సూఫీ ప్రతిరూపం.. నుస్రత్ గీతం!

తారాస్థాయిలో ఆయన వోకల్ కార్డ్స్ పలికే కవ్వాలీ నడక చూసి.. సునామీ ఆగిపోతుంది!

మందరస్థాయిలో ఆయన మెలిపెట్టే గమకాలు విని.. బద్దలవ్వాలనుకున్న భూమి కంపించకుండా వింటూ కూర్చుంటుంది!

కిందున్న వేదికపై ఆయన గొంతెత్తితే.. ఆకాశం కూడా అలర్టయ్యేంత సొగసైన ధ్వని అది!

ఆయన బతికినంత కాలమే కాదు.. కీర్తిశేషులయ్యాక కూడా అంత కీర్తిమంతమైన పాటగాడు కనిపించడు.

ఫిల్టర్ కాఫీని పక్కనబెట్టేసి.. జస్ట్ ఆయన సూఫీ వినేస్తామంతే!

మొదట గజల్ ని ప్రేమించాడు. ఇప్పటికీ, ఎప్పటికీ.. సూఫీ అయినా.. కవ్వాలీ అయినా ఆయనే పర్యాయపదం.

ఆ సినోనేమ్ పేరే ఉస్తాద్ పర్వేజ్ నుస్రత్ ఫతే అలీ ఖాన్.

పుట్టింది పాకిస్థానైనా… ఖ్యాతి మాత్రం విశ్వవిఖ్యాతం.

భక్తిరంజకమైన కవ్వాలీ పాటకు… అంతర్జాతీయ వేదికలపై డిమాండ్ తీసుకొచ్చిన గొంతది. 24 గంటల సమయం తారాస్థాయిలో పాడటమంటే అది కేవలం నుస్రత్ ఫతే అలీ ఖాన్ వల్ల మాత్రమే సాధ్యమైన పని.

HE TOOK HIS PAIN AND TURNED IT INTO SOMETHING BEAUTIFUL. INTO SOMETHING THAT PEOPLE CONNECT TO. AND THAT’S WHAT GOOD MUSIC DOES. IT SPEAKS TO YOU. IT CHENGES YOU. అని అంటారు HANNAH HARRINGTON అనే రచయిత్రి నుస్రత్ ఫతే అలీ ఖాన్ గురించి!

తన తండ్రి చనిపోయిన పది రోజుల తర్వాత కలలోకొచ్చారట. వచ్చి ఉస్తాద్ గొంతు నిమిరి పాడమని చెప్పాడట. వెంటనే ఉలిక్కిపడి లేచిన నుస్రత్ పాటందుకున్నాడట అప్పటికప్పుడే. ఆ తర్వాత తన తండ్రి అంత్యక్రియల సందర్భంలో మొట్టమొదటిసారి గొంతెత్తి పాడటంతో.. నుస్రత్ ఫతే అలీ ఖాన్ గానకచేరీ ఓ ప్రయాణమై సాగింది.

నుస్రత్ ఫతే అలీ ఖాన్ జీన్స్ లోనే సంగీతముంది. ఆ వంశం మొత్తం తన తండ్రితో పాటు.. మామలు, బాబాయ్ ఇలా అంతా కవ్వాలీ పాటగాళ్లు. అలా ఆ వంశ ప్రతిష్ఠను మరింత ముందుకు తీసుకెళ్లి.. అసలు కవ్వాలీ పాటకే ఓ గుర్తింపునిచ్చే స్థాయికి ఉస్తాదై ఎదిగారు నుస్రత్ ఫతే అలీ ఖాన్.

నుస్రత్ ఫతే అలీ ఖాన్ సోదరులు జైన్, జోహైబ్ అలీ ఏమంటారంటే.. కవ్వాలీ అనే ఓ ఓల్డ్ ఆర్ట్ ఫామ్ కు.. సులువైన నడకలు నేర్పి 21వ శతాబ్దంలో కవ్వాలీపై అప్ కమింగ్ వోకలిస్టులకు ఆసక్తి పెంచాడంటారు తమ సోదరుడి గురించి!

నుస్రత్ కు ముందు ఖవ్వాలీ సాంగ్ అంటే కనీసం గంట సేపు పట్టేది. అలా 8 లేదా 9 కవ్వాలీ సాంగ్స్ తో షో సమయం దాదాపు 9 గంటలుండాల్సిందే. కానీ, ఆ స్టీరియోటైప్ పద్ధతులకు స్వస్తి పలికాడు నుస్రత్ ఫతే అలీ ఖాన్. అంత సమయం ఇప్పుడెవ్వరికీ ఉండదని.. పాట ఇంకాస్సేపుంటే బాగుండుననిపించాలేగానీ… ఎంతకూ ఐపోదే అనిపించకూడదంటూ నిడివి తగ్గించి కవ్వాలీ సరళిని మార్చేశాడు నుస్రత్.

ఇవాళ కవ్వాలీ సాంగ్స్ పాడుతున్న ఎందరో సింగర్స్ కు… నుస్రత్ తీసుకొచ్చిన సూఫీ విధానమే స్ఫూర్తిగా నిలుస్తోంది. అయితే, ఎందరో నూతన సూఫీ గాయకులు పుట్టుకొస్తున్నా కూడా… 2001 గిన్నీస్ రికార్డ్స్ ప్రకారం అప్పటికే 125 కవ్వాలీ ఆల్బమ్స్ చేసిన ఘనత నుస్రత్ ఫతే అలీ ఖాన్ దే! ఆ రికార్డ్ ఇప్పటికీ ఇంకా నుస్రత్ భౌతికంగా లేకపోయినా ఆయన పేరిటే పదిలంగా కొనసాగుతోంది.

నుస్రత్ కవ్వాలీ పాట కేవలం తన దేశం పాకిస్థాన్ కో, భారత ఉపఖండానికో పరిమితమైంది కాదు.. ఆయన కెనెడియన్ సంగీతజ్ఞుడు మైఖేల్ బ్రూక్, అమెరికన్ గిటారిస్ట్ ఎడ్డీ వెడ్డర్ వంటివారితో కలిసి పని చేయడంతో… ఖవ్వాలీకి అంతర్జాతీయ ఖ్యాతయ్యాడు.

ఓ సయ్యోని వంటి కవ్వాలీ పాటలతో ఊర్రూతలూగించిన జునూన్ అనే పాకిస్థాన్ టాప్ మోస్ట్ ఆల్బమ్ సంగీత దర్శకుడు, గాయకుడైన అహ్మద్ కు పాక్ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ద్వారా నుస్రత్ ఫతే అలీఖాన్ తో పరిచయమేర్పడింది. 30 ఏళ్ల తన కవ్వాలీ సంగీత ప్రయాణంలో.. నుస్రత్ ఆ మాధ్యమానికి అందించిన సేవతో.. తన రుణం పూర్తిగా తీర్చుకున్నారంటాడు అహ్మద్. తమ ఆజాదీ ఆల్బమ్ లో 13 కవ్వాలీ సాంగ్స్ కు కూడా… ఎలాంటి ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వంటివి వాడకుండా.. కేవలం ఢోలక్స్, తబలాలతో రికార్డ్ చేశామని.. దానికి పూర్తి స్ఫూర్తి ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ అంటారాయన. ఉస్తాద్ తన చివరి రోజుల్లో కిడ్నీ ఫెయిలై ఆరోగ్యం బాగా లేకున్నా కాన్సర్ట్స్ కు హాజరు కావడం.. డయాలసిస్ చేసుకుంటున్న సమయంలో తాను ప్రోగ్రామ్స్ కు అటెండ్ చేయడంపై తన భార్యతో కూడా బాధపడేవాణ్నంటాడు అహ్మద్.

ఏ.ఆర్. రెహమాన్ తో భరత్ బాల చేసిన వందేమాతరం ఆల్బమ్ లోనూ ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీఖాన్ పాడిన చందా సూరజ్ పాట ఓసారి కాస్త ఆసక్తితో విని చూడండి. ఎంతగా అలరిస్తుందో మీకే తెలుస్తుంది. నుస్రత్ ఫతే అలీ ఖాన్ కవ్వాలీ పాటలను ఎందరో అనుకరిస్తూ, అనుసరిస్తూ.. ఆ సూఫీకి ఫ్యూజన్ తళుకులద్దుతుండగా.. ఆయన అల్లుడిగా రాహత్ ఫతే అలీఖాన్ ఇప్పుడు ఆయన పాటకు న్యాయం చేస్తున్నవారిలో ముందు వరుసలో ఉన్నాడు. కోక్ స్టూడియో రికార్డింగ్స్ లో తన మామ నుస్రత్ పాడిన పాటను రాహత్ ఏ స్థాయిలో ఆలపించాడో చూసి ఆనందించొచ్చు!

మొత్తంగా ఒక కాలానికో, ఒక వయస్సుకో పరిమితం కాని మ్యూజిక్ ఏదైనా ఉందంటే… అది ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ కవ్వాలీ సూఫీ పాటే!

జీవితంలో పదే పదే అలాంటి సౌండ్స్ ప్రొడ్యూస్ చేసేవారు కనిపించరు. అలాంటి అరుదైన గాత్రం నుస్రత్ ఫతే అలీ ఖాన్. అందుకే ఆయన పాటలో జనం తాదాత్మ్యం చెందుతారు. ఒక తెలియని స్వేచ్ఛననుభవిస్తారంటారు ఆయన్నెరిగినవారు. ఎల్లలు దాటి ఎగిరే ఓ విహంగంలా ఆయన పాట ప్రతిధ్వనించింది.

కవ్వాలీకి నడకలు నేర్పిన మ్యూజికల్ మాంత్రికుడు ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ ను తన దేశం పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారమైన తమ్గా ఈ ఇంతియాజ్ తో 1987లో సత్కరించింది. ఎవరూ అందుకోలేని స్థాయిలో ఆరోహణ, అవరోహణాలను అలవోకగా మూడు దశాబ్దాలపాటు సమాజానికందించిన ఆ స్వర మాంత్రికుడి స్వరం సరిగ్గా ఇదే రోజు 1997, ఆగస్ట్ 16న హార్ట్ అటాక్ తో మూగబోయింది. అయితే ఆయన అభిమానుల గుండెల్లో రికార్డైన ఆ కవ్వాలీ గీతాల్లో ఆయనెప్పుడూ చిరంజీవే! ఆ మహా గాయకుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. 🙏

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles