నర్సన్న వొచ్చిండు.
………………………………………………………………………
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ తెరకెక్కుతున్న నేపథ్యంలో.. ఓసారి చెప్పుకోవాల్సిన మట్టి మనిషి కథ ఇది!
——————————————-
Siva Racharla… ✍🏻
———————————————–
ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా సీఎం పట్టించుకోకుండా పోయారు.
ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా బస్సులోనో, ఆటోలోనో తిరుగుతాడంట
ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా కుటుంబం మొత్తం పొలం పనులు చేస్తారంట …
ఏ ఏముంది..? మన పని మనం చేసుకోవద్దా? ఆయన సీఎం ..పనులు ఉంటాయి కదా?. నన్ను గమనించాడో లేదో? అయినా తరువాతి రోజు పిలిచి మాట్లాడిండు కదా ? చాలా సింపుల్ సమాధానం ఆయన నుంచి ..

రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారికి గుమ్మడి నరసయ్య పరిచయం ఉంటుంది.. సిపిఐ(ఎంఎల్) పార్టీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఏకైక నేత .. ఉమ్మడి ఖమ్మం ,నేటి కొత్తగూడం జిల్లా ఇల్లెందు నుంచి గుమ్మడి నర్సన్న 1983.1985,1989,1999 & 2004 ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. 1994లో సిపిఐ అభ్యర్థి ఊకే అబ్బయ్య మీద ఓడిపోవటంతో డబల్ హ్యాట్రిక్ మిస్ అయ్యారు..
రాజకీయాల్లో అన్నిసార్లు గెలవటం ఒక రికార్డ్ అయితే పార్టీ మారకుండా ఒకే పార్టీలో కొనసాగటం మరో రికార్డ్.. 1978 నుంచి 2018 వరకు ఇల్లెందు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో పార్టీ మారనిది కేవలం నరసన్నే..
1978లో సిపిఐ(ఎంఎల్) తరుపున గెలిచిన చాపల ఎర్రయ్య పార్టీ నిర్ణయాన్ని కాదని జనతాపార్టీ అభ్యర్థి బాబుల్ రెడ్డికి ఓటు వేశాడు .. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 1985లో ఇండిపెండెంట్ గా పోటీచేశాడు. 1994లో నర్సన్నను ఓడించిన ఊకే అబ్బయ్య మారని పార్టీ లేదు .. సిపిఐ , టీడీపీ, తెరాస , కాంగ్రెస్ ,బీజేపీ.. 2009లో మాత్రమే (టీడీపీ తరుపున) గెలిచాడు , ఈమధ్యే చనిపోయారు.

2014లో కాంగ్రెస్ తరుపున గెలిచిన కోరం కనకయ్య తెరాసలో చేరారు.
2018లో కాంగ్రెస్ తరుపున గెలిచిన హరిప్రియ కూడా తరువాత తెరాసలో చేరారు.
2023లో కాంగ్రెస్ కోరం కనకయ్యకు టికెట్ ఇచ్చింది, ఆయన గెలిచారు, రాష్టంలో కూడా కాంగ్రెస్ గెలిచింది.. పార్టీ ఫిరాయింపు లేదు.
అంటే 1978 నుంచి ఇల్లెందు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో నరసన్న తప్ప అందరూ పార్టీ ఫిరాయించారు..
2009 నియోజకవర్గాల పునఃవిభజన తరువాత ఇల్లెందు నియోజకవర్గ బలాలు మారిపోయాయి.. కొత్తగా ఏర్పడిన పినపాక , ఇల్లెందు మధ్య సిపిఐ(ఎంఎల్) బలం డివైడ్ అయ్యింది.. 2009 ,2014 & 2018లో నర్సన్న ఓడిపోయారు..
ఓడినా గెలిచినా నర్సన్న మాత్రం నియోజకవర్గం కోసం ఆత్రపడుతూనే ఉన్నాడు.. మొన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది కూడా నీటి సమస్య పరిష్కారం కోసమే. గోదావరి తలొడ్డున్న ఉన్న ఇల్లెందుకు నీళ్లు దక్కటంలేదు,దాని మీదనే సీఎంను కలిశారు.
నర్సన్న కూతురు Professor అనురాధ, ఉస్మానియా లా కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు.. వారి తెగ నుంచి తొలి Professor అనురాధ, 2018లో రాసిన ఆర్టికల్ చదవండి .. https://www.facebook.com/story.php?story_fbid=1934270406609662&id=100000801631993&rdid=0kf65jOdpCNTrCyP#
నర్సన్న లాంటి నిజాయితీ ఉన్న నాయకులు, వ్యాపారాల కోసం కాకుండా ప్రజలకోసం తపించే నేతల అవసరం చాలా ఉంది.



