పెళ్లి ప్రతిపాదన చేసిన పాక్ మహిళకు వాజ్ పాయ్ ఇచ్చిన జవాబేంటి..?

సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు కేరాఫ్: పాక్ మహిళకు వాజ్ పాయ్ చెప్పిన సమాధానమేంటి..?

హాస్యం, చమత్కారం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ కలగలిస్తే… వాజ్ పాయ్. ఈ విషయం ఆయన గురించి కాస్తో కూస్తో తెలిసినవారందరికీ తెలిసిందే. ఇవాళ ఆయన 101 జయంతి సందర్భంగా.. ఆయన సెన్ ఆఫ్ హ్యూమర్ తో చెంప చెళ్లుమనే సమాధానాలు ఎలా చెప్పేవారో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ సభలో చెప్పుకొచ్చారు.

వాజ్ పాయ్ ప్రధాని హోదాలో అత్యంత కీలక ఘట్టాల్లో 1999లో జరిగిన లాహోర్ బస్సు యాత్ర ఒకటి. అణు పరీక్షలనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉద్ధేశించిన ఆ లాహోర్ డిక్లరేషన్ పై ఇరు దేశాల నాయకులు సంతకాలు చేశారు. వాజ్ పాయ్ తో, రాజ్ నాథ్ సింగ్ కూడా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పాక్ లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వాజ్ పాయ్ ప్రసంగానికి పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళ ఆకర్షితురాలైంది.

ప్రసంగం అనంతరం ఆ అవివాహితైన మహిళ.. బ్యాచిలర్ అయిన వాజ్ పాయ్ దగ్గరకు వచ్చి వివాహ ప్రతిపాదనను ముందుబెట్టింది. కానీ, తనను వివాహం చేసుకుంటే కాశ్మీర్ పాకిస్థాన్ కు కాశ్మీర్ ను ఇచ్చేయాలనేది ఆ ప్రతిపాదనలో ఆమె డిమాండ్.

సమయానికి తగ్గట్టు, వ్యక్తులను, వారడుగుతున్న ప్రశ్నలను అంచనా వేసి సమయస్ఫూర్తితో స్పందిస్తాడు కాబట్టే వాజ్ పాయ్ సెన్ ఆఫ్ హ్యూమర్ కు కేరాఫ్. అనుకున్నట్టే ఆ మహిళకు చెంప చెళ్లుమనే సమాధానం చెప్పారు వాజ్ పాయ్.

మీ ప్రతిపాదనకు నేను ఓకే కానీ… అప్పుడు మీ పాకిస్థాన్ మొత్తాన్ని మిమ్మల్ని పెళ్లాడినందుకు భారత్ కు కట్నంగా ఇవ్వాలని కౌంటర్ డిమాండ్ ఆ మహిళ ముందుంచడంతో అవాక్కవ్వడం తప్ప ఆ మహిళ మారు మాట్లాడలేకపోయిందట. ఈ విషయాన్ని రక్షణమంత్రి వాజ్ పాయ్ సమయస్ఫూర్తిని కొనియాడుతూ చెప్పుకొచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles