ఈ క్షణంలో బతికితేనే కదా.. రేపనేది వచ్చేది..? Three of US ఏం చెప్పింది..??

Shanthi Ishaan ✍️

రేపు ఈ గజిబిజి బతుకు మళ్ళీ మొదలవుతుంది

భారమైన ఆశల్ని ఊపిరి ఊరకే మోసుకు తిరుగుతుంది

ఈ క్షణంలో బతికెయ్; అప్పుడే కదా తెల్లవారుతుంది!

ఏదో దారిలో పయనం సాగుతోంది

జీవితం ఎటు రమ్మంటే అటే పోతోంది

ఈ క్షణంలో బతికెయ్; అప్పుడే కదా తెల్లారుతుంది!

లక్షల ముత్యాలను భద్రంగా ఏరి దాచుకుంటావు

పోయే రోజున మాత్రం నీ పిడికిట మిగిలేది శూన్యమే!

ఈ క్షణంలో బతికెయ్; అప్పుడే కదా తెల్లారుతుంది!

(సినిమాలోని ఓ కవితకు స్వేచ్ఛానువాదం)

నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు. ఇక్కడుంటే అక్కడుండాలని ఆరాటం; అక్కడుంటే ఇక్కడుండాలని పోరాటం. ఇదుంటే అది కావాలన్న ఆశ; అదుంటే ఇది లేదన్న నిరాశ. ఉన్న చోటు నచ్చదు. చేతిలో ఉన్నది సరిపోదు. అసలీ క్షణమే అక్కర్లేదనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. కానీ ఈ క్షణంలో బతికితేనే కదా రేపనేది వచ్చేది!

ఒక్కసారి ఈ ఉరుకులు పరుగులు ఆపి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీకెక్కడుండాలనిపిస్తుంది? అదే మీ ఉద్గమ స్థానం. అంటే ఆవిర్భావం, పుట్టుక. మీకు చెందే చోటు, మీరు చెందే చోటు! Three of Us సినిమాకి ఇదే baseline.

శైలజ (Shefali Shah) కూడా ఓరోజు అలాంటి ఉరుకులు పరుగుల జీవితం నుంచి బ్రేక్ తీసుకుని ఒక్క క్షణం ఆలోచించింది. ఇప్పుడిప్పుడే తనలో డెమెన్షియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉదయం లేవగానే ఏం చేయాలో, ఆఫీసుకెళ్ళాలంటే ఏం పట్టుకెళ్ళాలో కూడా తను డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటుంది. రానురాను మతిమరుపు ముదరడమే తప్ప తగ్గేది లేదని శైలజకి తెలుసు. అందుకే వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుంటుంది. అన్ని విషయాలూ పూర్తిగా మరిచిపోయేలోపే ఓ చోటుకు తీసుకెళ్ళమని భర్తను అడుగుతుంది. కొంకణ్ తీరంలో ఉందా ప్రాంతం. శైలజ 5th నుంచి 8th క్లాస్ వరకు చదివిన ఊరది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత శైలజ భర్త దీపాంకర్ (Swanand Kirkire)తో కలిసి ఆ ఊరు వెళ్తుంది. చిన్నప్పడు తనను మూగగా ప్రేమించిన స్నేహితుడు ప్రదీప్ ను (Jaideep Ahlawat) కలుస్తుంది. అతను, భర్త వెంట రాగా వారం రోజుల పాటు ఆ ఊరంతా కలయతిరిగి పాత స్మృతులను నెమరువేసుకుంటుంది. అలా ఆ ముగ్గురు సాగించిన జ్ఞాపకాల ప్రయాణమే Three of Us!

తను మొదలైన చోటు అంటే ఉద్గమ స్థానానికే శైలజ మళ్ళీ చేరుతుంది. చిన్ననాటి గురుతులను తనివితీరా తడిమి చూసుకుంటుంది. తనను తాను పలకరించుకుంటుంది, ప్రేమించుకుంటుంది. తనను తాను క్షమించుకుంటుంది, అక్కున చేర్చుకుంటుంది. మొత్తానికి తనను తాను మర్చిపోయేలోపే తనను తాను తిరిగి పొందుతుంది.

సినిమా చూస్తున్నంతసేపూ మనమూ శైలజతో పాటే నవ్వుతాం, ఏడుస్తాం; నడుస్తాం, పరిగెడతాం. సముద్ర తీరం, కొబ్బరి చెట్లు, చిన్ననాటి ఇల్లు, ఇంటి పెరడు, పాడుబడ్డ బావి, తను చదివిన స్కూలు బిల్డింగు, క్లాస్ రూం, బ్లాక్ బోర్డు, పిచ్చి రాతలు రాసుకున్న చెక్క బెంచీ- ఇలా తన ప్రతి జ్ఞాపకమూ మనదవుతుంది.

సినిమా pace చాలా నెమ్మదిగా సాగుతుంది. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా రియల్ టైంలో రన్ అవుతున్నట్లుగా ఉంటుంది. ఏదో మన చుట్టుపక్కల జరుగుతున్నంత సహజంగా అనిపిస్తుంది. ఆ realistic featureకి nostalgia జత కావడం వల్ల చిన్నపాటి సినిమాటిక్ టోన్ కనిపిస్తుంది.

పాతాళ్ లోక్ లాంటి intense and poignant వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన అవినాశ్ అరుణ్ ఈ sensible and sensitive సినిమాకి దర్శకుడు. Patal Lok, Three of Us రెండూ ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాంటివి. కానీ రెంటిలోనూ subtle sensitivity, philosophical approach కనిపిస్తాయి. పాతాళ్ లోక్ లో ఆ లక్షణాలు under currentలాగా ప్రవహిస్తే Three of Usలో మాత్రం కథను, కథనాన్ని చుక్కానిలాగా ముందుండి నడిపిస్తాయి.

అవినాశ్ అరుణ్ ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రమే కాదు సినిమాటోగ్రాఫర్ కూడా. కొంకణ్ తీరపు అందాలను అతను క్యాప్చర్ చేసిన తీరు అద్భుతం. ప్రతి ప్రేమూ ఓ అందమైన కవితలాగా అనిపిస్తుంది.

ఈ సినిమాలో అసలు బ్యూటీ ఏంటో తెలుసా? Narrative మొత్తం linear styleలో సాగుతుంది. అంటే flashbacks ఏమీ ఉండవన్న మాట (రెండే రెండు చిన్నప్పటి సీన్స్ శైలజ ఊహల్లో ఇలా కనపడి అలా వెళ్ళిపోతాయి). చిన్ననాటి జ్ఞాపకాల మీద base అయిన ఒక nostalgic movieలో flashback scenes అన్నవే లేకుండా sustain చేయడం అసలు సాధ్యమేనా? సాధ్యమే అని డైరెక్టర్ ప్రూవ్ చేశాడు. పక్కా screenplay, actors’ performance ద్వారా ఆ ఫీల్ ని రాబట్టాడు. ఈ ఎలిమెంట్ నాకు చాలా గొప్పగా అనిపించింది.

సినిమాలోని ప్రతి సీనూ నాకు నచ్చుతుంది. కానీ బాగా నచ్చిన సీన్ మాత్రం ఒకటుంది. శైలజ తన చిన్ననాటి ఫ్రెండ్ ప్రదీప్ తో కలిసి జెయింట్ వీల్ ఎక్కినప్పుడు దాన్ని కాసేపు గాల్లో ఆపేస్తారు. ఆ ఐదు నిముషాల సీన్ లో జీవన సారం మొత్తం దిగినట్లుగా అనిపిస్తుంది.

“ఇక్కడికొచ్చే ముందు ఎప్పుడెప్పుడు వస్తానా అని తహతహలాడాను. ఇక్కడికొచ్చాక ముంబయి ఎప్పుడు వెళ్తానా అనిపిస్తుంది. కానీ ఈ ఒక్క క్షణం మాత్రం ఎలాంటి ఆరాటం, ఆత్రం లేదు. కాలం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపిస్తుంది” అని శైలజ ప్రదీప్ తో చెబుతుంది. ఆ ఒక్క క్షణం తను తానుగా బతుకుతుంది. అటు ప్రదీప్ కూడా అంతే. 30 ఏళ్ళ నాటి అమాయకత్వం ఇద్దరినీ ఆవరిస్తుంది. ఆనాటి బాధనంతా తలపోసుకుని బరువు దించేసుకుంటారు. ఆ వెంటనే జెయింట్ వీల్ మళ్ళీ తిరగడం మొదలవుతుంది- జీవితమంటే ఇలాంటి చక్రమే అన్నట్లుగా. Director ఈ సీన్ ని చాలా poeticగా, aestheticగా కంపోజ్ చేశారు. ఆ కంపోజిషన్ ఏమాత్రం చెడకుండా షెఫాలీ, జైదీప్ జీవించేశారు.

నాకు నచ్చే సీన్ ఇంకొకటుంది. శైలజ గుడిసెలో ఉండే మంత్రగత్తెతో వెళ్ళి మాట్లాడే సీన్ అది. ఈ సీన్ surrealisticగా అనిపిస్తుంది. ఇద్దరి మాటలూ నేరుగా ఉండవు, metaphoricalగా ఉంటాయి. అసలా ముసలమ్మ నిజమా లేక శైలజ భ్రమనా అనేది డైరెక్టర్ మన ఊహకే వదిలేస్తాడు. కానీ ఆవిడతో మాట్లాడాకే శైలజ ఎంత కాలం నుంచో మోస్తున్న అపరాధ భావాన్ని దించేసుకుని తేలిక పడుతుంది.

షెఫాలీ షా సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసిందనే చెప్పాలి. ఆవిడ expressions, dialogue delivery, subtle gestures శైలజ characterకి ప్రాణం పోశాయి. ఇక జైదీప్ అహ్లవాత్ గురించి ఏం చెప్పాలి. పాతాళ్ లోక్ తర్వాత ఇతగాడు నాకు ఫేవరెట్ అయిపోయాడు. జైదీప్ characterization ఆ సిరీస్ కే గొప్ప highlight. ఆ characterization కి ఏమాత్రం తగ్గకుండా నటించాడతను, కాదు జీవించాడు. ఇప్పుడీ సినిమాలోనూ జైదీప్ యాక్టింగ్ లో ఆ మెచ్యురిటీ, warmth కనిపించాయి. శైలజ భర్తగా చేసిన Swanand Kirkire, ప్రదీప్ భార్యగా చేసిన Kadambari Kadam లీడ్ పెయిర్ ని బాగా సపోర్ట్ చేశారు.

మొత్తానికి ఈ సినిమా గంటా నలభై నిముషాల దృశ్య కావ్యం. ఆ కాసేపూ మిమ్మల్ని nostalgic worldలో తిప్పి తీసుకొస్తుంది. ఆ అనుభూతి కోసమైనా ఈ సినిమాని మిస్ కావద్దు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles