REVIEW BY: KARTIK K.. ✍🏻
Alfonso Cuarón దర్శకత్వంలో వచ్చిన Roma సినిమా యొక్క ఓపెనింగ్ సీక్వెన్స్ ఒక సినిమాటిక్ మార్వెల్ అనిపించుకోవడానికి అన్ని అర్హతలు కలిగినదీ అని నా అభిప్రాయం. కొన్ని సినిమాలు చూడగానే ‘అసలిది ఇంత ఆలస్యంగా ఎందుకు చూశాన్నేను!’ అని నన్ను నేను తిట్టుకుంటుంటాను. Roma అందులో మొదటివరుసలో ఉంటుంది.

బ్లాక్ అండ్ వైట్, LARGE FORMAT డిజిటల్ కెమెరాతో తీయబడిన ఈ సినిమా ఒక ఇంటి drivewayమీది నేలపై ఫోకస్ చేయబడిన (కొన్ని నిమిషాల నిడివిగల) షాట్‌తో మొదలవుతుంది. వెంటనే ఆ నేలంతా సబ్బునీళ్లు పరుచుకోవడంతో ఆకాశంలో విమానం యొక్క ప్రతిబింబం అందులో కనబడుతుంది. సబ్బునీటి అలలు ఆ టైల్స్ మీద ‘తుడిచిపారేసే ముందు చివరిసారి కలిసి ఒక డాన్స్ రిహర్సల్ చేస్తున్నాయేమో’ అనేంత కొరియోగ్రఫిక్ డీటెయిల్లో తిరుగుతాయి. కానీ ఇల్లు అలకడం అనే ఒక నిత్యకృత్యమైన రొటీన్ పనిని కూడా Cuarón కెమెరా ఒక సినిమాటిక్ పర్ఫామెన్స్‌లా ఎలివేట్ చేస్తుంది. అది నేల విషయమైనా సరే, ఒక కుటుంబం కోసమైనా సరే – clean slate మెయింటైన్ చేయడం కోసం ఒక పనిమనిషి పడే ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ శ్రమను ఆడియన్స్ confront చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. (Cuarón made his cinematography debut with Roma).
కథ విషయానికొస్తే (much of it is autobiographical, btw), 1970ల నాటి మెక్సికో సిటీ నగరంలోని Colonia Roma అనబడే విలాసవంతమైన ఏరియాలోని ఒక ఇల్లు. అందులో Cleodegaria Gutiérrez ఉరఫ్ ‘Cleo’ ఒక హౌస్ కీపర్. అదొక ఎగువ మధ్యతరగతి ఫ్యామిలీ. ఇంటిపెద్దగా అందరితోనూ ప్రేమగా మాట్లాడే ఒక అమ్మమ్మ. భార్యను వదిలేసి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అసలు ఇంటిపట్టున ఉండని తండ్రి ఆంటోనియో. ఈ కారణంచేత దుఃఖిస్తున్న తల్లి సోఫియా. వాళ్ల నలుగురు పిల్లలు – ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు (వారిలో ఒకరి పాత్ర Cuarón చిన్ననాటి ఆధారంగా రాసుకున్నది).
సర్ఫేస్ లెవెల్లో చూస్తే ఈ సినిమాది ఒక సింపుల్ one-line plot:
ఒక కుటుంబం యొక్క రొటీన్ జీవితం కొన్ని అనుకోని లైఫ్-చేంజింగ్ సంఘటనల వల్ల తలకిందులయ్యే ప్రక్రియను దగ్గరగా చూడటం. ఒక heartbreak, ఒక seperation, కొన్ని కన్నీళ్లు, ఒక ప్రెగ్నెన్సీ, ఒక మరణం, చివర్లో కాస్త bittersweetగా మిగిలిపోయే ఒక ఫ్యామిలీ వెకేషన్..దాదాపు రెండుగంటల వ్యవధిలో ఒక సాధారణ డ్రామాకు కావలసిన ముడిసరుకు.
కానీ Romaను మిగతా డ్రామాలకన్నా భిన్నంగా నిలబెట్టే ఆ irresistibility factor అసలు సినిమాలో నిజమైన protagonist ఎవరో తెలీని ఆ కన్‌ఫ్యూజనేనని నా అభిప్రాయం. నెరేషన్లో సెంటర్ స్టేజ్ ఎవరికివ్వాలి? భర్త తనను కాదనుకుని వెళ్లిపోవడంతో సడెన్‌గా ఒక్కర్తే నలుగురు పిల్లల బాధ్యతలు భుజాన వేసుకోవలసివచ్చిన సోఫియా యొక్క నిస్సహాయత, దుఃఖం మరియు కోపానికా? లేక తన పర్సనల్ లైఫ్‌లో ఎన్ని విషాదాలు ఎదురౌతున్నప్పటికీ పెదాలమీద చిరునవ్వు చెక్కుచెదరకుండా మౌనంగా తను పనిచేస్తున్న కుటుంబానికి కష్టసమయంలో అండగా నిలబడ్డ క్లెయో గుండె నిబ్బరానికా? ఒకవేళ ఆ హౌస్‌కీపర్‌ను ఫోర్‌గ్రౌండ్‌లో నిలబెట్టడమే సినిమా లక్ష్యమైతే ఆ కుటుంబం సంతోషంగా ఉండటానికి తననుతాను నిలువెల్లా ధారపోయాల్సిరావడం పట్ల క్లెయోకు ఒక్కసారి కూడా కనీసం మౌనంగానైనా ఆగ్రహం కలగకపోవడమేమిటి? ఒకవేళ కథలో హీరో నిజంగా తనే అయితే తన జీవితంలో తానే ఒక passive participantగా ఎందుకు చూపించబడింది? తన singular perspective ద్వారా సినిమా మొత్తాన్నీ ముందుకు నడపకుండా కెమెరా తనను కేవలం ఉదాసీనంగా అనుసరించడంతోనే ఎందుకు సరిపెట్టుకుంది?
అయితే ఈ సినిమాకి రైటర్, సినిమాటోగ్రఫర్, డైరెక్టర్, ఎడిటర్‌గా వివిధ బాధ్యతలు నిర్వర్తించిన Alfonso Cuarón పై ప్రశ్నలన్నిటికీ దూరంగా జరిగే ప్రయత్నంలాంటిదేదీ చేయడు. Instead, he entertains them. He flits between erasing the line between who gets to be at the centre of the story and who gets shipped to the background. అందుకే Roma మిగతా డ్రామాల్లా నిజజీవితాన్ని అనుకరించడం, రీక్రియేట్ చేయడం దగ్గరే ఆగిపోకుండా జ్ఞాపకాల లోతులని, తడిని తడిమిచూడటమనే ఒక అరుదైన పని కూడా చేయగలిగిందని నా నమ్మకం. ఈ సినిమాలోని ప్రపంచమంతా చిన్ననాటి Cuarón కళ్లతో చూడబడింది. It is his perspective, as a child. ఎందుకంటే చిన్నపిల్లలకు జీవితంలో ఫోర్‌గ్రౌండ్, బ్యాగ్రౌండ్‌ల మధ్య తేడా ఏముంటుంది గనుక!
బహుశా అందుకేనేమో..సినిమాలోని విషాదాలన్నిటికీ పూర్తి in between the lines తరహా డీటెయిల్డ్ వివరణేదీ లేకుండా చిన్నారుల అమాయకమైన interpretation మాత్రమే తోడవుతుంది. ఒక సీన్లో ఒక పిల్లాడు భోజనం సమయంలో తాను చూస్తుండగానే ఆర్మీ జీప్ మీదకి నీటిబెలూన్లు విసురుతున్న ఒక కుర్రాణ్ని ఒక సైనికుడు గన్‌తో కాల్చిన సంఘటన గురించి చెబుతాడు. కానీ కెమెరా మాత్రం వంట చేస్తున్న క్లెయో చేతుల వైపు జూం ఇన్ అయ్యి అతను చెప్పిన కథ ఒక వాయిస్ ఓవర్లా మాత్రమే మిగిలిపోతుంది. అదే ఈ సినిమా అడల్ట్ పర్స్పెక్టివ్‌లో తీసుంటే ఆ పర్టికులర్ సీన్, సంభాషణలు ఆర్మీ యొక్క క్రూరత్వం చుట్టూ తిరిగేవేమో..కానీ Cuarón జ్ఞాపకంలో అది కేవలం తాము భోంచేసేప్పుడు చెప్పుకున్న ఒకానొక గాసిప్ మాత్రమే.
In fact, ఇంటిపట్టున ఉండని వాళ్ల నాన్న యొక్క అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని కూడా ఒకలాంటి nonchalanceతో తెరకెక్కిస్తాడు Cuarón. తండ్రి లేకుండా పెరగాల్సిరావటం అనే సిచ్యువేషన్ యొక్క గ్రావిటీ ఇంకా పూర్తిగా అర్థంచేసుకోలేని చిన్నారుల నిస్సహాయత నుంచి పుడుతుంది ఆ పర్స్పెక్టివ్. ఒక గుండెల్నిపిండేసే సన్నివేశంలో తన జీవితంలోని కష్టనష్టాల గురించి సోఫియా దగ్గర కన్నీళ్లపర్యంతమైన క్లెయోకు మనస్పూర్తిగా తన గోడువెళ్లబొసుకునే అవకాశం లేకుండానే నన్నూ బుజ్జగించమని తన పంచన చేరతాడు ఒక పిల్లాడు. వాడికేం తెలుస్తుందని? సినిమాలో చాలాచోట్ల Cleo’s losses aren’t painted as just hers; instead it is a collective hurdle (as shown in the poster). కానీ ఒక్కచోట కూడా తను తన పర్సనల్ స్పేస్ కోసం అడగటం కానీ, తన tragediesని తానే ఒంటరిగా suffer అయ్యే ‘హక్కు’ కోసం నిలబడటం కానీ మనకు కనిపించదు.
కానీ Cuarón తన చిన్ననాటి జ్ఞాపకాలకు నూరుశాతం న్యాయం చేశాడనే మాటకు సాక్ష్యంగా సినిమాలో పెద్దలుగా ఉన్న క్యారెక్టర్లన్నీ ఆడవాళ్లవే ఉండటం కనిపిస్తుంది. As kids, our maternal figures are all that we see, comprehend, and depend on, at least for the first ten years of our life. అందుకే పిల్లల్ని పెంచిపెద్దచేయడం అనే ప్రాసెస్‌కి అనివార్యమైన ఆ ఫీమేల్ బాండింగ్ మీద ఫోకస్ చేస్తూ అతను కూడా ఆ విషయాన్నే నొక్కిచెబుతాడు.
అందుకేనేమో ఈ సినిమా క్లెయో పడే శ్రమను హైలైట్ చేస్తుంది – తను అందరికన్నా ముందే నిద్రలేస్తుంది, పిల్లలను లేపుతుంది, ఇల్లంతా ఊడ్చి నీళ్లతో శుభ్రం చేస్తుంది, drivewayలో dog poop తీసేసి కడుగుతుంది. ఇంత చేసీ తనకోసం తాను బ్రతకడానికి కూడా చాటుగా వెళ్లాల్సివస్తుంది. కుటుంబమంతా సరదాగా సినిమా చూద్దామని కూర్చున్నప్పుడు తను మాత్రం సడెన్‌గా టీ చేసుకురావాల్సివస్తుంది. ఆ పిల్లలలో ఒకరిని కాపాడినా తన జీవితపు విషాదం తన భుజాలపై టన్నుల బరువుతో మోపిన ఒక అపరాధభావన నుంచి తననుతాను కాపాడుకోలేకపోతుంది. ఈ సినిమా ద్వారా Cuarón చిన్నతనంలో క్లెయోను తాను ఆధారపడగల ఒక తల్లిలా ఎలా చూశాడో చెప్పే ప్రయత్నం చేశాడు. She’s the parent he didn’t have to worry about. ఎందుకంటే చిన్నపిల్లలకు పనివాళ్లను బయటి మనుషులుగా చూడ్డం కానీ, వాళ్లను శ్రమను బట్టి లేబిల్ చేయడం కానీ చేతకాదు. ఆ ఆలోచనే వాళ్లకు రాదు. Because after all, children don’t define their family by blood.
P.S: Roma became the first Mexican entry to win Best Foreign Language Film at the 91st Academy Awards. Alfonso Cuarón also won Best Cinematography and Best Director.



