సోషల్ మీడియాలో ఆసక్తికరంగా గురు, శిష్యుల సంవాదం!

యువీ 12 బంతుల రికార్డు.. అభిషేక్ కౌంటర్ అదుర్స్!

వెల్లింగ్టన్ మ్యాచులో బ్యాటుతో తన దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ… మాటల్లో కూడా అంతే చురుకుగా స్పందించాడు. అదీ తన గురువైన యువరాజ్ సోషల్ మీడియా పోస్టుకు. అందరికీ తెలిసిందే అయినా ఈ గురు, శిష్యుల సంవాదం సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తించింది.

క్రికెట్ లో కొన్ని రికార్డులు చెరిగిపోనివుంటాయి. మరికొన్ని అనతికాలంలోనే అబ్బురపర్చేలా చెరిగిపోతుంటాయి. ఇంకొన్ని కాలానుగుణంగా ఎప్పుడో ఓసారి బద్ధలవుతాయి. ఇలా భిన్నరకాల పరిణామాలు మనం చూస్తుంటాం.

అలాంటి ఓ రికార్డ్ గురించే మాజీ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్… ప్రస్తుతం వెల్లింగ్టన్ మూడో టీ 20తో మరోసారి చర్చల్లోకొచ్చిన అభిషేక్ మధ్య ఓ సంవాదం ఆసక్తికరంగా మారింది.

అది 2007 టీ 20 ప్రపంచకప్… స్టువర్ట్ బ్రాడ్ అలా చూస్తుండిపోయాడు. ఏం చేసినా ప్రతీ బంతి గాల్లోంచి వెళ్లి పెవిలియన్ ను టచ్ చేస్తోంది. ప్రతీసారి అంపైర్ చేతులు పైకి లేపి సిక్సర్ చెబుతున్నాడు. అలా ఆరుప బాల్లల్లో ఆరు సిక్సర్స్ కొట్టిన యువరాజ్.. కేవలం 12 బాల్స్ లో 50 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డ్ ఇంకెవ్వరూ ఛేదించలేదు.

తాజాగా వెల్లింగ్టన్ టీ 20లో అభిషేక్ 38 బంతుల్లోనే.. 11 సిక్సర్స్, 9 ఫోర్స్ తో 113 పరుగులు చేశాడు. కానీ, హాఫ్ సెంచరీకి మాత్రం అభిషేక్ కు 15 బంతులు పట్టాయి. ఇదే యువరాజ్ సింగ్ సరదాగా చర్చకు పెట్టిన అంశం.

ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావా..?

ఇదీ యువారాజ్ తన శిష్యుడు అభిషేక్ కు వేసిన సరదా ప్రశ్న..?

యువీ 12 బంతుల సవాల్‌కు అభిషేక్ వెల్లింగ్టన్ లో బ్యాటుతో కొట్టినట్టే నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆయన క్రికెట్ ఎలా ఆడుతున్నాడో నాకు తెలియదు. 12 బంతుల్లో 50 చేయడం అంత సులభం కాదు. అలాంటివి అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. ఊరికే 12 బంతుల్లో 50 పరుగులు వచ్చేయవన్నది అభిషేక్ కౌంటర్ రెస్పాన్స్. అంతేకాదు, ఒకింత సెటైర్ కూడా అభిషేక్ కామెంట్స్ లో కనిపించింది. తనకు వ్యక్తిగత రికార్డులపై అంతగా దృష్టి లేదని, జట్టు గెలుపే ముఖ్యమంటూ కూడా అభిషేక్ యువరాజ్ X పోస్టుకు కౌంటర్ ఇవ్వడం చర్చకొస్తోంది.

అభిషేక్ విధ్వంసం సృష్టించినా.. అవకాశం తీసుకున్న యువీ!

అభిషేక్ ఎంత విధ్వంసకరంగా ఆడినా.. ఒక విషయంలో మాత్రం యువరాజ్‌ను ఇంకా అందుకోలేకపోయాడు. యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 50 చేస్తే.. అభిషేక్ శర్మ 15 బంతుల్లో 50 చేయగల్గాడు. అందుకే యువీకి ఈ సరదా ఛాన్స్ దొరికింది.

అయితే యువీ రికార్డ్ బద్ధలు కొట్టడం మిస్సైనా… టీ20ల్లో భారత బ్యాట్స్ మన్స్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకూ పది సెంచరీలతో ముందున్న విరాట్ కోహ్లీని… 11 సెంచరీలతో అభిషేక్ వెనక్కి నెట్టాడు. ఇక యువీ రికార్డ్ కోసం వెంపర్లాడక్కర్లేదు. ఇలాగే స్థిరంగా ఆడగల్గితే.. ఏదో ఓ రోజు ఆ 12 బంతుల్లో 50 పరుగుల రికార్డ్ బద్ధలయ్యే అవకాశాలూ లేకపోలేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles