రాజ్యాంగానికి బొమ్మలు గీసిన ఆర్టిస్ట్ మనవడి పేరే ఓటర్ల లిస్టులో గల్లంతు: పశ్చిమబెంగాల్ లో కాక రేపుతున్న SIR!

ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఒక పెద్ద విషయం.. SIR…స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిపైన ప్రతిపక్ష పార్టీలు.. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతీ తెలిసిందే. అయితే, ఇప్పుడో ఓ కీలక వ్యక్తి ఓటే ఓటర్ల లిస్టులోంచి గల్లంతవ్వడంతో.. ఈ SIR మరింత రచ్చకు తెరలేపింది.

ఏకంగా భారత రాజ్యాంగాన్నే అలంకరించిన ఓ కళాకారుడైన నందలాల్ బోస్ మనవడైన సుప్రసిద్ధ సేన్ పేరే ఇప్పుడు బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో ఈ వివాదానికి తెరలేచింది.

88 ఏళ్ల సుప్రబుద్ధ సేన్, ఆయన భార్య 82 ఏళ్ల దీపాసేన్ ఇద్దరూ శాంతినికేతన్ నివాసులు. ఇప్పుడు వీరిద్దరి పేర్లు రేపు పశ్చిమబెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలోంచి తొలగించడం చర్చనీయాశంగా మారింది. వీరి కుటుంబ సభ్యుడైన మరో వ్యక్తి చక్రధర్ నాయక్ పేరును కూడా అధికారులు తొలగించారు.

ఈ విషయాన్ని సవాల్ చేస్తూ సుప్రసిద్ధ సేన్ సుప్రీం కోర్టును అప్రోచయ్యాడు. సుప్రీం కోర్ట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ను సంప్రదించాలని సూచించింది. అదే సమయంలో ట్రిబ్యునల్ ను తక్షణమే ఈ కేసును పరిష్కరించాలనీ ఆదేశించింది.

అయితే, త్వరగా పరిష్కరించాలని సూచించిందే తప్ప.. స్పష్టమైన గడువు సుప్రీం కోర్ట్ పేర్కొనకపోవడంతో.. ఇప్పుడు ట్రిబ్యునల్ ఏప్రిల్ 23, 29న రెండు విడతల్లో జరుగపబోయే ఎన్నికలకు ముందే ఈ కేసు విచారణ పూర్తి చేస్తుందా, లేదా అన్నది సందేహమే. అయితే, పశ్చిమబెంగాల్ లో SIR దెబ్బతో తొలగించిన ఓట్ల సంఖ్య ఏకంగా 90 లక్షలకు పైమాటే.

శాంతినికేతన్ లో దీర్ఘకాలిక ఓటర్ గా సేన్ పేరు!

సుప్రసిద్ధ సేన్ దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ లో మాజీ అధికారి. 1996లో రిటైర్డయ్యారు. ఆ తర్వాత శాంతినికేతన్ లో నివశిస్తూ ప్రతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గత 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయన ఓటు వేశారు.

విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివిన సేన్ బాల్య విద్యంతా.. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పాఠ భవన్ లో సాగింది.

ఈ కేసును సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీ విచారించింది. ట్రిబ్యునల్ లో కేసును సవాల్ చేయడానికి అనుమతినిచ్చింది.

మరి ఇంతకీ నందలాల్ బోస్ ఎవరంటారా..?

ఆచార్య నందలాల్ బోస్ భారత ఆధునిక కళలో ప్రముఖ వ్యక్తి. శాంతినికేతన్ లోని కళాభవన్ ఆయన నాయకత్వంలోనే రూపుదిద్దుకుంది. భారతదేశ తొలి ప్రధానైన జవహర్ లాల్ నెహ్రూ అభ్యర్థనకు స్పందించి ఆయన, తన విద్యార్థులతో కలిసి చేతిరాతతో తయారైన మొదటి రాజ్యాంగానికి చిత్రాలు వేశారు. డిజైన్స్ రూపొందించారు.

అందుకోసం ఆయనకు నాల్గేళ్ల కాలం పట్టింది. మొత్తం 22 చిత్రాలను భారతీయ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించారు నందలాల్ బోస్.

వెస్ట్ బెంగాల్ ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29వ తేదీల్లో జరుగనుండగా.. ఓట్ల లెక్కింపు మే 4న జరుగనుంది. ఓటర్ జాబితా నుంచి తొలగించబడినవారంతా అప్పీల్ చేసుకోవడానికి 19 అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఇక్కడే కాంగ్రెస్ నేత మోతాబ్ షేక్ పేరు కూడా తొలగించడం వివాదాస్పదమైంది. ఆయన కూడా కోర్టుకెక్కి ఫైట్ చేస్తేనేగానీ.. ఆయన పేరు తిరిగి ఓటర్ జాబితాలోకెక్కింది.

నందిగ్రామ్ లో దుమ్మురేపుతున్న వివాదం!

పశ్చిమబెంగాల్ లో నందిగ్రామ్ ఓ సున్నితమైన నియోజకవర్గం. ఇక్కడ SIR ఇప్పుడు పెద్ద రచ్చకే దారితీస్తోంది. ముస్లిం మైనార్టీలు ఇక్కడ 25 శాతముండగా.. ఓటర్ల జాబితాలో తొలగించిన పేర్లలో 95.5 శాతం ముస్లింలే ఉండటం ఈ వివాదానికి కారణమైంది. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఆర్ డూప్లికేట్ డాటా అనాలిసిస్ ప్రకారం తొలగించబడ్డ ఓట్లల్లో మూడో శాతం ముస్లిం మైనార్టీలవే కావడంతో నందిగ్రామ్ రాజకీయాలు మరింత సున్నితంగా మారాయి. ముఖ్యంగా ముస్లిమ్స్ అధికంగా ఉన్న ముర్షిదాబాద్ లోనే ఎక్కువ ఓట్లు తొలగించడం రచ్చకు కారణమవుతోంది. ముస్లిం మైనారిటీలతో పాటు, మతువా, రాజ్ బన్షీ సామాజిక వర్గాల ఓట్లు పెద్ద మొత్తంలో రద్దు చేయడంతో ఈ వివాదం దుమారంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 90 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు జరిగినట్టు పేర్కొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles