డా. పుల్లూరి సంపత్ రావు
పిల్లల చదువు గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులు, టీచర్లు యావరేజ్,పూర్,డల్,గుడ్, ఎక్సెలెంట్ వంటి లేబుళ్లు,బ్రాండ్లు వేస్తుంటారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కూడా ఇలాంటి పదాలు,ర్యాంకులు రాయడం చాలా స్కూళ్ళలో చేస్తుంటారు.ఇవి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

చాలా సందర్భాలలో మా అమ్మాయి/అబ్బాయి గణితంలో పూర్ అని, ఇంగ్లీషులో పర్వాలేదు వంటి లేబుళ్లు వేస్తుంటారు. దైనందిన వ్యవహారాలలో కూడా తల్లిదండ్రులు నెగెటివ్ బ్రాండ్లు వేస్తుంటారు. పిల్లలు కూడా ఫలానా సబ్జెక్ట్ టఫ్ అని ఫలానా సబ్జెక్ట్ ఈజీ అని ఫిక్సుడ్ అభిప్రాయాలతో ఉంటారు. ఒక సబ్జెక్ట్ లో వెనుకబడటానికి సరైన కారణాలను వెతికి వాటిని పూరించ గలిగితే ఏ సబ్జెక్ట్ లోనైనా ప్రగతి సాధించవచ్చు. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు పిల్లలను ప్రోత్సహించాలి.
చాలా మంది విధ్యార్థులు అడిగితే ఎవరేమంకుంటారో అని బిడియంతో అడగరు. అడిగితే ఒక్కసారే ఫూల్ అవుతారు, అడగకపోతే జీవితాంతం ఫూల్ అవుతారనే విషయాన్ని చెప్పాలి.
పూర్, గుడ్ అనడానికి బదులు ఏ సబ్జెక్ట్ లో మరింత శ్రద్ద పెట్టాలో, ఏ సబ్జెక్ట్ లో బాగా ప్రయత్నించారో ఒకటి రెండు మాటలు రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు ఇంగ్లీషులో “ప్రశ్నలకు జవాబులు బాగా రాశావు. గ్రామరుపై దృష్టి పెట్టు” వంటి వాక్యాలు పిల్లలకు ఉపయోగపడవచ్చు. ఇలాగే ప్రతి సబ్జెక్ట్ లో లోటుపాట్లు వివరిస్తే మంచిది. ఈ పద్దతి వలన పిల్లలకు టీచర్లకు/తల్లిదండ్రులకు మధ్య మంచి సంభంధాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా విధ్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
నిజానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కరికులంతోపాటు కో కరికులర్, ఎక్స్ ట్రా కరికులర్ విషయాలలో కూడా పిల్లల ఆసక్తిని, ప్రగతిని చెబితే బాగుంటుంది. ప్రాథమిక ఆరోగ్య అంశాల గురుంచి కూడా అందులో చేర్చాలి.
శారీరక అంశాలను బట్టి పిల్లలను పిలవడం, లేబుళ్లు వేయడం, ఇతర పిల్లలతో పోల్చడం, నెగెటివ్ కామెంట్లు చెయ్యడం మొదలైనవి అన్నీ పిల్లలను కుంగుబాటుకు గురిచేస్తాయి. లోపాలను సరిచేస్తూనే ఎంకరేజింగ్ కామెంట్లు చెయ్యడం వలన మంచి ఫలితాలు వస్తాయి.
ఒక సారి లేబుల్ పడితే దాన్ని తొలగించడానికి చాలా శ్రమించాలి.



