Mani Bhushan… ✍🏻
42% BC రిజర్వేషన్- CM రేవంత్ రెడ్డి – స్థానిక ఎన్నికలు; తిరిగి తిరిగి మొదటికొచ్చింది.
ఈ తిరుగుడు ఇప్పటిది కాదు. దాదాపు 40 ఏళ్ల క్రితం మరో రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర మొదలైంది.

—
టంగుటూరి రామకృష్ణా రెడ్డి ఉరఫ్ అంజయ్య హయాం (1980-82, 16 నెలలు)లో స్థానిక ఎన్నికలు జరిగాయి. పార్టీ రహితంగా జరగడంతో ‘గెలిచిన వాళ్లందరూ మా పార్టీవాళ్లే’ అన్నారు అంజయ్య.
ఆ తర్వాత బిసిలకు ఏ దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలో తేల్చడానికి ‘మురళీధర రావు కమిషన్’ వేశారు.
కమిషన్ 9 నెలల తర్వాత నివేదిక ఇచ్చిందిగానీ, అప్పటికి అంజయ్య దిగిపోయారు. తర్వాత వచ్చిన ఇద్దరు రెడ్డి ముఖ్యమంత్రులు (భవనం, కోట్ల) పట్టించుకోలేదు.
.
ఎన్.టి.రామారావు తీసుకున్న రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా మండలాల వ్యవస్థ ఏర్పడింది. ఈసారి పార్టీల ప్రాతిపదికన ఎన్నికలకు దిగారు ఎన్టీఆర్.
1983లో కాంగ్రెస్ 60 సీట్లు, 1985లో 50 సీట్లు గెలిచినా వాటిలో ఎక్కువమటుకు తెలంగాణలో ఉన్నాయి. రెడ్డి కులస్తుల ఆధిపత్యమే కాంగ్రెసుకి బలంగా కనబడింది. దీన్ని break చేయాలంటే BCలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలనుకున్న NTR… మురళీధరరావు కమిషన్ నివేదిక బూజు దులిపారు.
ఆ నివేదిక ప్రకారం BCలకు 44 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి NTR సిద్ధపడ్డారు.
.
ఇది తమకు తీరని అన్యాయం చేస్తుందన్న కారణంతో ఆధిపత్య కులాలు రోడ్డెక్కాయి. అంతకు ముందు ఏడాది Gujaratలో జరిగిన ‘Gujarat Anti-reservation Agitation (1985)’ పంథాలోనే 1986లో APలోనూ జరగడం దీనిలో విశేషం. అన్ని పార్టీలు పైకి బీసీలపై ప్రేమ కురిపిస్తూనే వాళ్ల వాళ్ల విద్యార్థి సంఘాలను ఎగదోశాయి. విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో “ఏపీ నవ సంఘర్షణ సమితి (APNSS)” ఏర్పడింది.
ఆధిపత్య వర్గాలు lead చేయడంవల్ల friendly fighting తప్ప violent agitation లేదు. పోలీస్ జీపులు, ప్రభుత్వ కార్లు టైర్లలో గాలి తీసేయడం, ఉస్మానియా వర్సిటీ మీదుగా తిరిగే సిటీ బస్సుల్ని హైజాక్ చేసి వేరే రూట్లకు మళ్లించడం, బూట్ పాలిష్ చేయడం etc etc పనులు సరదా సరదాగా చేశారు. APNSS ఫ్రెండ్లీ నిరసనల్లో అప్పటి టిడిపి లీడర్ రేణుక చౌదరి తమ్ముడు కూడా చురుగ్గా పాల్గొన్నట్లు గుర్తు. బాలగోపాల్ అన్నట్లుగా… They are obviously more accustomed to picnicking than to agitating, for they are agitating as if on a picnic.
BC వర్గాలు తమ వంతుగా APNSSకి వ్యతిరేకంగా AP సమ సంగ్రామ పరిషత్ (APSSP) పేరిట ఉద్యమించారు. కానీ, నెల తిరక్కుండానే పరిషత్ రెండుగా చీలిపోయింది. ఇప్పుడున్న చైతన్యం, పోరాట స్ఫూర్తి అప్పట్లో అణగారిన కులాలకు లేవనే చెప్పాలి. Anti-reservation కథనాలతో “ఈ చదువులు మాకొద్దు” లాంటి సినిమాలు తీసినా ఎవరూ అడ్డుకోలేదు.
.
ఏదయితేనేం, మొత్తం మీద ఎన్టీఆర్ సర్కారు అమలు చేయలేదు. కోర్టు నిర్ణయంతో ఆగిందనుకుంటా. NTR ఆ రోజున తీసుకున్న సాహసోపేత నిర్ణయం అమలయి ఉంటే… ఈ 40 ఏళ్లలో BCల సామాజిక స్థితిగతుల్లో గణనీయ మార్పులు సంభవించేవేమో!
—-
pics : Economic and Political Weekly (1986, Sept)లో బాలగోపాల్ రాసిన ఆర్టికల్
.






