ఒక్క రూపాయి నోటు.. ఓ నోస్టాల్జియా!

కాలానుగుణంగా మారిన రూపాయి నోటు కథ!

నాణాల నుంచి కాగితంపైకి కరెన్సీ మారిన కాలాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. నాడు అదో రెవల్యూషన్. ఓ పెద్ద మార్పు. నోస్టాల్జియా. కరెన్సీ చలామణిని సులభం చేసిన కాలం. ఇవాళ కాగితం కరెన్సీ చలామణిలో ఉన్నా.. డీమానిటైజేషన్ పుణ్యమా అని డిజిటల్ కరెన్సీకే అలవాటు పడుతున్న వేళ.. కాగితంపైకెక్కిన ప్రగతిశీల కరెన్సీ కథలెలా మారాయో తెలుసుకునే కథ ఇది. సంప్రదాయ రూపాయి నోటు.. క్రొంగొత్త ఐడియాస్, ల్యాండ్ మార్క్స్, మొక్కలు, జంతువుల పిక్చర్స్ తో ఎలా న్యూలుక్ సంతరించుకుందో.. ఓసారి నెమరు వేసుకుందాం!

నోటంటే కేవలం కాగితమే కాదు.. అలా అని డబ్బు మాత్రమే కాదు.. అంతకుమించి! పిల్లలు, పెద్దలు, జెండర్ తేడా లేకుండా మనుషులందరికీ అవసరమైన కాగితం!! మన సంస్కృతిలో భాగం! వయస్సుతో తేడా లేకుండా జనరేషన్స్ ను కలిపే ఓ ఎమోషన్!! జేబులో, పాకెట్ లో మనీ ఉంటే.. అది అందమైన జ్ఞాపకాలను అందిస్తుంది. అయితే, ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మనీగా మారుతున్న కాలాన.. మనం చూసిన పూర్వపు రూపాయి నోటు.. రేపటి తరానికి తెలియకపోవచ్చునేమోగానీ… అది తెలిసినవారందరికీ ఓ మధుర జ్ఞాపకం.

నాణేనికి మరోవైపు రూపాయి నోటు తెచ్చిన ఆర్థిక తారతమ్యాలు కూడా చర్చించాల్సినవే. అయితే, వాటిని కాస్త పక్కనబెట్టి.. రూపాయి పుట్టుక ఎలా జరిగిందనేదానిపై దృష్టి సారిద్దాం.

రూపియే అనే పదం సంస్కృతంలోని రూపా నుంచి వచ్చింది. రూపా అర్థం వెండి నాణెం అని అట. చాణక్యుడు రచించిన అర్ధశాస్త్రంలో వెండి నాణాలను రూప్యపూపగా సూచించారట. క్రీస్తుశకం 1540-1545 మధ్య షేర్ షా సూరి అనే రాజు వెండి నాణాన్ని విడుదల చేశారట. ఆ నాటి నాణాల వారసత్వమే ఇవ్వాల్టికీ మనం కొనసాగిస్తున్నాం.

అయితే, 19వ శతాబ్దం చివరి వరకూ కూడా నాణాలే కరెన్సీగా చలామణి కాగా.. ఆ తర్వాత వచ్చిన ఒక రూపాయి పేపర్.. మనల్ని 20వ శతాబ్దం ఆరంభంలోని చరిత్రలోకి తీసుకెళ్లుతుంది.

భారతీయ ఆర్థిక చరిత్రకు కొత్త రూపు, చూపునిచ్చిన రూపాయి నోటు మూలాలు!

ఒక రూపాయి నోటు కథ.. 20వ శతాబ్దపు ఆరంభానికి మనల్ని తీసుకెళ్తుంది. ఇది భారతదేశ ఆర్థిక ప్రగతిశీల పరిణామంలో ఒక ముఖ్య ఘట్టం, ఓ మైలురాయి. బ్రిటీష్ వలసదారుల కాలంలో.. ఐకానిక్ రూపాయి నోటును కాగితంపై ముద్రించి.. కొత్త కరెన్సీని పరిచయం చేయడం.. ద్రవ్య లావాదేవీలను విప్లవాత్మకం చేసింది. రాజకీయ మార్పులు జరుగుతున్న కాలాన ఉద్భవించిన రూపాయి నోట్.. ఆ తర్వాత ఆధునికీకరణ చెందింది. ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేసింది. సంప్రదాయ వస్తు మార్పిడి వ్యవస్థలను సులభం చేయడంతో పాటు.. ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసింది.

స్టాంప్స్, కరెన్సీస్, కాయిన్స్ వంటి చారిత్ర అంశాల గురించి తెలిపే మింటేజ్ వరల్డ్ సైట్ ప్రకారం.. మొట్టమొదటి నోటు 1861 నవంబర్ 30వ తేదీన.. ఇండియన్ పేపర్ మనీ యాక్ట్ ద్వారా వెలుగులోకొచ్చింది. అయితే, మరింత ఆసక్తికరంగా, ప్రాధాన్యతతో కూడిన నోటును… 1917, నవంబర్ 30న అప్పటి బ్రిటీష్ రాజైన ఐదో కింగ్ జార్జ్ కాలాన ప్రామిసరీ నోటులాగా విడుదల చేశారు.

మొట్టమొదటి రూపాయి నోటుపై ఎవరి సంతకముంది..?

ఎంఎంఎస్ గుబ్బే మొట్టమొదటి రూపాయి కరెన్సీపై సంతకం చేశారు. ఆయనే కంట్రోలర్ ఆఫ్ కరెన్సీగా, ఇంఛార్జ్ ఆఫ్ ఇండిపెండెంట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ కరెన్సీ గా అప్పుడు పనిచేశారు.

నాటి మొట్టమొదటి రూపాయి నోటుపై.. పైన మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసుండేది. పైన ఎమడవైపు కింగ్ జార్జ్ 5 చిత్రాన్ని చూపించే ఓ వెండి నాణెం కనిపించేది. మధ్యలో రోజ్ తరహా.. లైట్ పింక్ కలర్ డిజైనింగ్ ఉండేది. పైన కుడివైపు… కింద ఎమడవైపు 1 రూపాయిని సూచించే సంఖ్యలు కనిపించేవి. కింద భారత ప్రభుత్వాన్ని సూచించే సంతకముండేది.

ఇక వెనుకవైపు బ్రిటీష్ ఐదవ ఎంపరర్ అయిన జార్జ్ కింగ్ ముద్రను ప్రతిబింబించే జార్జియస్ రెక్స్ ఇంపరేటర్ డిజైన్ తో పాటు.. పైన ఎడమవైపు ఐదవ జార్జ్ అధికారిక సాంకేతిక లిపి, కుడివైపు 1917లోని నాణానికి రెండో వైపు సూచించే చిహ్నం.. ఇలా కనిపించేది నాటి మొట్టమొదటి రూపాయి నోటు. మొత్తంగా ఐదవ కింగ్ జార్జ్ విడుదల చేసిన మొట్టమొదటి రూపాయి కరెన్సీ సరళంగా, అందంగా కనిపించేదట.

మారుతున్న కాలానికనుగుణంగా రూపాయి నోటులో మార్పులు!

అలా 1917 నుంచి రూపాయి కాగితపు నోటుగా చలామణిలోకొచ్చాక.. ఆ కరెన్సీ రూపకల్పనలో కాలానికనుగుణమైన ఎన్నో మార్పులు వచ్చాయి. సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే నమూనాల నుంచి.. ఆధునిక భద్రతాపరమైన చర్యల వరకు… డిజైన్స్ కొత్త రూపును సంతరించుకుంటూ వచ్చాయి. అలా జాతీయభావాలను పెంచేలా.. జాతీయ నాయకులను స్మరించుకునేలా.. స్వదేశీ కథలను చెప్పేలా.. వృక్షజాలాన్నీ, జంతుజాలాన్నీ తన ముద్రణలో కలుపుకుంటూ.. సంప్రదాయానికి, కొత్త ఆవిష్కరణలు తోడై రూపాయి నోట్లు.. కరెన్సీ చలామణికే పరిమితం కాకుండా.. ఎందరో సేకరించి పురా జ్ఞాపకాలుగా తమ వద్ద పెట్టుకునే అపురూపమైన వస్తువుగా కూడా తయారవ్వడం విశేషం.

రూపాయి నోటుకెందుకంత సాంస్కృతిక ప్రాధాన్యత..?

రూపాయి నోటంటే కేవలం ద్రవ్య వినిమయం కిందకు వచ్చే ఓ వస్తువుగా ఏనాడూ చూడబడలేదు. అంతకుమించి దేశంలో రూపాయి తన విలువను పెంచుకుంది. రోజూవారీ లావాదేవీలకు పనిచేసే రూపాయి.. ఆధ్యాత్మక, మతపరమైన అంశాల్లో దక్షిణగా ఇవ్వడానికో.. లేక ఫండ్ రైజింగ్ చేసినప్పుడు మినిమంగానైనా ఇవ్వడానికో ఉపయోగపడుతూ వచ్చింది. అలా కేవలం కరెన్సీగానే కాకుండా.. అంతకుమించిన బంధంతో రూపాయి జనాన్ని ఒకరితో ఇంకొకరిని మిళితం చేసింది.

వారసత్వ సంపద సంరక్షణలో భాగంగా రూపాయి సేకరణ!

రూపాయి నోట్ ప్రారంభ దశ నుంచి.. అది చలామణిలో ఉన్న కాలం వరకూ కూడా.. రూపాయి నోట్లను సేకరించిన చరిత్ర ప్రియులెందరో కనిపిస్తారు. ఎందుకంటే వారికదో అభిరుచి. భారతదే ద్రవ్య వారసత్వ ప్రయాణంలో రూపాయి నోట్ల సేకరణ… చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పడమే కాకుండా.. తరతరాలుగా వివిధ మార్పులకు లోనవుతూ వచ్చిన ఆ నోట్లలోని తేడా కరెన్సీ కలెక్టర్లలో మరింత ఆసక్తికి కారణమైంది.

డిజిటల్ లావాదేవీల యుగంలో రూపాయి నోటు భవిష్యత్తుకు భరోసా లేకపోవచ్చు. అయినప్పటికీ, నేటి సాంకేతిక పురోగమనాల నడుమ కూడా అది కొనసాగిన ప్రస్థానం మాత్రం దాన్నెప్పటికీ గుర్తుండేలా చేస్తుంది. వడివడిగా పరుగులు పెట్టే కాలంలో దాని జ్ఞాపకాలను మాత్రం మర్చిపోకుండా ఈ సమాజంపై ముద్రించి.. ఫరెవర్ రీమైండర్ గా రూపాయి నోటుది ఓ ప్రత్యేక స్థానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles