భారత్ అమ్ములపొదిలో పినాకా: మేక్ ఇన్ ఇండియాకు ప్రతీక!

Viswa A… ✍🏼

మిత్రులారా…
ఒక్కోసారి చరిత్ర నిజంగానే విషాదంగా, విడ్డూరంగా, ప్రహసనంలా పునరావృతమవుతుంది.

1971లో తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్‌లో హిందువులను ఊచకోత కోయడానికి పాకిస్తాన్ ‘ఆపరేషన్ సెర్చ్ లైట్’ ప్రారంభించింది. ఈ నరమేధాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే, అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) పాకిస్తాన్‌కు భారీ రుణం ఇచ్చింది.

మళ్ళీ 1999లో, కార్గిల్ యుద్ధం జరుగుతోంది. భారతీయ వాహనాలపై పాక్ ముష్కరులు దాడి చేస్తున్నారు. అప్పుడు కూడా IMF పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం అందించింది.

The Defence Research and Development Organisation (DRDO) successfully test fired the Guided PINAKA from Pokhran ranges, in Rajasthan on March 11, 2019.

ఇక 2025 విషయానికి వస్తే,
పెహల్గాంలో అమాయక పర్యాటకులను చంపి, వారి భార్యల సింధూరాన్ని తుడిచివేసిన దుర్ఘటన జరిగింది. భారత్ దీనిపై పాకిస్తాన్‌ను నిలదీయాలని ప్రయత్నిస్తుంటే, పాకిస్తాన్ చేసిన తప్పిదానికి శిక్షించాలని చూస్తుంటే, IMF మళ్ళీ ఆర్థిక సహాయం చేసింది. ఇది నిజంగా విషాదం!

అయితే,
1971లో కానీ, 1999లో కానీ, అన్ని విధాలా సహాయం పొందిన పాకిస్తాన్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయింది, పరాజయం పాలైంది. 2025లో కూడా అదే జరుగుతుందేమో.

అందుకే, పెహల్గాంకు ప్రతీకారంగా భారత్ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఉగ్రవాదానికి ప్రాణ కేంద్రాలైన బహావల్పూర్, మురీద్కేలు కూడా ఆ దాడుల్లో ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ దిగ్భ్రాంతి చెందింది.

బాలాకోట్ లాంటి చిన్న దాడి జరుగుతుందేమో అనుకుంది కానీ, భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి బహావల్పూర్ వరకు దాడి చేస్తుందని ఊహించలేదు. ప్రపంచంలో పాకిస్తాన్ పరువు పోయింది. తన ప్రజలకు ఏదో చేసి చూపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే టర్కీ నుండి అరువు తెచ్చుకున్న డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది.

బుధ, గురు, శుక్రవారాల్లో జరిగిన ఈ డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్రయత్నించగా, జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్ ప్రాంతాలపై దాడి చేసిన డ్రోన్లను, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 100% సక్సెస్ రేటుతో అడ్డుకుంది. ఒక్క డ్రోన్ కూడా లక్ష్యాన్ని చేరలేకపోయింది. ఇది ఒక ఘన విజయం.

దీనికి ప్రతిస్పందనగా,
భారత్ తన స్కై స్ట్రైకర్ డ్రోన్లను, మిసైళ్లను పాకిస్తాన్ గగనతలంలోకి పంపింది. ఇప్పటికే లాహోర్, సియాల్కోట్‌లోని పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తునీయలైపోయింది. దాంతో భారత్ నిరాఘాటంగా తన మిసైళ్లను, డ్రోన్లను పంపగలిగింది.

పాకిస్తాన్‌లోని నాలుగు ప్రధానమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై భయంకరమైన దాడులు జరిగాయి. రన్‌వేలు ధ్వంసమయ్యాయి, విమానాలు నాశనమయ్యాయి. రావల్పిండికి దగ్గరలోని నూర్ ఖాన్ ఎయిర్ స్ట్రిప్ (ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది) ధ్వంసమైంది. అక్కడ విమానాలు తగలబడుతున్న వీడియోలు కూడా వచ్చాయి.

చక్వాల్, మురీద్, జాంగ్‌లలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడులతో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పనిచేయడం లేదు. వారి డ్రోన్ల ఆరు కేంద్రాలను ధ్వంసం చేశారు. అక్కడి నుండి విమానాలు ఎగరడానికి వీలు లేకుండా నాలుగు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లను నాశనం చేశారు. సర్గోదా, ఇతర ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. అయితే, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవు.

పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా ఏమీ సాధించలేకపోయింది. వారి మూడు ఫైటర్ ప్లేన్లు మన గగనతలంలోకి ప్రవేశించగా, బారాముల్లా, బద్గాం ప్రాంతాల్లో మన మిసైళ్లు వాటిని కూల్చివేశాయి. ఒక విమానం పూర్తిగా దగ్ధమైంది, అందులోని సిబ్బంది మరణించి ఉంటారు. మరొకరు అరెస్టయ్యారు. మొత్తానికి, పాకిస్తాన్ వైమానిక దాడి చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

తమాషా ఏంటంటే,
1971 యుద్ధ సమయంలో కూడా భారత్ మొదట పాకిస్తాన్ యొక్క వైమానిక శక్తిని పూర్తిగా ధ్వంసం చేసింది. వారి ఎయిర్ పోర్ట్‌లను, ఎయిర్ ఫోర్స్ స్టేషన్లను నిష్క్రియం చేసింది. ఈసారి కూడా అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ విమానాలు గానీ, డ్రోన్లు గానీ గగనతలంలోకి ఎగిరితే, అవి లక్ష్యాన్ని చేరడం కష్టం. భారత ప్రతిదాడి వల్ల అవి మధ్యలోనే ధ్వంసమవుతున్నాయి.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,
భారత్ ఉపయోగిస్తున్న స్పైస్ స్ట్రైకర్ డ్రోన్లు, ఇతర మిసైళ్లు చాలా కాలం మన దేశంలోనే కొందరు వేళాకోళం చేసిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకాల్లో భాగంగా తయారైనాయి.

2021లో మనం ఇజ్రాయిల్ నుండి కొన్ని స్పైస్ స్ట్రైకర్ డ్రోన్లను కొనుగోలు చేసినప్పటికీ, ఆ తర్వాత వాటి తయారీ బెంగళూరులో జరిగింది. ఇవి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళగలవు, 5 నుండి 20 కిలోల బరువున్న మందుగుండును తీసుకెళ్లగలవు, సమర్థవంతంగా పనిచేయగలవు.

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పినాక, ఇతర క్షిపణులు అన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే. ‘ఆత్మనిర్భర్ భారత్’ లేదా ‘మేక్ ఇన్ ఇండియా’ యొక్క ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము.

టర్కీ, చైనా నుండి తెచ్చుకున్న విమానాలు కుప్పకూలుతున్నాయి. F16 లు కూలిపోతే అమెరికా నుండి పాకిస్తాన్‌కు తీవ్రమైన హెచ్చరిక వస్తుంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా బెంబేలెత్తింది.

అనధికారిక సమాచారం ప్రకారం,
పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ), ఆర్మీ చీఫ్ తర్వాత అతిపెద్ద పదవి ఇది, భారత డీజీఎంఓతో సంప్రదింపులు జరుపుతున్నారట. పరిస్థితిని ఎలా తగ్గించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

మొదట దుందుడుకుగా ప్రవర్తించి, ఇప్పుడు పర్యవసానాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయమై, భారత్ చెప్పినట్టుగా ఉగ్రవాదులను అప్పగిస్తే, ఈ డీజీఎంఓల చర్చలకు ఏదైనా ఫలితం ఉండవచ్చు.

అయితే, ఈ స్థాయి చర్చలు జరుగుతాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఏదేమైనప్పటికీ, భారత్ మరొక్కసారి పాకిస్తాన్‌కు గర్వభంగం చేసింది!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles