సూఫీ శైలిలో రామాయణం పాటలా..? హవ్వ!

రామాయణానికి సంగీతమెలా ఉండాలి..? ఇప్పుడిదే పెద్ద చర్చ!

వందల కోట్లతో… భారీ ప్రాజెక్టుగా తెరపైకొచ్చి భిన్నరకాల చర్చలకు తెరలేపిన రామాయణలో ఇప్పుడు కవ్వాళీ శైలి పాటలపై దుమారం చెలరేగుతోంది. మంగళ్ రంగ్ అనే పాటపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటే… ప్రయోగాలే తన సంగీతానికి బలమంటున్నాడు ఏ.ఆర్. రెహమాన్.

అసలు ఎంపికనే సరిగ్గా లేదా..?

రామాయణ వంటి సినిమాలు చేసేటప్పుడు ఇండియన్ క్లాసికల్ టచ్ ఎక్కువ ఉన్నప్పుడే దానికి ఇక్కడి జనం కనెక్టయ్యే అవకాశాలెక్కువ. కానీ, ప్రాశ్చాత్య పద్ధతిలో… ది గ్రేట్ హాన్స్ జిమ్మర్ వంటివారితో కలిసి చేస్తే ఆ టింజ్ రాకపోగా విమర్శలకే అవకాశాలెక్కువ. ఇప్పుడదే జరుగుతోంది.

సీతారాముల ప్రేమ వివాహాన్ని ఆవిష్కరించే ఓ పాట మంగళ్ రంగ్. కానీ, అది ఫక్తూ ఈమధ్య ప్రతీ పాటా కవ్వాలీ శైలిలోకి మార్చేస్తున్న రెహమాన్ స్టైల్ అనేది మంగళ్ రంగ్ ను వివాదాల్లోకి తీసుకొచ్చి పెట్టింది. అర్జిత్ సింగ్, శ్రేయాఘోషల్ కలిసి పాడిన కుమార్ విశ్వాస్ సాహిత్యమిది.

ఇక కొందరైతే రాక్ స్టార్ కున్ ఫాయా కున్ పాటను తలపిస్తోందంటున్నారు. ఇంకొందరు ఎన్న సొల్లా పొగిరై అనే తన తమిళ పాటతో పోలిక పెడుతున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వ్యక్తిగత అభిప్రాయాలు.

ఇతిహాసానికి సంగీతమెలా ఉండాలన్న దానిపై కొత్త రామాయణం!

రామాయణం వంటి ఇతిహాసాన్ని తెరకెక్కించినప్పుడు సంగీతం కూడా ఆ కాలానికి, నాటి కథా ప్రపంచానికి అనుగుణంగా ఉండాలి. సంస్కృత పదాల్లోని సాహిత్యాన్ని పాటగా మారుస్తున్నప్పుడు.. సంప్రదాయ భారతీయ వాద్యాల సుస్వరాలు ఎక్కడ అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. కేవలం రెహమాన్ అభిమానులు మాత్రం సంగీతానికి సరిహద్దులేముంటాయన్న కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు.

మొత్తానికి హాన్స్ జిమ్మర్ తో కలిసి రెహమాన్ పేరిట విస్తృతమైన చర్చ జరిగి.. తెరపైకొచ్చే క్రమంలో రెహమాన్ పాటలు రామాయణానికి ఎలాంటి సంగీత భాష అవసరమనే చర్చను తెరపైకి తెచ్చాయి.

మరి రెహమాన్ మాటేమిటి..?

ఎవరైనా తాము చేసిందాన్ని సమర్థించుకుంటారు. అదే రెహమాన్ చేస్తున్నాడు. పాత శైలిని పదే పదే పునరావృతం చేయనని ఆయన ఏనాడో చెప్పాడు. ఇప్పుడూ అదే చెబుతున్నాడు. సంగీతకారుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగాలంటున్నాడు. ముందున్న అభిప్రాయం వినగా వినగా వేము తియ్యనుండు అన్నట్టుగా మారిపోవచ్చని కూడా రెహమాన్ చెబుతున్న మాట.

పాటతో పాటే చర్చకు తెరలేపిన హల్డీ సన్నివేశం!

రాముడికి పసుపు రాసే సమయంలో సీత కూడా పక్కనే కనిపిస్తుంది. పెళ్లికి ముందు జరిగే హల్డీ వేడుకల్లో వధుడితో పాటు వధువు కూడా ఉండటంపైనా చర్చలు మొదలయ్యాయి. అయితే, అది రాముడి పట్టాభిషేకం కావచ్చనే భావనా వ్యక్తమవుతోంది. ఇంకొందరేమో తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోని మిథిలా నగరం వైపు కనిపించే సంప్రదాయ ఆశీర్వాద కార్యక్రమం చుమావన్ తోనూ పోలుస్తున్నారు. మొత్తానికి సినిమా వస్తేనేగానీ పూర్తి విషయాలు అర్థమైతాయి.

ఇలాంటి సినిమాలకు ఇళయరాజా వంటివారైతే ఇంకెంత బాగా చేసి ఉంటారో కదా అనే టాక్స్ తో పాటు.. భారతీయ మైథాలజీ సినిమాలకు ఏ కర్నాటక శాస్త్రీయ సంగీత దిగ్గజమో.. లేక, ఏం హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ తో జత కడితే పాట బాగుంటుంది గానీ.. హాన్స్ జిమ్మర్ ఎంపికేంటి.. ఇప్పుడు ఒరిగిందేంటనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇలా భిన్నరకాల వాదనలు, ప్రతివాదనలతో సోషల్ మీడియాలో రామాయణ మాత్రం బాగా చర్చకొస్తూ క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles