బాలీవుడ్ వార్తలపై చాలామందికి ఆసక్తి. అలాంటి బాలీవుడ్ లో తగాదాలంటే మరింత క్రేజ్. ఈ మధ్య బాలీవుడ్ లో ఇచ్చే ఫిల్మ్ ఫేర్, ఐఫా అవార్డ్స్ పైన రచ్చ మొదలైంది. నాల్గైదు పాటలను ఎంపిక చేసి… ఆ ప్రతిపాదనల్లో ఎవరో ఒకరికి బెస్ట్ సింగర్ అవార్డ్ ఇవ్వడమంటే.. అప్పటికే సూపర్ హిట్ అయిన ఆ మిగిలిన పాటలన్నీ వేస్ట్ కింద లెక్కగట్టినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ సింగర్స్. అంతేకాదు, ఆ ఈవెంట్ కు ఆ గాయకులందరినీ పిల్చి ఎవరో ఒకరికి అవార్డ్ ఇవ్వడమేంటన్నదీ వారి ప్రశ్న. మీరెవరైనా సింగర్ నో.. లేదా, ఏదైనా పాటనో బెస్ట్ అని అనుకుని ముందే ప్రిపేరై ఉంటే వారిని మాత్రమే పిలవండనే సూచనా ఇస్తున్నారు.

కొంత వివాదాస్పదంగా వ్యవహరించే మికాసింగ్ ఇప్పుడీ రచ్చలోకొచ్చి నిలబడ్డాడు. సోనూనిగమ్ ను అవమానించి ఆయుష్మాన్ ఖురానాకు ఫిలింఫేర్ ఇవ్వడంపై మికాసింగ్ ఓ యూట్యూబ్ ఛానల్ లో తన అభిప్రాయాలను లేవనెత్తారు. అవసరమైతే.. అతణ్ని పిలవకుండా ఉండేదుండే… ఉస్కో బులావో హి మత్ అంటున్నాడు మికాసింగ్.
సుమారు రెండు దశాబ్దాలకుపైగా మికాసింగ్ ఎలాంటి పురస్కారాల కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. తమ పాట జన బాహుళ్యంలో అత్యంత ఆదరణ పొందాక.. ఇతర పాటలకంటే ఎలా వెనుకబడుతుందో తనకర్థం కాదని.. అందుకే తాను ఆ అవార్డ్స్ ఫంక్షన్స్ ని అవాయిడ్ చేస్తున్నట్టు చెబుతున్నాడు తను. శుభాంకర్ మిశ్రా అనే యూట్యూబ్ ఛానల్ హోస్ట్ తో మాట్లాడిన మికా.. ఈమధ్య సోనూనిగమ్ వంటి సింగర్ పాడి సూపర్ హిట్టైన పాటను ప్రతిపాదనల్లో ఉంచి… అవార్డ్ ఇవ్వకుండా ఆయుష్మాన్ ఖురానాను ఎంపిక చేసిన తీరుపై తన అభ్యంతరం వ్యక్తం చేశాడు.
మికాసింగ్ ఏమంటాడంటే..?
నేను పాడిన చాలా పాటలు హిట్టయ్యాయి. కానీ, నాకు ఇప్పటివరకూ ఒక్క అవార్డ్ కూడా దక్కలేదు. కనీసం నామినేషన్ వరకు కూడా వెళ్లలేదు. కారణమేంటంటే, జనంలో హిట్టైన ఒక పాటను ప్రతిపాదనల్లో పెట్టి.. ఆ తర్వాత దానికి అవార్డ్ దక్కకపోతే దాని స్థాయిని తగ్గించినట్టేనని.. అందుకోసం ఎవరికైతే అవార్డ్ ఇవ్వాలనుకుంటున్నారో వారికివ్వండి తప్ప.. ప్రతిపాదనల్లో హిట్ సాంగ్స్ ను చేర్చొద్దని 2011లోనే తాను సూచన చేశానంటున్నాడు. దానివల్ల జనాదరణ పొందిన పాట కంటే కూడా ఆదరణ పొందిన పాట గనుక బెస్ట్ సాంగ్ గా గుర్తింపు పొందితే అది చాలా బాధాకరంగా ఉంటుందన్నది మికాసింగ్ అభిప్రాయం. అప్పట్నుంచీ తన పాటలు కనీసం నామినేషన్స్ కు కూడా నోచుకోలేదన్నది మికాసింగ్ చెబుతున్న మాట.
సోనూనిగమ్ అగ్నిపథ్ కోసం పాడిన అభీ ముజ్ మే కహీ పాట చాలా బాగుంది. ఆ తర్వాత నా మరో సోదరుడు ఆయుష్మాన్ ఖురానా విక్కీ డోనర్ లో పాడిన పాట పానీ దా రంగ్ పాట ఆ ప్రాబబుల్స్ ఉంది. ఆ ప్రతిపాదనల్లో ఆయుష్మాన్ ఖురానాకు అవార్డ్ దక్కింది. అంటే, సోనూనిగమ్ పాట బాలేదన్నట్టా..? అప్పుడతణ్ని అవార్డ్స్ ఫంక్షన్ కి ఎందుకు పిలవాలన్నది మికాసింగ్ ప్రశ్న..? అది ఒక లెజెండరీ సింగర్ ను అవమానించడం కాదా అంటున్నాడు మికా. ఆ ప్రతిపాదనల్లో బెస్ట్ సింగర్ అవార్డుకు సోనూ పూర్తిగా అర్హుడు. కానీ, ఆయుష్మాన్ ఖురానాను ఎంపిక చేయడం కొంత గందరగోళానికి తెరలేపింది. అవమానించడానికే అలాంటి లెజండరీ సింగర్స్ ను పిలుస్తారా అంటూ అవార్డ్ ప్రొసీజర్ పైనే ఫైర్ అవుతున్నాడు మికాసింగ్.
2013లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో జరిగిన ఈ ఘటనను ఉదాహరణగా చెబుతూ అవార్డ్స్ ఫంక్షన్స్ ఎలా తయారయ్యాయో చెప్పే ప్రయత్నం చేశాడు మికాసింగ్. తన అభ్యర్థన కూడా ఒక్కటేనని మంచి గాయకులు ఈ అవార్డులు, రివార్డుల గురించి పట్టించుకోకుండా వారికొచ్చే షోస్ లో వారి ప్రతిభను కనబరుస్తూ వారికొచ్చే ఇతర అవకాశాలను ముందుకెళ్లాలన్నది మికాసింగ్ సూచన.
అయితే, ఈ విషయంపై తాజాగా సోనూనిగమ్ కూడా అవార్డుల తీరుపై ఫైర్ అయ్యాడు. 2025 ఐఫా అవార్డ్స్ విషయంలోనూ ఇలాంటి రచ్చే జరిగింది. భూల్ భులయ్యా సినిమాలో కనీసం తన పాటను నామినేట్ కూడా చేయనందుకు సోనూ ఆక్షేపించాడు. ఆ అవార్డ్స్ ఫంక్షన్ రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగింది. తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ సోనూ సోషల్ మీడియాలో పోస్ట్స్ కూడా పెట్టారు.
బాలీవుడ్ అవార్డ్స్ ఫంక్షన్స్ ను భారీగా నిర్వహించే ఫిల్మ్ ఫేర్, ఐఫా వంటి సంస్థల అవార్డుల తీరు వివాదాస్పదమవుతుండటం ఒకవైపు కనిపిస్తుంటే.. తాము పాడిన పాటలకు కచ్చితంగా పురస్కారం లభించాలనే గాయకులు కొందరు… తమకున్న అసంతృప్తినిష ఆగ్రహాన్ని మరొకరి పేర్లను ప్రస్తావిస్తూ కొందరు.. మొత్తంగా ఈ పురస్కారాల కార్యక్రమాల పట్ల ఒక తిరస్కారాన్ని ఏర్పర్చేలా చేస్తున్నారు.



