కపిల్ కామెడీ షో పరిచయముండని వారెవరూ ఉండరేమో..? అలాగే, ఆ షోలో దాదీ పాత్రకూ అంతే ప్రాముఖ్యత ఉంది. కానీ, దాదీ పాత్ర వేయడానికి మాత్రం నటుడు అలీ అస్గర్ ముందు ఒప్పుకోలేదు. కపిల్ శర్మే పట్టుబట్టి ఒప్పించాడు. ఎందుకు అలీ అస్గర్ దాదీ పాత్రను తిరస్కరించాడు…? డైలీ సోప్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమై.. 40 కోట్ల రూపాయల ఆస్తిపరుడిగా ఓ బుల్లితెర నటుడు ఎలా ఎదిగాడు..
కపిల్ కామెడీ షోకు అభిమానులున్నట్టే.. అందులో దాదీ పాత్రధారి అలీ అస్గర్ కూ ప్రత్యేక అభిమానగణముంది. తన వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిగతం వరకూ మనీష్ పాల్ అనే ఓ డిజిటల్ జర్నలిస్ట్ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు అలీ అస్గర్.

అలీ అస్గర్ ది నాల్గు దశాబ్దాల నట జీవితం. ఇంకా ప్రేక్షకులను అలరిస్తూ అంతే క్రేజున్న నటుడిగా కొనసాగుతుండటం విశేషం. కామెడీ నైట్స్ విత్ కపిల్ లో దాదీ పాత్రతో మరింత విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు.
డైలీ సోప్స్ యాడ్ తో తెరపైకి!
కామెడీ పాత్రలతో పేరు తెచ్చుకున్ అలీ అస్గర్.. డైలీ సోప్స్ యాడ్ ద్వారా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కీ, కుటుంబ్ వంటి సీరియల్స్ లో భావోద్వేగ పాత్రలతో ప్రేక్షకులతో కనెక్టయ్యాడు. అలాంటి పాత్రలు చేయాలంటే నటనే కాదు.. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అవసరం. అదే అలీ అస్గర్ లో ఉన్న గొప్ప లక్షణం.
1980లో ఆరంభమైన నటనా ప్రస్థానం!
అలీ అస్గర్ నటనా జీవితం 1980ల చివర్లో ఆరంభమైంది. టెలివిజన్ మీడియం ద్వారా నటుడిగా పరిచయమైన.. ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారిపోతున్న వినోదరంగంలో నాలుగు దశాబ్దాల పాటు ఓ నటుడిగా నిలదొక్కుకోవడమంటే మాటలేం కాదు. కాలానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ రియాలిటీ, కామెడీ షోస్, సీరిసుల్లో నటిస్తూ ఇంకా కూడా డిమాండున్న నటుడిగా కొనసాగుతున్నాడు.
స్కూల్ లో బుల్లీయింగ్ తో పిల్లలపై ప్రభావం!
అలీ అస్గర్ క్యారెక్టర్ రోల్స్ తోనే కాకుండా.. కొన్ని షోస్ లో మహిళల పాత్రలు వేయడంతో ఆ ప్రభావం పిల్లలపై పడింది. దాంతో పిల్లలు బడికెళ్లినప్పుడు మిగిలిన విద్యార్థినీ, విద్యార్థులు తన పిల్లల్ని ఆట పట్టించేవారు. తాను మహిళల వేషధారణలోనూ పాత్రలతో ఆకట్టుకుంటున్న సమయంలో వాటిని వదిలేశాడు. ఇంకొంచెం పొడవుంటే నన్ను హీరోయిన్ గా కూడా చేసేవారేమోనని నా పిల్లల్ని ఎగిరించడంతో తాను ఆలోచనలో పడ్డాడు. సోనీలో శని, ఆదివారాల్లో ప్రసారమైన కామెడీ సర్కస్ వంటి ఎపిసోడ్స్ లో మహిళా పాత్రలను పోషించాడు. దాంతో అలీ అస్గర్ కు ఇక మహిళా పాత్రలే రావడం మొదలైంది. రైటర్స్ కూడా ఆయన పాత్రను అలాగే క్రియేట్ చేసేవారు. దాంతో ఇక వాటికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాడు. కపిల్ కామెడీ నైట్స్ లో కూడా కపిల్ శర్మ బలవంతంతో ఒప్పుకున్నాడు.
చిన్న మాడల్ గా ప్రారంభించి.. కోట్లకు పడగెత్తిన అలీ అస్గర్!
టెలివిజన్ షోస్, సినిమాలు, సీరీస్ లు, స్టేజ్ షోస్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, కామెడీ షోలతో అలీ అస్గర్ కోట్లకు పడగెత్తాడు. ప్రస్తుతం ఈ నటుడి ఆదాయం 40 కోట్లు. అయితే, ఈ విజయం ఒక్క రాత్రిలో దక్కిందేమీ కాదు. క్రమంగా, స్థిరంగా కష్టపడ్డ ఫలితం.
మహిళా పాత్రల ప్రభావంతో జెఠాలాల్ వంటి పాత్రనూ తిరస్కరించిన అలీ అస్గర్!
తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా అనే షోలో జేఠాలాల్ పాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ పాత్ర మొదట అలీ అస్గర్ నే వరించింది. కానీ, అప్పటికే కొన్ని మహిళా పాత్రల ప్రభావంతో ఆలోచనలో పడ్డ అలీ అస్గర్.. జేఠాలాల్ కామెడీ పాత్ర మహిళా పాత్ర కాకున్నా దాన్ని తిరస్కరించాడు. ఆ తర్వాత ఆ పాత్ర దిలీప్ జోషికి వెళ్లి మంచి పేరు తెచ్చిపెట్టింది.
బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్స్ పై తన ముద్ర!
బుల్లితెర, వెండితెర రెండింట్లోనూ తన కామెడీ టైమింగ్ పంచులతోనూ, నటనతోనూ అలీ అస్గర్ కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కామెడీ ప్రపంచంలో ఓ గుర్తుండిపోయే క్యారెక్టర్ గా నిల్చిపోయాడు.


