అమెరికానే అబ్బురపర్చిన.. భట్ ఆవిష్కరణలు!

అంతటి అమెరికన్ బహుళజాతి కంపెనీకి.. మన భారతీయుడే ప్రచారకర్త!

మనలో చాలామందికి తెలియని మన భారతీయ శాస్త్రవేత్తలెందరో? అందులో ఈ కంప్యూటర్ యుగంలో మనం రోజూ ఉపయోగించే ‘పెన్ డ్రైవ్’ ఎవరు కనుక్కున్నారో తెలుసా…? అలవాటు ప్రకారం ఏ విదేశీయుడో అనుకునేవారూ ఉండకపోరు. కానీ ఆ వ్యక్తి మన భారీతీయుడైతే..? ఆయనే అజయ్ భట్. అక్షరాలా మన భారతీయ శాస్త్రవేత్త.

మన దేశంలో బెంగుళూర్ లో జన్మించిన కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అజయ్ భట్. యూనివర్సల్ సీరియల్ బస్.. అదేనండీ మనము నిత్యం కంప్యూటర్ లో ఉపయోగించే యూఎస్బీ సృష్టికర్త. అంతేనా…? యాక్సిలరేటెడ్ గ్రాఫిక్స్ పోర్ట్ గా పిల్చుకునే ఏజీపి.. పీసీఐ ఎక్స్‌ప్రెస్, ప్లాట్‌ఫాం పవర్ మేనేజ్‌మెంట్ ఆర్కిటెక్చర్ తో పాటు.. వివిధ చిప్‌సెట్స్ అభివృద్ధితో సహా.. నేటి కంప్యూటర్ యుగంలో మనం విస్తృతంగా ఉపయోగించే అనేక సాంకేతికతల సృష్టికర్త.. అభివృద్ధిపర్చిన ఆవిష్కర్త అజయ్ భట్.

గుజరాత్ లోని బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అమెరికాలోని న్యూయార్క్ నగర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు అజయ్ భట్. 1990లో అమెరికాలోని ఫోల్సమ్‌ నగరంలో.. చిప్‌సెట్ ఆర్కిటెక్చర్ బృందంలో సీనియర్ స్టాఫ్ ఆర్కిటెక్ట్‌గా ఇంటెల్‌లో చేరారు. అమెరికాతో పాటు.. అంతర్జాతీయస్థాయిలో తనవైన ఆవిష్కరణలు నూటా ముప్పై రెండింటింకి పేటెంట్లను సంపాదించారు భట్. ఇంకా అనేక పేటెంట్స్ దరఖాస్తులు వివిధ పరిశీలన దశల్లో ఉండగా… 1998, 2003, 2004 సంవత్సరాల్లో అజయ్ భట్ అమెరికాతో పాటు.. ప్రపంచంలోని పలు పేరుగాంచిన యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇవ్వడానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానాన్నందుకున్నారు.

భట్ 1990లో ఫోల్సమ్‌లోని ఇంటెల్ లో చిప్‌సెట్స్ విభాగంలోనూ.. 2002 లో PCI ఎక్స్‌ప్రెస్ స్పెసిఫికేషన్ డెవలప్‌మెంట్‌లోనూ తన కృషికి గుర్తింపుగా “ఎచీవ్‌మెంట్ ఇన్ ఎక్సలెన్స్” అవార్డునందుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా నాన్ యురోపియన్ దేశాల్లో గొప్ప ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా… 2013లో “యురోపియన్ ఇన్వెంటర్ అవార్డ్” ఆయన్ని వరించింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యుత్తమ ఘనత సాధించినందుకు కూడా.. 2013లో లండన్ లో “ద ఏషియన్” అవార్డ్ దక్కింది భట్ కి. 50 మంది అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ ఇండియన్స్ లో ఒకరిగా.. అమెరికా బేస్డ్ గా పనిచేసే జెంటిల్ మెన్ క్వార్టర్ పేరుతో వెలువడే GQ ఇండియా జూలై 2010 సంచిక అజయ్ భట్ ను గుర్తించింది. 2009లో స్పాన్సర్ ఆఫ్ టుమారో ట్యాగ్ లైన్ తో ఇంటెల్ రూపొందించిన కమర్షియల్ టెలివిజన్ ప్రకటన.. మన భారతీయుడైన భట్ స్థాయేంటో తెలియజెప్పేది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో కనిపించిన ఈ కథలు.. జనరల్ నాలెడ్జ్ గానైనా ఇటు తల్లిదండ్రులు, అటు గురువులు పిల్లలకు చెబుతుంటే.. మరెందరో అజయ్ భట్ ల ఆవిష్కరణకు అవకాశం కల్పించినవారమవుతాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles