వెండితెర మీద వెంటాడే కవిత్వం.. అతడి సినిమాలు!

Vamsy Krishna… ✍🏼

బుద్ధదేవ్ దాస్ గుప్తా ఈ పేరు వినగానే చాలా మందికి చరాచర్ సినిమా గుర్తుకొస్తుంది . బాగ్ బహదూర్ లో వేసిన పులి వేషాలు గుర్తుకొస్తాయి . కాల పురుష్ సినిమాలో చివరి సన్నివేశం గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతుంది . వెండి తెర మీద విస్తృతంగా పరచుకున్న అనేకానేక సారూప్య , నైరూప్య కవిత్వ ప్రతీకలు గుర్తుకొస్తాయి . సినిమాలో మ్యాజిక్ రియలిజం లేదా మంత్ర వాస్తవికత కి పెద్ద పీట వేసిన బుద్ధదేవ్ దాస్ గుప్తా మరణం తో భారతీయ సినిమా మరీ ముఖ్యంగా బెంగాలీ సినిమా లోకం లో ఒక పూడ్చలేని వెలితి ఏర్పడింది . ” కొన్ని కలలు , కొంత వాస్తవికత , మరికొంత మ్యాజిక్ ఒక గ్లాస్ లో వేసి బాగా కలిపేయండి ” నా సినిమా తయారు అవుతుంది అని చెప్పే బుద్ధదేవ్ దాస్ గుప్తా నిన్న తన 76 వ ఏట కన్నుమూశారు

బెంగాల్ లోని పురూలియా లో ఒక పల్లెటూరు లో జన్మించారు . తండ్రి రైల్వే లో డాక్టర్ కావడం తో ఒక రేల్వే క్వార్టర్ నుండి మరొక రేల్వే క్వార్టర్ కి జీవితం బదిలీ అవుతూ వచ్చింది . యుక్త వయసు వచ్చిందాకా పల్లెటూళ్లలో గడిపిన బుద్ధదేవ్ తల్లి చదివి వినిపించే భారత , రామాయణ గాథలు , పాడి వినిపించే రవీంద్ర సంగీతం వింటూ బాల్యాన్ని గడిపాడు . తల్లి ఏదైనా కథ చెప్పేటప్పుడు ” కళ్ళు మూసుకుని విను ” అంటూ కథ చెప్పేదట . అలా కళ్ళు మూసుకుని వింటూ రకరకాల దృశ్యాలు , మనసులో చిత్రించుకునే వాడట . అలా కళ్ల వెనుక చిత్రించుకున్న దృశ్యాలన్నీ మనసులో నేల మాళిగలో ఉండి పోయి తన సినిమాలలో అవసరమైనప్పుడు దృశ్య రూపం లోకి వచ్చేవట . అందుకేనేమో ” యువ దర్శకులకు మీరేమైనా చెప్తారా ?” అని ప్రశ్నిస్తే ఒక ఇంటర్వ్యూ లో అతడు ” కవిత్వం చదవండి , కలలు కనండి అని జవాబు చెప్పడు

తన సమకాలీనులైన సత్యజిత్ రే లాగా తన సినిమాలలో కేవల యదార్థత కి , మృణాల్ సేన్ లాగా ఎర్ర పూల వనానికీ మాత్రమే తావు ఇవ్వకుండా ప్రతి సినిమాను ఒక తాత్విక స్పర్శ తో ముగించడం బుద్ధదేవ్ స్పెషాలిటీ . అర్థశాస్త్రం చదువుకుని కొంతకాలం అర్థశాస్త్ర అధ్యాపకుడు గా పనిచేసిన బుద్ధదేవ్ కి తన గమనము , గమ్యము రెండూ సినిమాలలోనే ఉన్నాయని త్వరలోనే అర్ధమై 1968 లో పదినిముషాల ది కాంటినెంట్ ఆఫ్ లవ్ అన్ని డాక్యమెంటరీ తో సినిమా రంగం లో అడుగుపెట్టి , మొదటి సినిమా దూరత్వ ని నిర్మించాక ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు . ఆ తరువాత , నిన్నటి వరకూ అంతా చరిత్ర

“All of us have a cherished dream for which we live. We begin the journey of life to fulfil this dream. But while some of us succeed, some don’t. My films revolve around this quest for the realisation of dreams. ” అనిచెప్పుకునే బుద్ధదేవ్ సినిమాలు అన్నీ ఈ మానసిక

స్వప్నాలను అవసరాలను , కలలను సాకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలే . దూరత్వ , గ్రిహజూద , ఆంధీ గలీ ఈ మూడు సినిమాలను బుద్ధదేవ్ ట్రయాలజీ గా చెప్తారు . ఈ మూడింటినీ కలిపి ఉంచిన అంశం ఏమిటంటే రాజకీయ నిబద్ధతలు , వాస్తవిక భావనలు అనే భ్రమల మధ్య చెలరేగిన ఘర్షణ వ్యక్తుల వైయక్తిక జీవితాలలో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో , అలాంటి విధ్వంసాన్ని ఎలాంటి అరమరికలు లేకుండా చిత్రీకరించడం . మూడు సినిమాలు నక్సలిజం నేపథ్యం లో తీసినవే .

బుద్ధదేవ్ నిండు యవ్వనం లో వున్నప్పుడు అంటే అతడి 23 ఏళ్ళ వయసులో బెంగాల్ లో నక్షలైట్ ఉద్యమం వచ్చింది . ఆ ఉద్యమం బుద్దదేవ్ సంలీనం కాలేదు కానీ చాలాదగ్గరగా చూసాడు . అతడి స్నేహితులు కొందరు ఉద్యమం లోకి వెళ్లారు కూడా . అతడు వాళ్ళను సపోర్ట్ చేసాడు . కానీ వాళ్లతో సన్నిహితంగా ఉండటం వలన ఆ ఉద్యమ లోటుపాట్లు చాలా అతడికి అవగాహన లోకి వచ్చాయి

When the Naxalbari revolt happened, I was a 23, a student. I lived through the movement that followed and saw how it ended up close and personal, unlike Ray or Sen who could have been emotional and optimistic about it. Some of my best friends became Naxalites. I supported them but stayed away myself.Somewhere I felt there was a problem, that their ideology was clashing with the middle-class value system. I felt the core of Naxalism was getting lost on these people. అని దేవర్షి ఘోష్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు

తాను ఖరగ్ పూర్ లో వున్నప్పుడు చూసిన పులి వేషగాళ్ళ ఆటలు ఆధారంగా తీసిన బాగ్ బహదూర్ లో ఒక టిపికల్ బెంగాలీ గ్రామ జీవితాన్ని అత్యద్భుతంగా దృశ్యమానం చేస్తాడు . మిథున్ చక్రవర్తి మృగయా లో నటించి మంచి పేరుతెచ్చుకున్నారు కదా . అంతకంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా బుద్ధదేవ్ తహదెర్ కథ . పదకొండేళ్ళ జైలు లో గడిపి బయటకు వచ్చిన తరువాత బయట అతడికి ఎదురైనా బాహ్య సంఘటనలకు , అతడి లోలోపలి ఆతరంగిక సంస్కారానికి మధ్య జరిగిన ఘర్షణ ని ఒక ఫిలాసఫికల్ టోన్ లో చెప్పిన సినిమా అది

అవార్డుల గురించి పెద్దగా పట్టించుకోని బుద్ధదేవ్ ను చాలా అవార్డు లు కోరి వరించాయి . ఆ అవార్డులకంటే ప్రేక్షకులు తమ హృదయాలలో వేసిన సింహాసనానికి అతడు ఫిదా

బుద్ధదేవ్ బెంగాలీ చాలా కవిత్వం రాశాడు . జిబానంద దాస్ ప్రేరణ తో కవిత్వంలోకి వచ్చిన బుద్ధదేవ్ ఆయన్నే తాను గురువు గా భావిస్తాడు . బుద్ధదేవ్ కవిత్వం ఇంగ్లిష్ లో చాలా అనువాదం అయింది ద అదర్ ఫామ్ ఆఫ్ డెత్ శీర్షికన .

బుద్ధదేవ్ కవిత ఒకటీ

రేపటి నుండి

” ఇదంతా ఎలా జరిగిందా ?” అని ఆలోచిస్తే
చాలా అద్భుతంగా ఉంది .
అసలు దీన్ని అంగీకరించడానికే
చాలా కాలం పట్టింది

జీవితానికీ , కలలకీ అతీతంగా
ఈ ప్రపంచం ఎంతో బావుంది
ఈ రోబో జీవితం మరీ బావుంది
అప్పుడప్పుడూ నేను ఆశ్చర్యపోతూ వుంటాను
మనలనిలా తయారు చేసిందేమిటి
మనలనిలా తయారు చేసిందెవరు ? అని

శబ్దం చేస్తూ నడుస్తున్న అతడి
పాదాల చప్పుడు ,
లోహ గొంతుకతో అతడు పాడే పాటలు
అతడి మందలింపులు
వింటున్నాను కానీ
అతడినెప్పుడూ కళ్ళతో చూడలేదు

కిటికీ లో నుండి తల బయటకు పెట్టి చూసినపుడు
చాలా దూరంగా , మిణుకు ,మిణుకు మంటూ
ఒక పురాతన గ్రహమేదో కనిపిస్తుంది
బహుశా దాన్ని పోల్చుకోనూ లేమేమో

పరిచితమైన పరిమళాలను వెదజల్లే
శ్వాస , చుక్కలోపల చుక్క లా
నువ్వక్కడే ఇంకా వున్నావన్నమాట

నువ్వు కథలు చెప్పిన అమ్మాయి ఎంత పెద్దదైనదో

నువ్వు చెప్పిన మరమనిషి కథలు
తండ్రి గురించే అని ఆమెకు తెలియకపోవచ్చు
ఎన్ని సంవత్సరాలు గడచిపోయాయో నాకైతే గుర్తు లేదు

ఇప్పుడిక నల్లటి ఉదయాలు , నల్లటి మధ్యాహ్నాలు ,
నల్లటి సాయంత్రాలు ఒకదాని వెనుక ఒకటిగా వస్తాయి
మరమనుషుల డాక్టర్ వస్తున్నాడు

నా కోసం
ఒక అల్ట్రా మోడరన్ , అప్ట్ డేట్ , లేటెస్ట్
తలనొకదానికి తీసుకునివస్తున్నాడు
రేపటి నుండి మార్పు త్వరగా మొదలవుతుంది

నేను త్వరగా మారిపోతాను

( బుద్ధదేవ్ దాస్ గుప్తా ది రోబో అండ్ అదర్ పోయెమ్స్ నుండి )

ఉయ్ మిస్ యు సర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles