పైకి మర్డర్ మిస్టరీనే: తరచిచూస్తే అనంతమైన పొరల ప్రదర్శన.. RASHOMON!

NARUKURTI SRIDHAR…✍🏻

నాకు నచ్చిన సినిమా..


చెత్త సినిమాల గురించి రాయడం చాలా సులభం. ఎందుకంటే వందకి తొంభై తొమ్మిది చెత్త సినిమాలు తీసే టాలీవుడ్ లో వెదుక్కోవడం చాలా ఈజీ ..
ఉష గారు మంచి సినిమాల గురించి ట్యాగ్ చేసారు. ప్రతిమ కూడా అదే అంది. “మంచి సినిమాల గురించి రాయొచ్చుగా … “అని
చెత్త అంటే సామ్రాట్ అశోక గుర్తొచ్చినట్లు మంచి సినిమా అంటే Rashomon గుర్తొస్తుంది నాకు. అది జపనీస్ మూవీ. తెలుగులో ఏదీ లేదా అని అడగొద్దు. ఈ సినిమా నాకొక బెంచ్ మార్క్ లాంటిది. ఒక యూనిట్ లాంటిది. మంచి సినిమాకి యూనిట్ Rashomon అన్నమాట. ఈ సినిమా కురోసవా ని ప్రేమించేలా చేసింది.
పైకి మర్డర్ మిస్టరీ లా ఉండే ఈ సినిమాలోని పొరలు అనంతం. ఈ సినిమా తీయడం అయిపోయిన తర్వాత ‘ఇంతకీ హంతకుడెవరు?’ అని ఈ సినిమాలో పనిచేసిన technicians దర్శకుడుని అడిగారంట…బహుశా దర్శకుడికి కూడా తెలియక పోవచ్చు..
అడవి గుండా వెళుతున్న ఒక సమురాయ్ భార్యపై ఒక దొంగ అత్యాచారం చేస్తాడు. ..పొదల్లో సమురాయ్ శవం దొరుకుతుంది.. ఆ హత్య ఎవరు చేసి ఉంటారన్నది ప్రశ్న. ఆ సంఘటన లో పాల్గొన్న దొంగ, చనిపోయిన సమురాయ్ , అతని భార్య, అది చూసిన వడ్రంగి వారి వారి కథనాలు వినిపిస్తారు.


దొంగ కథనం : సమురాయ్ భార్యపై మనసుపడి.. సమురాయ్ ని పొదల్లోకి తీసుకెళ్ళి కట్టేసి… అతని ఎదురుగుండా నే అతని భార్యని బలాత్కరించాననీ…అక్కడ నుంచి వెళ్ళిపోదామనుకుంటే సమురాయ్ భార్య తనని ఆపి తన గౌరవం కోసం తన భర్తతో పోరాడమందనీ… ఆ పోరాటం లో సమురాయ్ ని చంపెశాననీ..ఈ లోపులో ఆమె అక్కడినుంచి తప్పించుకుందనీ చెబుతాడు.

భార్య కథనం:
తనని బలాత్కరించిన తర్వాత దొంగ అక్కడినుంచి వెళ్లిపోయాడనీ ..తన భర్త తనని తిరస్కార భావంతో చూడడం భరించలేక కోపం తో, బాధతో భర్తని తనే చంపేసాననీ చెబుతుంది.

సమురాయ్ కథనం (సమురాయ్ ఆత్మ మీడియం ద్వారా చెబుతుంది):
బలాత్కారం తరువాత దొంగ తన భార్యని తనతో వచ్చేయమంటే ఆమె అంగీకరించిందనీ.. అయితే తన(సమురాయ్) ప్రాణాలు తీయమని దొంగని కోరిందనీ..అది చూసి తట్టుకోలేక కత్తితో పొడుచుకుని చనిపోయాననీ చెబుతాడు.


వడ్రంగి కథనం:
బలాత్కారం తరువాత తనతో వచ్చేయమని దొంగ ఆమెని ప్రాధేయపడ్డాడనీ..ఆమె పురుషులు మాత్రమే నిర్ణయించుకోవాలని చెప్పడంతో ఇద్దరి మధ్యా జరిగిన పోట్లాట లో దొంగ ఆమె భర్తని చంపేసాడనీ ఈ లోపు ఆమె పారిపోయిందనీ.. దొంగకూడా అక్కడినుంచి వెళ్ళిపోయాడనీ చెబుతాడు.

కథలోని ముగ్గురూ హంతకుడు తామేనని ఒప్పుకుంటారు. వారిని అలా ఒప్పుకునేందుకు ప్రోత్సహించింది వాళ్ళ ‘ప్రైడ్’ . దొంగ, సమురాయ్ ని ఓడించి అతని భార్యని పొందడంలోనూ…భార్య, తనని తిరస్కార భావంతో చూసిన భర్తని చంపడంలోనూ… భర్త, అవమానం భరించలేక తనని తనే చంపుకోవడం లోనూ … ప్రైడ్ ని ఫీల్ అవుతారు.


ఈ నాలుగు కథనాలలో ఏది సత్యం?… సత్యం అనేది సాపేక్షం ..అసలు సత్యమనేది ఉంటుందా..నిజానికి అందరూ వాళ్ళు చూసిందే చెప్పుంటారు ..లేక వాళ్ళు నమ్మిందే చెప్పుంటారు.. అందరు చెప్పిందీ సత్యమే.. దర్శకుడు సత్యాన్ని ప్రశ్నించడు …అతను వాస్తవ్యాన్ని ప్రశ్నిస్తాడు.. ఈ సినిమాలో రెండు డైలాగులు నన్నెప్పుడూ వెంటాడుతూ ఉంటాయి


“Men are only men…they can’t tell truth-not even to each other”
“It is beacause men are so weak. That’s why they lie. That’s why they must deceive themselves”

ఈ సినిమాకి మహిళా అస్తిత్వవాదం ప్రాతిపదికగా కూడా ఎన్నో సమీక్ష లు వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపించి మరిన్ని అర్థాలు స్ఫురించే సినిమా ఇది. ఎప్పుడు చూసినా ఈ సంస్కృత శ్లోకం గుర్తొస్తుంది.


ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే
(That is complete/full/perfect, This is complete, From the completeness comes the completeness. If completeness is taken away from completeness, Only completeness remains)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles