ఏ. ఆర్. రెహమాన్.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పేరు వెనుక కథేంటి..?

ఎ.ఆర్. రెహ్మాన్.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంగీత దర్శకుడి పేరు వెనుక అసలేం జరిగింది..?

ఎందరో సంగీత దర్శకులు చేయాల్సినన్ని ప్రయోగాలు చేసేశారు… ఇళయరాజా అనే పర్వత శిఖరమైతే చేయలేనిదేదీ లేదన్నట్టుగా ప్రతీ పాటతో అలరిస్తూ తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలాంటి సమయంలో, అలాంటి పోటీలో సినిమా సంగీతంలోకి రావడమంటేనే ఆ స్థాయి ప్రతిభా, పాటవాలు అవసరం. అలాంటిది పోటీని తట్టుకుని నిలబడాలంటే మరింత సమర్థత, అంతకుమించిన ఆత్మవిశ్వాసమూ అవసరం. ఇక అలాంటి సంగీత ప్రపంతంలో తనో లెజెండ్ గా గుర్తింపు పొందాలన్నా.. మేస్ట్రోగా విశ్వవిపణిలోకి ప్రవేశించాలన్నా.. తక్కిన సంగీత ప్రపంచం పోటీ పడలేనంత సృజనాత్మకత, పునారవృతం కాని కొత్త ఆలోచలతో ముందుకు సాగుతుండాలి. అలాంటి ప్రయోగాలతో విరుచుకుపడ్డాడు కాబట్టే.. ఇవాళ ఏ.ఆర్. రెహమాన్ కొత్తతరానికి ఓ బ్రాండ్ ఐకాన్ లా మారాడు.

2008లో డ్యానీ బోయెల్ తెరకెక్కించిన స్లగ్ డాగ్ మిలియనీర్ తో జైహో పాట ఆయన్ను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు… ప్రపంచమే ఆయనకేసి చూసేలా చేసింది. దానికి దక్కిన ఆస్కార్ అవార్డ్ ఆయనకు ప్రపంచ సంగీత చరిత్రలో తనకో పేజీని సృష్టించింది. కానీ, ఏ. ఆర్. రెహమాన్ ప్రస్థానం వెనుక అంతే ఆసక్తికర విషయాలు మనకు కనిపిస్తాయి.

రాజ్ కోటి, విద్యాసాగర్ నుంచి మొదలుకుంటే ఎం.ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా వరకూ ఏ.ఆర్. రెహమాన్ గా రూపాంతరం చెందని దిలీప్ కుమార్ పనిచేసిన సినిమాలెన్నో. ఆ సినిమాల్లో మ్యూజిక్ అరెంజర్ గా, కీబోర్డ్ ప్లేయర్ గా కీలక పాత్రధారి. ఆ తర్వాత కొన్ని జింగిల్స్ చేస్తూ ఆయన కమర్షియల్ యాడ్ మార్కెట్ లోకి వచ్చారు. అయితే, అలాంటి దిలీప్ కుమార్ ఏ. ఆర్. రెహ్మాన్ గా ఎలా మారాడో ఓసారి చూద్దాం.

తన తండ్రి చంద్రశేఖర్ మరణం తర్వాత దిలీప్ కుమార్ కాస్తా ఏ. ఆర్. రెహ్మాన్ గా మారాడు. అయితే, తనకు తన పేరెందుకో నచ్చేది కాదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రెహ్మాన్. అలా అని ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ను అవమానపర్చాలనేం కాదు.. అదేంటో తనకే తెలియకున్నా.. తన పేరు తన వ్యక్తిత్వానికి పోలేదని కాదంటాడు రెహ్మాన్. తన చెల్లెలి జాతకం చూపించేందుకు ఓసారి రెహ్మాన్ ఫ్యామిలీ హిందూ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లిందట. అప్పటికే తన పేరు మార్చుకోవాలన్న తలంపుతో ఉన్న రెహ్మాన్ ను చూసిన జ్యోతిష్కుడు.. ఈ అబ్బాయేదో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు.. ఓసారి జాతకం చూద్దామన్నాడట. అలా దిలీప్ కుమార్ జాతకం చూసిన సదరు జ్యోతిష్కుడు.. రెండు ఇస్లాం పేర్లను సూచించాడట.

ఒకటి అబ్జుల్ రెహ్మాన్, రెండు అబ్దుల్ రహీమ్. అయితే, ఈ రెండింటిలోనూ రెహ్మాన్ కు మొదటి పేరే నచ్చేసింది. దాంతో ఇస్లాం వైపు అడుగులేశామంటున్నాడు రెహ్మాన్. అల్లారఖా అంటే దేవుడి రక్షణలో ఉండేవాడని.. అందుకే అల్లారఖా రెహ్మాన్ గా పేరు మార్చుకున్నట్టు చెప్పుకొచ్చాడు ఏ. ఆర్.

తన హిందీ భాషా పరిజ్ఞానం గురించి కూడా మాట్లాడిన రెహ్మాన్.. వెరీ పూర్ అంటూ ఎన్టీటీవీ గుడ్ టైమ్స్ తో చెప్పుకొచ్చారు. తమిళం పాటలను హిందీలోకి అనువదించాల్సిన వచ్చినప్పుడు తానే షేమ్ ఫీల్ అయ్యానని.. ఆ అవమానభారంతోనే హిందీ నేర్చుకున్నట్టు చెప్పాడతను. ఆ తర్వాత ఆ భాషలో నైపుణ్యం కూడా సాధించడం సంతోషమన్నారు ఏ. ఆర్. రెహ్మాన్.

ప్రయోగాలకు కేరాఫ్ గా.. శబ్దానికి ఒక కొత్తరూపునిచ్చిన రెహ్మాన్… సురేష్ పీటర్, సాహూల్ హమీద్, ఉన్నికృష్ణన్, ఉన్నిమీనన్, హరిచరణ్, శ్రీనివాసన్, సుజాత.. ఇలా ఎందరో గాయకులతో సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. 90ల్లోని రెహ్మాన్ పాటలు కచ్చితంగా ఎప్పుడు విన్నా వాహ్ అనిపించేవి. అలా చిన్న అడుగులతో జీవితాన్ని ప్రారంభించి.. ఎలాంటి పెద్ద చదువుల్లేకున్నా… తన కళతో విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన ఏ.ఆర్. రెహ్మాన్ జర్నీ నేటి యువతకు ఓ ఇన్స్పిరేషన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles