేవడం తప్పే కాదు, ప్రమాదకరం కూడా.

బ్రిటిష్ వాడు దురాక్రమించుకుని మనను నాశనం చేశాడని బ్రిటన్ తో సంబంధాలు తెంచుకున్నామా?

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లతో ఆర్థిక నష్టం చేస్తున్నాడని అమెరికా నుంచి మనోళ్లని రమ్మన్నామా?

చైనా వాడు బోర్డర్ లో కంపు చేస్తున్నాడని ఆ దేశంతో తెగతెంపులు చేసుకున్నామా?

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తెరవెనుక డ్రామాలకి తావు లేకుండా… ఈ షేక్ హ్యాండ్ వివాదాన్ని పరిష్కరించకపోతే… రాంగ్ మెసేజ్ పోతుంది.

ఈ పోస్టుతో పాటు వాడిన ఫోటో చూడండి. ఇండియా, పాక్ కెప్టెన్ల మధ్య పెద్ద గొడవై
కొట్టుకుంటుంటే మధ్యలో అంపైర్ జోక్యం చేకుంటున్నట్లు ఉంది. మ్యాచ్ లైవ్ ఉందని చెప్పే ప్రకటన వాడు సృష్టించిన టెన్షన్ వాతావరణం ఇది. ఉభయ పక్షాల్లో కావలసింది ఉద్రిక్తతల స్థానంలో శాంతి, సమరస్యాలు.
This attitude completely defeats the purpose of sports and the beauty of sports.

sports #S4D #peace #indiancricket #indiancricketteam #pakistancricket #T20WorldCup2026

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles