చావు సమానమైన బతుక్కంటే.. చావే మేలనే మెస్సేజిచ్చింది! విగతజీవిగా ప్రత్యక్షమైంది!!

హిందువులపై రిపోర్టింగ్ చేసింది.. ప్రాణాలు విడిచింది

…………………………………………………………………………………………………………..

GANESH THOTA..✍🏼

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై మొదలైన అల్లర్లు.. హిందూ వ్యతిరేక హింసగా మారి.. వేలాదిమంది ప్రాణాలు తీస్తోంది. హిందూ ఆలయాల విధ్వంసం, హిందువుల ఇళ్లపై దాడులు, హిందూ మహిళలపై అత్యాచారాలు, హత్యలు.. ఇలా కొనసాగుతోన్న మారణకాండలో మరో ఘోరం వెలుగుచూసింది. ముస్లీం ఛాందసుల వల్ల హిందువులు ఎదుర్కొంటున్న బాధలు, కన్నీళ్లను కళ్లకు కట్టినట్లు చూపించిన ఓ ముస్లీం మహిళా జర్నలిస్టు అనూహ్యంగా ఓ సరస్సులో శవమై కనిపించింది.

బెంగాలీ భాషా గాజీ టెలివిజన్.. GTV లో న్యూస్ రూమ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సారా రహనుమా.. ఆగస్టు 28 న ఉదయం ఢాకాలోని హతిర్ జీల్ సరస్సులో అకస్మాత్తుగా శవమై కనిపించింది. ఈ ఘటన మీడియా వర్గాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేసింది. సరస్సులోని మొదటి వంతెన సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహ్మద్ సాగర్ అనే వ్యక్తి.. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని కనుగొన్నాడు. వెంటనే అతడు సమీపంలోని ఇతరులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత వారంతా కలిసి రహనుమా మృతదేహాన్ని వెలికితీసి ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

32 ఏళ్ల సారా రహనుమా మరణంపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే సాక్ష్యాలను గుర్తిస్తామని.. ఇన్స్పెక్టర్ మియా పేర్కొన్నారు. అయితే రహనుమా ఆగస్టు 27 రాత్రి సోషల్ మీడియా వేదికపై రెండు పోస్టులు చేసిన విషయాన్ని బయటపడింది. రాత్రి 10:24 గంటలకు ఆమె బెంగాలీలో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది అందులో.. చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే చనిపోవడం ఉత్తమం అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఫాహిమ్ ఫైసల్ అనే వ్యక్తికి మెస్సేజ్ చేసింది. “మీలాంటి స్నేహితుడు ఉండటం ఆనందంగా ఉంది. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మీరు త్వరలో మీ కలలన్నీ నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. మేమిద్దరం కలిసి చాలా ప్లాన్ చేసుకున్నామని నాకు తెలుసు. క్షమించండి, మా ప్రణాళికలను పూర్తి చేయలేము. మీ జీవితంలోని ప్రతి అంశంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.” అని రాసుకొచ్చింది. దీనికి అతను సమాధానం ఇస్తూ.. మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని.. నీకు హాని చేసుకోవద్దని తెలిపాడు.

సారా రహనుమా జర్నలిస్టు మాత్రమే కాదు. బంగ్లాదేశ్ మీడియాలో ప్రముఖ వ్యక్తి నోఖాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు.. భక్తియార్ షిక్దర్ కుమార్తె. ఆమెకు సయ్యద్ శుభ్ర అనే వ్యక్తితో వివాహం అయ్యింది. కొంతకాలం నుంచి భర్తతో విడిపోయిన ఉంటున్న ఆమె.. దేశంలో ప్రస్తుతం జరుగుతోన్న అల్లర్లు, హిందూ మైనార్టీల హింసపై నిర్భయంగా రిపోర్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో భావప్రకటనా స్వేచ్ఛపై ఇది మరో క్రూరమైన దాడిగా.. ఆమె మరణంపై మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles